సప్పా దుర్గాప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్పా దుర్గాప్రసాద్
సప్పా దుర్గాప్రసాద్
జననంసప్పా దుర్గాప్రసాద్
1960
ఇతర పేర్లుసప్పా దుర్గాప్రసాద్
ప్రసిద్ధినాట్య శాస్త్ర కళాకారులు
తండ్రిసత్యన్నారాయణ
తల్లిరమణమ్మ
వెబ్‌సైటు
దుర్గా ప్రసాద్ గూర్చి

సప్పా దుర్గాప్రసాద్ 1960 నవంబరు 7 వ తేదీన సప్పా సత్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు విజయవాడలో జన్మించారు . తన 15 వ సంతత్సరంలో నాట్య శాస్త్రం పై దృష్టి పెట్టాడు. నృత్యం పై ప్రాథమిక జ్ఞానాన్ని తన తండ్రి నుండి చేర్చుకున్నారు. ఆయన "వీణ", "మృదంగం",, "నృత్యం" వంటి కళా రంగాల్లో విశేష ప్రతిభను సాధించాడు.

ఈయన "ఆంధ్ర నాట్యం", "పేర్చి శివ తాండావం" లను పద్మశ్రీ అవార్డు గ్రహీత నటరాజు రామకృష్ణ నుండి శిక్షణ పొందారు. గురుదక్షిణగా ఆయన తన గురువు "నటరాజు రామకృష్ణ" పేరు మీదుగా 1983 లో యువ కళాకారులకు ప్రాచీన నృత్యం, సంగీత రీతులలో శిక్షనను యిచ్చుటకు ఒక సంస్థను స్థాపించారు.

రచనలు

[మార్చు]
 • నృత్య కావ్యాలు : "సిరిమువ్వలు", "ఆంధ్రులు-నృత్యకళ", "ఆలయ నృత్యం"
 • చారిత్రక నవలలు : "పుష్పాంజలి", "ప్రేమాంజలి"
 • నవలలు : "అమరవసంతం", "సుమాంజలి"
 • పద్యాల సేకరణలు: "హృదయం", "తాందవేశ్వర శతకం"
 • యితర పుస్తకాలు : "పర్యటాన", "స్మృతి పరిమళం"
 • వివిధ పత్రికలలో ప్రచురితాలు: "భక్త అన్నమాచార్య", "శ్రీ గణనాథం భజామ్యహం", "శ్రీ శంకర విజయం", "ప్రవరాఖ్య విజయం"

నృత్య దర్శకత్వం

[మార్చు]
 • నృత్య నాటికలు : భక్త అన్నమాచార్య, ఓంకార గణపతి, భస్మాసుర చరితం.
 • తెలుగు సినిమాలు : సూత్రధారులు, అమ్మాయి నిశ్చితార్థం
 • దూరదర్శన్ లో నృత్య నాటికలు : శాంతి తీరాలు, పుష్కర గౌతమి.
 • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొరకు "గోదావరి పుష్కర స్వాగత గీతం"
 • 2006 మహానాడులో స్వాగత గీతం

యితర దేశాల పర్యటనలు

[మార్చు]

శ్రీలంక, మలేసియా, ధాయ్‌లాండ్, సింగపూర్, నేపాల్,, భూటాన్.

సేవలు

[మార్చు]
 • జిల్లా పాఠశాల విద్యా అభివృద్ధి రెవ్యూ కమిటీ సభ్యులు.
 • గోదావరి పుష్కర సాంస్కృతిక కమిటీ సభ్యులు (1991-2003)
 • జిల్లా కళాకారుల సంఘం యొక్క గౌరవ కార్యదర్శి.
 • నాట్యాచార్యుల సంఘానికి ఉపాధ్యక్షులు.
 • రాజమండ్రి రోటరీ క్లబ్ డైరక్టర్.
 • నటరాజ నృత్య నికేతన్, ప్రిన్సిపాల్
 • నాదబ్రహ్మ త్యాగరాజ ఆరాధన కమిటీ, తుమ్మిడి ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవ సలహాదారు.
 • నేదూరి లైబ్రరీ కమిటీ, జిల్లా విద్యా అభివృద్ధి రెవ్యూ కమిటీ, ఎస్.వి.ఆనం కళాకేంద్ర కమిటీ లకు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుడు.
 • ఆలయనృత్య కళా క్షేత్రం యొక్క వ్యవస్థాపకుడు.
 • నంది నాటకోత్సవం-2007 -టి.ఎస్.ఆర్ కళా పీఠం, రాజమండ్రి జోన్ యొక్క ఆవాహన కమిటీ సభ్యులు

శిష్యులు/శిష్యురాళ్ళు

[మార్చు]

డా.లక్ష్మణ్ ఆదిమూలం - అరసి శ్రీ

యర్రంశెట్టి సతీష్‌కుమార్ - యశస్వి - కవి)

మద్దనాల లక్ష్మి జ్యోతి

వరలక్ష్మి

రమ్య

క్షీర సాగరిక

మద్దనాల దీప్తి

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.