పాములపాటి అంకినీడు ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాములపాటి అంకినీడు ప్రసాదరావు ప్రముఖ రాజకీయ నాయకుడు. శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు. కేంద్రమంత్రి.

జననం[మార్చు]

1929, ఫిబ్రవరి 23 న వీరయ్య, అనసూయమ్మ దంపతులకు నిడుబ్రోలు పట్టణంలో జన్మించాడు.

చదువు[మార్చు]

నిడుబ్రోలులో హైస్కూల్ విద్య, గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

చిన్నతనం నుండే రాజకీయాలపై ఆసక్తి ఉన్న అంకినీడు ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాల్గొని గుర్తింపు పొందాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.

1964లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా గెలుపొందాడు. 1968లో గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు.

కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య శాఖామంత్రిగా పనిచేశాడు. 1971లో ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుంచి, 1977 మరియు 1980లో బాపట్ల లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.

1979లో చరణ్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటకం, పౌరవిమానశాఖ మంత్రిగా పనిచేశాడు. 1974లో జపాన్లో జరిగిన అంతర్జాతీయ పార్లమెంట్ సభ్యుల సదస్సులో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు.

మరణం[మార్చు]

వివాదరహితుడిగా, ఇందిరా గాంధీ వీరాభిమానిగా గుర్తింపు పొందిన అంకినీడు ప్రసాదరావు 1997, ఆగష్టు 27 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  • సుదీర్ఘ రాజకీయవేత్త పాములపాటి, ఆంధ్రజ్యోతి, 2016 అక్టోబరు 13.