కె.ఎల్. వనజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.ఎల్. వనజ ప్రముఖ రంగస్థల సినిమా నటి.

జననం[మార్చు]

గుంటూరు జిల్లా తెనాలి లో జన్మించారు. ప్రస్తుతం వీరు గుంటూరులో ఉంటున్నారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

వనజ చిన్నతనంలో తన ఊర్లోకి వచ్చిన నాటకాలను చూస్తూ పెరిగారు. అలా తనకు కూడా నాటకాలపై ఆసక్తి కలిగింది. 15 సంవత్సరాల వయసులోనే అయితానగర్ ఠాగూర్ కళాసమితి వారి ధనికలోకం నాటికలో చిట్టి అనే పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. ఆ తరువాత జనతా వారి ఎవరిదీతప్పు నాటకంలో చిన్న హీరోయిన్ పాత్ర ధరించారు. కాకినాడ, గూడూరు, సత్తెనపల్లి, అనంతపురం, నెల్లూరు లలో జరిగిన దాదాపు అన్ని పరిషత్తులలో ఉత్తమనటి బహుమతులు అందుకున్నారు. 1972లో ఢిల్లీలో జరిగిన బహుభాషా నాటకోత్సవంలో భయం (తెలుగు నాటకం) కు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేతులమీదుగా జాతీయ స్థాయిలో బహుమతిని అందుకున్నారు. 1997, జనవరి 27న నన్నపనేని వెంకట్రావ్ 17వ వర్ధంతి సందర్భంగా వనజని సన్మానం చేయడం జరిగింది.

నటించిన నాటకాలు[మార్చు]

  • ధనికలోకం (అయితానగర్ ఠాగూర్ కళాసమితి)
  • ఎవరిదీతప్పు (జనతా ఆర్ట్స్ థియేటర్)
  • యుద్ధం (ఆంధ్రాక్రాంతి థియేటర్)
  • భయం (జనతా ఆర్ట్స్ థియేటర్)
  • రైలు ప్రమాదం (జనతా ఆర్ట్స్ థియేటర్)
  • అన్నాచెల్లెలు (చేబ్రోలు)
  • పుణ్యస్థలి
  • వలయం
  • దేవుడు
  • సమిధ

సినిమారంగం[మార్చు]

1971లో సినిమాల్లో నటించడంకోసం మద్రాస్ వెళ్లారు. అక్కడ 10 సంవత్సరాలు ఉండి, మళ్లీ నాటకరంగానికి వచ్చారు.

మూలాలు[మార్చు]

  • కె.ఎల్. వనజ, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 239.