అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి | |
---|---|
జననం | అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 1933 ఫిబ్రవరి 22 |
ఇతర పేర్లు | అన్నపరెడ్డి బుద్ధఘోషుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, అధ్యాపకుడు, సంపాదకుడు |
అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ప్రముఖ రచయిత, తత్త్వవేత్త, అధ్యాపకుడు, సంపాదకుడు, బౌద్ధమతావలంబి. మరణము మార్చి నెల 9 వ తేదీ 2021
విశేషాలు
[మార్చు]ఇతడు 1933, ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరులలో గడచింది. ఇతడు తెనాలిలోని వి.యస్.ఆర్. కళాశాల, వి.యస్.ఆర్ & యన్.వి.ఆర్. కళాశాల, గుంటూరులోని జె.కె.సీ. కళాశాలలో 1957 నుండి 1991 వరకు అధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాలను బోధించాడు. ఆ తరువాత వడ్లమూడిలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో కొంతకాలం పనిచేశాడు.'మిసిమి' మాసపత్రిక సంపాదకునిగా 1996 -2011ల మధ్య వ్యవహరించాడు[1].బౌద్ధమతం అవలంబించిన తర్వాత ఇతడు "అన్నపరెడ్డి బుద్ధఘోషుడు" అనే పేరుతో కూడా రచనలు చేశాడు. ఇతనికి "బుద్ధరత్న", "సద్ధర్మ మహోపాధ్యాయ" అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు మొత్తం 75కు పైగా రచనలు చేశాడు.
రచనలు
[మార్చు]- మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్
- నేటి ప్రపంచానికి బౌద్ధం
- కలలకు అర్థం చెప్పడం ఎలా?
- చింతనాగ్ని కొడిగట్టిన వేళ
- ప్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం
- బుద్ధుని సూత్ర సముచ్ఛయము (స్తుత నిపాత)
- ఆచార్య నాగార్జునుడు
- ప్రపంచ ప్రసిద్ధ మతాలు
- మానవీయ బుద్ధ
- అస్తిత్వవాదం
- మార్క్స్ దృష్టిలో మనిషి (అనువాదం, మూలం:ఎరిక్ ఫ్రాం)
- ప్రేమ సిద్ధాంతాలు (అనువాదం, మూలం:ఎరిక్ ఫ్రాం)
- నాగసేన -మిళింద వాదం (మిళింద ప్రశ్నలు)
- బుద్ధుని ధర్మోపదేశము
- బౌద్ధ పారిభాషిక పద నిఘంటువు
- మహాబౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు
- బుద్ధుని దీర్ఘ సంభాషణలు
- బుద్ధుని సంయుక్త సంభాషణలు
- బ్రాహ్మణ బౌద్ధ హిందు మతాలు (అనువాదం, మూలం:లాల్‌మణి జోషి)