చిత్రగుప్త
చిత్రగుప్త | |
| రకం | మాసపత్రిక (1928 నుండి 1934 ఏప్రిల్ వరకూ) పక్షపత్రిక (1934 మే నుండి) |
|---|---|
| ప్రచురణకర్త | ఎన్.మునుస్వామి మొదిలియార్ |
| సంపాదకులు | ఎస్.జి.ఆచార్య |
| స్థాపించినది | 1928 |
| కేంద్రం | మద్రాసు |
జాతీయ హాస్యరస పక్ష పత్రికగా చిత్రగుప్త తనని తాను అభివర్ణించుకుంది. 1928లో ప్రారంభమైన ఈ పత్రికను ఎస్.జి.ఆచార్య సంపాదకత్వం వహించగా ఎన్.మునుస్వామి మొదలియార్ నడిపాడు. ఈ పత్రిక 33 సంవత్సరాలకు పైగా నడిచింది. మొదట మాసపత్రికగా వెలువడిన ఈ పత్రిక 1934 మే నెల నుండి పక్షపత్రికగా మారింది.
ముఖచిత్రం మీద రాజకీయ కార్టూన్, వెనుక అట్టమీద కూడా కార్టూన్ ప్రచురించేవారు. 60పేజీలుందేవి. 1/4 డమ్మీసైజు ప్రతినెల అణాన్నర వుండేది.[1]
శీర్షికలు
[మార్చు]ఈ పత్రికలో నాటికలు, కథలు, కార్టూనులు, కవితలు, జోకులతో పాటు ఈ క్రింది శీర్షికలు ప్రకటించబడ్డాయి.
- బహిరంగలేఖలు
- ఫ్లీట్ స్ట్రీట్ కథలు
- పసిడి తునకలు
- స్వీకృతి
- కాలచక్రము
- కార్డు కథలు
- రసవాహిని
- చిత్రగుప్త డైరీ
- గుసగుసలు
- చిల్లర విషయాలు
- ట్రంక్ టెలిఫోను
- సినిమా లోకం మొదలైనవి
రచయితలు
[మార్చు]
- చదలవాడ పిచ్చయ్య
- ఠామరాపు సూర్యనారాయణరావు
- రావూరు వెంకట సత్యనారాయణరావు
- గొట్టిపాటి సుబ్బరాయ చౌదరి
- రాయప్రోలు సుబ్బారావు
- అనిసెట్టి సుబ్బారావు
- కృత్తివాస తీర్థులు
- ఘండికోట బ్రహ్మాజీరావు
- మందరపు వెంకటేశ్వరరావు
- తాళ్ళూరి రామానుజస్వామి
- తూమాటి దొణప్ప
- కప్పగంతుల సత్యనారాయణ
- కె.బి.కె.పట్నాయక్ మొదలైనవారు.
అభిప్రాయాలు
[మార్చు]"సభ్యత వీడని హాస్యము, వినోదమును పుట్టించుచునే విజ్ఞానమును కలిగించు విషయములు కలిగి చిత్రగుప్త ఆంధ్రదేశమున విశేషవ్యాప్తి నందుచు వయోజన విద్యావ్యాప్తికి తోడ్పడుచున్నది" అని ఆంధ్రభూమి మాసపత్రిక వ్యాఖ్యానించింది.[2]
“ఇంగ్లండులో 'పంచ్' అనే పత్రిక చేస్తూ వున్న పనివంటిదే 'చిత్రగుప్త' చేస్తూ వున్న పనికూడా! సంఘంలోని దురాచారాలు, రాజ్యవ్యవహారములోని లోపాలు, అన్యాయాలు, సారస్వతములోని దోషాలు కూడాను పక్షపాతము లేకుండా వ్యక్తి దూషణ విసర్జించి, హాస్యరచనలలోనూ, చిత్రపటములలోను ప్రకటిస్తూంది....” అన్నారు గిడుగు వేంకట రామమూర్తి.[1]
“నేను ఎప్పుడు ఏ వ్యాసం పంపినా ఏ సంకోచమూ లేకుండా చిత్రగుప్త ప్రచురించింది. తక్కిన పత్రికలన్నీ కట్టకట్టినను 'గాగ్' చెయ్యాలని ప్రయత్నించిన దినాలలో కూడా. అందువల్ల ఆపత్రికకి కృతజ్ఞుణ్ణి. నావలే ప్రవాహానికి ఎదురీతకి ప్రయత్నించే చాలామంది యువక రచయితలకు చాలా ధైర్యంతో చేయూతనిస్తోంది ఈ పత్రిక అని చిత్రగుప్త పదవ సంపుటి తొలి సంచికలో రాసాడు చలం.[1]
“చిత్రగుప్త విద్యార్థులకు పాఠశాలయితే రనపిపాసువులకు పానశాల...” - విశ్వనాథ సత్యనారాయణ[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 44.
- ↑ ఆండ్ర శేషగిరిరావు (1 June 1934). "సంపాదకీయ సమాలోచన". ఆంధ్రభూమి మాసపత్రిక. 2 (1): 60. Retrieved 1 March 2025.
ప్రెస్ అకాడమీ అర్కైవ్స్‌లో చిత్రగుప్త పత్రిక 1958 సెప్టెంబరు 1 సంచిక