అమలాపురం గడియార స్తంభం సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం గడియార స్తంభం సెంటర్
గడియార స్తంభం సెంటర్
అమలాపురం గడియార స్తంభం సెంటర్
ప్రదేశంఅమలాపురం , ఆంధ్రప్రదేశ్ భారత దేశం
ప్రారంభ తేదీ1957

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లో ప్రధాన పట్టణమైన అమలాపురంలోని ప్రధానమైన కూడళ్ళలో ఈ గడియార స్తంభం 1957 లో నిర్మించారు.

చరిత్ర[మార్చు]

ఈ గడియార స్తంభం దాదాపు 6 దశాబ్దాల చరిత్ర కలిగినది. 1957 లో దీన్ని నిర్మించారు. నాలుగు దిక్కులా గడియారాలు కనిపిస్తూ, ప్రజలకు సమయం చూసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేది. అమలాపురం లో ఒక చారిత్రిక కట్టడంగా పేరు పొందింది.

ఉద్యమాలు[మార్చు]

రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఇది ప్రధాన వేదికగా ఉంది. ఇక్కడ నుండే ప్రజలు నిరసనలు తెలియజేసేవారు.

శిధిలస్థితి[మార్చు]

ఈ చారిత్రిక కట్టడం శిధిల స్థితికి చేరుకోవడంతో గడియారాలు పనిచేయడం మానేసాయి. పాత గడియార స్తంభాన్ని పూర్తిగా తొలగించి దాదాపు కోటి రూపాయలు ఖర్చుతో కొత్తగా నిర్మించారు.[1] [2]

మూలాలు[మార్చు]

  1. http://chowkwww.you2repeat.com/watch/?v=k-LS6CyJGpA
  2. http://www.prajasakti.com/Article/kadapa/1658450