కళారత్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద మరియు గిరిజన కళలు.
వ్యస్థాపితం 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2015
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000

కళారత్న పురస్కారం పూర్వం హంస పురస్కారం [1], ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు.[2] ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద మరియు గిరిజన కళలలో ఉన్నత కృషికి ప్రదానం చేస్తారు.

పురస్కారం[మార్చు]

ఈ పురస్కారాన్ని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు. 30,000 రూపాయల నగదు, శాలువా, బంగారు పూత హంసను పురస్కారంలో భాగంగా ఇస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

కళారత్న పురస్కారాలు - 2015[మార్చు]

2015 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 మందికి పురస్కారాన్ని అందించింది.[3][4]

కళారత్న పురస్కారాలు - 2018[మార్చు]

2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 47 మందికి కళారత్న పురస్కారం అందజేయడ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్, శాసనసభ ఉప సభాధిపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/hamsa-awards-are-now-kalaratna/article3091236.ece
  2. http://apculturedept.com/artservlets/jsp/raga/awards.html
  3. http://www.thehindu.com/news/national/andhra-pradesh/hamsa-and-ugadi-awards-announced/article7013333.ece
  4. తెలుగువన్ (19 March 2015). "పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు". Retrieved 20 March 2018. Cite news requires |newspaper= (help)
  5. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (18 March 2018). "పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Retrieved 18 March 2018. Cite news requires |newspaper= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కళారత్న&oldid=2661877" నుండి వెలికితీశారు