టి.ఆర్.ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశ మంత్రివర్గ కార్యదర్శిగా సేవలందించిన ఏకైక ఆంధ్రుడు టి.ఆర్.ప్రసాద్. 1963 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐ.ఎ.ఎస్. అధికారి అయిన టి.అర్.ప్రసాద్, 12వ ప్రణాళికా సంఘం సభుడిగా, దేశ రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేశాడు. గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలులో జన్మించాడు. విజయవాడ లోని ఆంధ్ర లయోలా కాలేజిలోను బనారస్ విశ్వవిద్యాలయం లోను విద్యనభ్యసింఛి ఐ.ఎ.ఎస్ లో ప్రవేశము పొందాడు. ప్రకాశం జిల్లా కలెక్టరుగా మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక పదవులు అలంకరించాడు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశాడు. ఇతడు 1941, జూలై 15 న జన్మించాడు.