కె.వి.కృష్ణకుమారి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రముఖ రచయిత్రి డా. కె.వి. కృష్ణకుమారి కృష్ణక్కగా సుప్రసిద్ధులు. రచయిత్రిగా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ తెనాలి అయితే, వైద్యవిద్య అభ్యసించినది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

తెనాలికి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు 1947, ఫిబ్రవరి 6 న జన్మించిన కృష్ణకుమారి ప్ర్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని తెనాలిలోనే పూర్తి చేసారు. అనంతరం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు.

రచనా వ్యాసాంగం[మార్చు]

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసారు.

సత్కారాలు[మార్చు]