కళారత్న పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళారత్న
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పకళ, చిత్రలేఖనం, జానపద , గిరిజన కళలు.
వ్యవస్థాపిత 1999
మొదటి బహూకరణ 1999
క్రితం బహూకరణ 2015
బహూకరించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నగదు బహుమతి ₹ 50,000

కళారత్న పురస్కారం పూర్వం హంస పురస్కారం [1], ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు.[2] ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద, గిరిజన కళలలో ఉన్నత కృషికి ప్రదానం చేస్తారు.

పురస్కారం[మార్చు]

ఈ పురస్కారాన్ని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు. 30,000 రూపాయల నగదు, శాలువా, బంగారు పూత హంసను పురస్కారంలో భాగంగా ఇస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

కళారత్న పురస్కారాలు - 2015[మార్చు]

2015 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 మందికి పురస్కారాన్ని అందించింది.[3][4]

కళారత్న పురస్కారాలు - 2018[మార్చు]

2018, మార్చి 18న విళంబి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 47 మందికి కళారత్న పురస్కారం అందజేయడ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్, శాసనసభ ఉప సభాధిపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/hamsa-awards-are-now-kalaratna/article3091236.ece
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-09. Retrieved 2016-04-01.
  3. http://www.thehindu.com/news/national/andhra-pradesh/hamsa-and-ugadi-awards-announced/article7013333.ece
  4. తెలుగువన్ (19 March 2015). "పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు". Retrieved 20 March 2018.[permanent dead link]
  5. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (18 March 2018). "పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు". Retrieved 18 March 2018.