బడేటి కోట రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బడేటి కోట రామారావు(బుజ్జి)

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2019
ముందు ఆళ్ల నాని
తరువాత ఆళ్ల నాని
నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 26 డిసెంబర్ 2019
ఏలూరు
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
జీవిత భాగస్వామి రేణుక
బంధువులు ఎస్వీ రంగారావు (మేన మామ)
సంతానం లక్ష్మిహాస & చంద్రహాస
పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

బడేటి కొత్త రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

బడేటి బుజ్జి 1964లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ఆయన బి.కామ్ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బడేటి బుజ్జి 1989లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు మున్సిపాలిటీ నుండి పోటీ చేసి మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచాడు. ఆయన తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై ఏలూరు మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా పని చేశాడు. బడేటి బుజ్జి 2019లో ప్రజారాజ్యం పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓడిపోయాడు. బడేటి బుజ్జి తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల నాని పై 24603 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి 4072 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మరణం[మార్చు]

బడేటి కోట రామారావు 26 డిసెంబర్ 2019న గుండెపోటు రావడంతో ఏలూరులో మరణించాడు. ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. 10TV (26 December 2019). "టీడీపీలో విషాదం: కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మృతి" (in telugu). Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. TV9 Telugu (26 December 2019). "బడేటి బుజ్జి పాడెను మోసిన చంద్రబాబు". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "తెదేపా నేత బడేటి బుజ్జి కన్నుమూత". Eenadu. 26 December 2019. Archived from the original on 26 December 2019. Retrieved 26 December 2019.