దాసరి సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసరి సుబ్రహ్మణ్యం
జననం1922 అక్టోబర్ 25
పెదగాదెలవర్రు
మరణం2010 జనవరి 27
ప్రసిద్ధిచందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు

దాసరి సుబ్రహ్మణ్యం (Dasari Subrahmanyam) చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామలో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగాడు.

జీవిత సంగ్రహం[మార్చు]

తెనాలి ప్రాంతంలోని చుండూరు రైల్వేస్టేషన్ కు దగ్గర్లో ఉన్న పెదగాదెలవర్రులో జన్మించిన ఆయన, 2010 జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశాడు.

పెద్దగా చదువుకోక పోయినా నిరంతర అధ్యయనంతో, పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు సాహచర్యంలో బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్యాలు, పంచతంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను ఆపోశన పట్టాడు.

ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి 12 ధారావాహికలను రాశాడు. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమ కేసరి, మౌగ్లీ, కాలశంబరుడు మొదలైన పాత్రలు తెలుగు వారికి సుపరిచితాలు.

చందమామలో చేరక ముందు ఆయన కమ్యూనిజాన్నీ, హేతువాదాన్ని అధ్యయనం చేశాడు. పదహారేళ్ళకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. జైలుకు వెళ్ళాడు. బోధన్ చక్కెర కర్మాగారంలో, మహారాష్ట్రలోని ఆంగ్లేయుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాడు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి పాండిచ్చేరి చేరుకున్నాడు. అక్కడ అరవిందాశ్రమం ప్రెస్ లో తెలుగు కంపోజర్ గా, ప్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. మెల్ల మెల్లగా పత్రికా సంపాదకులతో పరియాలు పెరిగాయి.

వాటి ప్రభావంతో చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, అభిసారిక వంటి పత్రికల్లో సాంఘిక కథలు రాయటం అలవాటయ్యింది. అప్పుడే చక్రపాణి నుంచి పిలుపు రావడంతో చందమామలో చేరాడు. అక్కడ చేరిన మొదట్లో సాదా కథలతో సరిపెట్టుకున్న ఆయన రాజారావు ఆకస్మిక మరణంతో ఆయన రాస్తూ వచ్చిన సీరియల్ విభాగంలో దాసరికి అవకాశం వచ్చింది. ఆయన రాసిన మొట్ట మొదటి సీరియల్ తోకచుక్క. అది బాల సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో పాతికేళ్ళపాటు ఆయన ధారావాహికలు చందమామలో నిరాటంకంగా ప్రచురితమయ్యాయి. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్స్ రాయడం మానుకున్నాడు.

ఆయనకు కుటుంబం అంటూ ఏదీ ఉండేది కాదు. చందమామ ఆఫీసు ప్రాంతంలోనే గది తీసుకుని ఒంటరిగా ఉండేవాడు. ఆయనకు పెళ్ళి అయి, ఒక కూతురు కూడా ఉన్నప్పటికీ ఆయనతో ఎవరూ ఉండేవారు కారని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు తెలియజేశాడు.[1]

రచనలు[మార్చు]

[2]

చందమామ[మార్చు]

 1. తోకచుక్క (1954 - 55)
 2. మకరదేవత (1955 - 56)
 3. ముగ్గురు మాత్రికులు (1957 - 58)
 4. కంచుకోట (1958 - 59)
 5. జ్వాలాద్వీపం (1960 - 61)
 6. రాకాసిలోయ (1961 - 64)
 7. పాతాళదుర్గం (1966 - 67)
 8. శిథిలాలయం (1968 - 70)
 9. రాతిరథం (1970 - 72)
 10. యక్షపర్వతం (1972 - 74)
 11. విచిత్రకవలలు (1974 - 76)
 12. మాయాసరోవరం (1976 - 78)
 13. భల్లూక మాత్రికుడు (1978 - 80)

బొమ్మరిల్లు[మార్చు]

 1. మృత్యులోయ (1971 - 74)
 2. శిథిల నగరం (1974 - 75)
 3. మంత్రాలదీవి (1976 - 80)
 4. గంధర్వ నగరం (1980-82)
 5. సర్పకన్య (1982-85)

[3]

యువ (అసలు పేరుతో)[మార్చు]

 1. అగ్నిమాల (1975)

స్నేహబాల[మార్చు]

 1. మాయాగంధర్వుడు (1977)

ప్రమోద[మార్చు]

 1. కపాలదుర్గం (1978)

మిలియన్ జోక్స్[మార్చు]

 1. మాయాద్వీపం (1980)

సాంఘిక సీరియల్ నవల[మార్చు]

(అసలు పేరుతో ప్రచురింపబడిన తొలి రచన)

 1. సినీతార దుర్మరణం (ఆంధ్రప్రభ ) (1952 - 53)

సాంఘిక కథలు[మార్చు]

అపరాధ పరిశోధక నవలలు[మార్చు]

 1. దాసు పేరుతో పులిగోరు (1957),
 2. దాసు పేరుతో హంతక త్రయం (1958)
 3. దాసు పేరుతో చేజిక్కిన శత్రువు (1958)
 4. దాసు పేరుతో భూతాల రాయుడు (1959)
 5. దాసు పేరుతో కాంతం - కనకం
 6. నడిచిపోయిన శవం
 7. మరపురాని మగువ
 8. సుడిగుండం
 9. సాలెగూడు
 10. దయ్యాల దిబ్బ
 11. మాయమైన మనిషి

-- భవాని ప్రసాద్ పేరుతో --

 1. కత్తి పట్టిన కపాలం (1957)
 2. దయ్యం చేతి కత్తి (1959)
 3. బొమ్మ తెచ్చిన భాగ్యం (1959)
 4. నకలు హంతకుడు (1960)

-- సుజాత పేరుతో --

 1. అజ్ఞాత శత్రువు (1956)
 2. అంతుతెలియని హత్య (1957)

చందమామలో పిల్లల కథలు[మార్చు]

 1. డి. సుబ్రహ్మణ్యం - తెనాలి పేరుతో మూడు ప్రశ్నలు (ఏప్రిల్ - 1952)
 2. డి. సుబ్రహ్మణ్యం - రేపల్లె పేరుతో పండితుని పిలక (డిసెంబరు 1952)
 3. డి. భవానీప్రసాద్ పేరుతో - నలుగురు మిత్రులు (జూన్ 1965)
 4. డి. సుబ్రహ్మణ్యం పేరుతో సూర్యకమలం (నవంబరు 1967)

జంతువుల పాత్రలతో కథల సీరియల్స్[మార్చు]

—చందమామ --

 1. టి. శంభుదాసు పేరుతో

నక్క సవారీ నుండి రాజప్రతినిధులు (ఫిబ్రవరి, 1957 నుండి ఏప్రిల్, 1958)

బొమ్మరిల్లు[మార్చు]

 1. కుందేలల్లుడి కథలు (1972)
 2. ఉడుతలు పాత్రలుగా గల ఖరబ శరభ కథలు (1974)

ప్రమోద[మార్చు]

 1. కోతి, ఉడుత పాత్రలుగా అదురూ బెదురూ కథలు (1978)

జాబిల్లి[మార్చు]

 1. ఎలకలు పాత్రలుగా రుద్రాబద్రుల కథలు (1982)

మిలియన్ జోక్స్[మార్చు]

 1. రెండు కుందేళ్ళు పాత్రలుగా కేతక చేతకుల కథలు
 1. ఇలాంటి కథలు రెండు వందలవరకు వ్రాసి ఉంటారని ఒక అంచనా.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-31. Retrieved 2010-03-03.
 2. అగ్నిమాల నవల
 3. దస్త్రం:రచన మాస పత్రిక జనవరి 2011 సంచిక