Jump to content

పోలేపెద్ది నరసింహమూర్తి

వికీపీడియా నుండి
పోలేపెద్ది నరసింహమూర్తి
జననంపోలేపెద్ది నరసింహమూర్తి
1913 మే 1
తెనాలి, గుంటూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్)
మరణం1947 డిశంబర్ 7
మరణ కారణంపశ్చవ్యాధి
ప్రసిద్ధికామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి
పదవి పేరుఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి
భార్య / భర్తలలితాంబ
పిల్లలుఅన్నపూర్ణ,విజయలక్ష్మి
తండ్రిసుబ్బారావు
తల్లిలక్ష్మమ్మ

పోలేపెద్ది నరసింహమూర్తిప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు.ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి.ఇతనును "కామ్రేడ్" అని పిలిచేవారు.ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు

జననం

[మార్చు]

కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి తెనాలిలో జన్మించారు. తండ్రి సుబ్బారావు, తల్లి లక్ష్మమ్మ.వీరికి 4గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. నరసింహమూర్తి రెండవ కుమారుడు. నరసింహమూర్తికి 1930 లో కృష్ణాజిల్లా పెదవుటపల్లి గ్రామానికి చెందిన లలితాంబ తో వివాహం జరిగింది. వీరికి అన్నపూర్ణ, విజయలక్ష్మి ఇద్దరు ఆడపిల్లలు. నరసింహమూర్తి 1931 శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. [1]

విద్యాభ్యాసం

[మార్చు]

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పైచదువు కొరకు కాశీ వెళ్ళారు. అక్కడ చదువుతో కమ్యూనిస్టు సంబంధాలు పెట్టుకొని, చండ్ర రాజేశ్వరరావు, చండ్ర రామలింగయ్య, పి.వి. రాఘవయ్యగార్లతో కలిసి, 1932-33లోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయటం ప్రారంభించారు.

రాజకీయాలు, కమ్యూనిస్టు ఉద్యమం

[మార్చు]

గుంటూరు జిల్లా కమ్యూనిస్టు గ్రూపుగా ఏర్పడ్డారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైళ్ళనుండి బైటకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించారు.పుచ్చలపల్లి సుందరయ్య కృషి ఫలితంగా 1934 సెప్టెంబర్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కామ్రేడ్స్ విజయవాడలో సమావేశమై 7 గురు సభ్యులతో రాష్ట్ర, కమ్యూనిస్టు ఆర్గనైజింగ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీకి సుందరయ్య కార్యదర్శి, నరసింహమూర్తి కమిటీ సభ్యుడు 1935 ఏప్రిల్ 17వ తేదీన గుంటూరు జిల్లా కమ్యూనిస్టుల మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నరసింహమూర్తి, జొన్నలగడ్డ రామలింగయ్య, మాడభూషి వెంకటాచారి, ప్రతావ రామసుబ్బయ్య, పెండ్యాల లోకనాథం, కుందేటి రామకోటి, మందా పుల్లారావు, పి.వి. శివయ్య, ముత్తేవి మాధవాచార్య, మరికొందరు మొత్తం 17 మంది పాల్గొన్నారు. 5గురితో జిల్లా కమిటీ ఎన్నుకోబడింది. దీనికి నరసింహ మూర్తి. కార్యదర్శిగా ఎన్నికైనారు. 16 సెప్టెంబర్ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ద్వితీయ మహాసభ రాజమండ్రిలో జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యారు.[1][2]

మరణం

[మార్చు]

పశ్చవ్యాధి ఉండటం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. ప్రకృతి వైద్యం కొరకు తమిళనాడు వెళ్ళారు. అక్కడ అంబత్తూరు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకొంటూ 1947 డిశంబర్ 7న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు. పరకల పట్టాభిరామరావు. 2000. pp. 16, 17, 18, 19.
  2. స్వాతంత్ర్య‌మే మా జ‌న్మ‌హ‌క్కని. తోటకూర వెంకట రమణ.