కళారత్న పురస్కారాలు - 2018
స్వరూపం
| కళారత్న | ||
| పురస్కారం గురించి | ||
|---|---|---|
| విభాగం | సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు. | |
| వ్యవస్థాపిత | 1999 | |
| మొదటి బహూకరణ | 1999 | |
| క్రితం బహూకరణ | 2017 | |
| మొత్తం బహూకరణలు | 47 | |
| బహూకరించేవారు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | |
| నగదు బహుమతి | ₹ 50,000 | |
| Award Rank | ||
| 2017 ← కళారత్న → 2019 | ||
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న (హంస) పురస్కారం.[1] 2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 47 మందికి కళారత్న పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్, శాసనసభ ఉప సభాధిపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.[2]
పురస్కార గ్రహీతలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | రంగం | జిల్లా పేరు |
|---|---|---|---|
| 1 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | సాహిత్యం | తూర్పుగోదావరి జిల్లా |
| 2 | వేటూరి ఆనందమూర్తి | సాహిత్యం | కృష్ణా జిల్లా |
| 3 | అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి | సాహిత్యం | గుంటూరు జిల్లా |
| 4 | ఎస్.కె. హుస్సేన్ సత్యాంగి | సాహిత్యం | కడప జిల్లా |
| 5 | ఎం.పి. జానుకవి | సాహిత్యం | ప్రకాశం జిల్లా |
| 6 | వాసా ప్రభావతి | సాహిత్యం | గుంటూరు జిల్లా |
| 7 | డా. కె.వి.కృష్ణకుమారి | సాహిత్యం | గుంటూరు జిల్లా |
| 8 | డా. మొదలి నాగభూషణశర్మ | సాహిత్యం | గుంటూరు జిల్లా |
| 9 | అట్టాడ అప్పల్నాయుడు | సాహిత్యం | శ్రీకాకుళం జిల్లా |
| 10 | డా. జి.వి. పూర్ణచంద్ | సాహిత్యం | కృష్ణా జిల్లా |
| 11 | జయప్రకాశ్ రెడ్డి | తెలుగు నాటకం | గుంటూరు జిల్లా |
| 12 | సురభి వేణుగోపాలరావు | తెలుగు నాటకం | కడప జిల్లా |
| 13 | డా. జి. రవికృష్ణ | తెలుగు నాటకం | కర్నూలు జిల్లా |
| 14 | వి. సత్యనారాయణ | సంగీతం (నాదస్వరం) | చిత్తూరు జిల్లా |
| 15 | పెమ్మరాజు సూర్యారావు | సంగీతం (గానం) | కృష్ణా జిల్లా |
| 16 | తాళ్ళూరి నాగరాజు | సంగీతం (వేణువు) | తూర్పు గోదావరి జిల్లా |
| 17 | భూసురపల్లి వెంకటేశ్వర్లు | సంగీత పరిశోధకుడు | గుంటూరు జిల్లా |
| 18 | అశోక్ గురజాల | సంగీతం | కర్నూలు జిల్లా |
| 19 | ఎం.ఎం. శ్రీలేఖ | సంగీత దర్శకురాలు | పశ్చిమ గోదావరి జిల్లా |
| 20 | భాగవతుల వెంకటరామ శర్మ | నృత్యం | కృష్ణా జిల్లా |
| 21 | డి. దేవికా రాణి వుడయార్ | శిల్పం | పశ్చిమ గోదావరి జిల్లా |
| 22 | దొడ్డి సతీష్ | శిల్పం | విశాఖపట్నం జిల్లా |
| 23 | డివిలి అప్పారావు | శిల్పం | శ్రీకాకుళం జిల్లా |
| 24 | కె.ఎస్. వాసు | చిత్రలేఖనం | కృష్ణా జిల్లా |
| 25 | చింతలపల్లి కోటేశ్వరావు | చిత్రలేఖనం | కర్నూలు జిల్లా |
| 26 | డి. మురళిబాబు | జానపద కళలు | విశాఖపట్నం జిల్లా |
| 27 | ఉరుముల నాగన్న | జానపద కళలు | అనంతపురం జిల్లా |
| 28 | కొండగొర్రి దాలయ్య | జానపద కళలు (సవర) | శ్రీకాకుళం జిల్లా |
| 29 | ఇందిరా దత్ | సామాజిక సేవ | కృష్ణా జిల్లా |
| 30 | కె. ధర్మారెడ్డి | సామాజిక సేవ | తూర్పు గోదావరి జిల్లా |
| 31 | గుమ్మడి రాధాకృష్ణమూర్తి | సామాజిక సేవ | గుంటూరు జిల్లా |
| 32 | డా. పరి నాయుడు | సామాజిక సేవ | విజయనగరం జిల్లా |
| 33 | డా. శశిధర్ | వైద్యం | ప్రకాశం జిల్లా |
| 34 | డా. ఎ. శ్రీధర్ రెడ్డి | వైద్యం | కృష్ణా జిల్లా |
| 35 | ఈమని శివనాగిరెడ్డి | పురావస్తు పరిశోధకుడు | గుంటూరు జిల్లా |
| 36 | మంజులా నాయుడు | టెలివిజన్ | చిత్తూరు జిల్లా |
| 37 | సింహాచల శాస్త్రి | హరికథ | చిత్తూరు జిల్లా |
| 38 | ఎస్. మనోహర్ రావు | ఇంద్రజాలం | తూర్పు గోదావరి జిల్లా |
| 39 | వంగర సత్యనారాయణ | వాస్తు | గుంటూరు జిల్లా |
| 40 | పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ | అవధానం | కృష్ణా జిల్లా |
| 41 | మోదుమూడి సుధాకర్ | సంగీతం | కృష్ణా జిల్లా |
| 42 | చక్రవర్తుల రాఘవాచారి | పాత్రికేయులు | కృష్ణా జిల్లా |
| 43 | ఆర్. ఏకాంబరాచార్యులు | సాహిత్యం | తూర్పు గోదావరి జిల్లా |
| 44 | కె. అహోబిలరావు | ఛాయాచిత్రగ్రాహకులు | కృష్ణా జిల్లా |
| 45 | గండ్లూరి దత్తాత్రేయ శర్మ | సాహిత్యం | కర్నూలు జిల్లా |
| 46 | |||
| 47 |
మూలాలు
[మార్చు]- ↑ "Hamsa awards are now Kalaratna". The Hindu. 2006-08-16. ISSN 0971-751X. Retrieved 2021-04-05.
- ↑ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (18 March 2018). "పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Archived from the original on 22 మార్చి 2018. Retrieved 18 March 2018.