Jump to content

పెదగాదెలవర్రు

అక్షాంశ రేఖాంశాలు: 16°10′10.020″N 80°36′27.180″E / 16.16945000°N 80.60755000°E / 16.16945000; 80.60755000
వికీపీడియా నుండి
పెదగాదెలవర్రు
పటం
పెదగాదెలవర్రు is located in ఆంధ్రప్రదేశ్
పెదగాదెలవర్రు
పెదగాదెలవర్రు
అక్షాంశ రేఖాంశాలు: 16°10′10.020″N 80°36′27.180″E / 16.16945000°N 80.60755000°E / 16.16945000; 80.60755000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచుండూరు
విస్తీర్ణం
8.31 కి.మీ2 (3.21 చ. మై)
జనాభా
 (2011)
2,698
 • జనసాంద్రత320/కి.మీ2 (840/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,331
 • స్త్రీలు1,367
 • లింగ నిష్పత్తి1,027
 • నివాసాలు877
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522318
2011 జనగణన కోడ్590379

పెదగాదెలవర్రు, బాపట్ల జిల్లా, చుండూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చుండూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 877 ఇళ్లతో, 2698 జనాభాతో 831 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1331, ఆడవారి సంఖ్య 1367. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1075 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 82. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590379[1].

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

మండూరు 3 కి.మీ, వలివేరు 3 కి.మీ, ఆలపాడు 4 కి.మీ, వేటపాలెం 5 కి.మీ, యడ్లపల్లి 5 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు తెనాలిలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెదగాదెలవర్రులో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ముగ్గురు నాటు వైద్యులు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెదగాదెలవర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 19 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెదగాదెలవర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 95 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 6 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 723 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 723 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెదగాదెలవర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 723 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెదగాదెలవర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కంఠంనేని ప్రభావాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, 2015, మే నెల-23వ తేదీ శనివారంనాడు, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేషపూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రావిచెట్టు, వేపచెట్టులకు కళ్యాణం జరిపించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

శ్రీ పెద్దింటమ్మ తల్లి ఆలయo

[మార్చు]

ఈ ఆలయ అభివృద్ధి పనులకు, 2013 నవంబరు 17 ఆదివారం, కార్తీక పౌర్ణమి నాడు శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయ ఆవరణలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పొంగలిశాలను, 2015, ఆగస్టు-29వ తేదీ శనివారంనాడు ప్రారంభించారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

[మార్చు]
  • దాసరి సుబ్రహ్మణ్యం చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. ఈ వూరివారయిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు చాలా పేరుపొందిన రచయిత. ప్రముఖ బాలల బొమ్మల మాసపత్రిక అయిన "చందమామ"లో జానపద కథా రచయితగా మూడు దశాబ్దాలకు ఫైగా చదువరులకు చిర పరిచితులు. వీరు వ్రాసిన తోకచుక్క, జ్వాలాద్వీపం, కంచుకోట, మకరదేవత, ముగ్గురుమాంత్రికులు, పాతాళదుర్గం, భల్లూకమాంత్రికుడు మొదలయిన ధారావాహికలు బహుళ ప్రాచుర్యం పొందినవి. [3]
  • ఈశ్వరప్రభు

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ కోడే సత్యనారాయణ, సత్యఞాప్రసూనాంబ దంపతులు, 50 సంవత్సరాలక్రితం, హైదరాబాదు వెళ్ళి, అక్కడ వ్యాపార రంగంలో పారిశ్రామికవేత్తగా స్థిరపడినారు. అయినా వారు స్వంత గ్రామంపై మమకారం వీడలేదు. వీరు రెండు దశాబ్దాల క్రితం శ్రీ కోడే వెంకటాద్రి చౌదరి ఛారిటబుల్ సొసైటీ ని స్థాపించి, గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. ఈ గ్రామంలోని వీధిదీపాలకు అమర్చడానికి ఒక లక్ష రూపాయల విలువైన ఎల్.యి.డి. దీపాలను అందజేసినారు. గ్రామాభివృద్ధికి ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు. గ్రామంలో నిరంతర విద్యుత్తు అందేలాగా ఉండుటకై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఒక జనరేటరును వితరణ చేసారు. [8]&[10]

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 2706, పురుషుల సంఖ్య 1331,మహిళలు 1375,నివాస గృహాలు 715,విస్తీర్ణం 831 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.