అగ్నిమాల
దాసరి సుబ్రహ్మణ్యం రచించిన నవలల్లో ఒక జానపద నవల 'అగ్నిమాల' .ఈ నవల ౧౯౭౫వ సంవత్సరంలో ధారావాహికగా వచ్చింది . ఆ తర్వాత జనవరి ౨౦౧౧ వ సంవత్సరం పుస్తకంగా విడుదలైంది .
చందమామలో దాసరి సుబ్రహ్మణ్యం 'రాకాసి లోయ' తర్వాత ౧౯౬౪ నుంచి రెండేళ్ళ పాటు బెంగాలి సీరియల్స్ 'దుర్గేశ నందిని', 'నవాబు నందిని' ని ప్రచురించారు.అటువంటి సంస్థాన కథలు తెలుగువారం వ్రాయలేమా అన్న పట్టుదలతో రాజపుత్ర సంస్థానాల నేపథ్యంలో 'అగ్నిమాల' రాయడం జరిగింది. అగ్నిమాల కథలో సాధారణానికి భిన్నంగా రాజకీయం ప్రేమకు దారి తీయడం, వ్యూహానికి ఉన్న ప్రాధాన్యం ప్రేమకు లభించక పోవడం వంటివి ముఖ్య అంశాలు.ఈ కథ
కథ
[మార్చు]చంద్రగిరి రాజైన నవభోజ మహారాజుకు, కాలభోజ మహారాజుకు మధ్య ఉన్న రాజకీయ వైరంతో ప్రారంభమవుతుంది.చంద్రగిరి రాజాశ్రితుడైన అగ్నిపాలుడు మహావీరుడు, రాజభక్తుడు అయిన అగ్నిపాలుడు భారతంలో ధర్మరాజు లాగా ఒక చిన్న అపరాధం చేశాడు.అది ఒక వారకాంత కోసమై క్షత్రియుడైన జగ్గరాజుపై కత్తి దూయడం.నవభోజ మహారాజు కాలభోజుని కుట్రలకు ప్రత్యుపాయ పన్నాగంగా తన అనుచరుడు వారవనితా హృదయాధినేత అయిన అవజ్ఞవర్మను బలవంతుడైన మల్లూరు మండలాధీశుడు ప్రసేన మహారాజుకు అల్లుడుగా చేయడం ద్వారా తన రాజ్య బలాన్ని పెంచదలిచాడు. కుటిలుడు, దుష్టుడు అయిన అవజ్ఞవర్మ ప్రసేన మహారాజు కుమార్తె అయిన వకుళమాలతో ప్రేమలో విఫలుడై తన దుస్థితిని అగ్నిపాలుడుపై మోపదల్చుకున్నాడు. స్నేహితులైన ఓబలరాజు, జయసింగ్ ప్రేరేపణల వల్ల తనకు తెలియకుండానే అవజ్ఞవర్మ చేయలేని పనిని తాను చేయగలనని అవజ్ఞవర్మతో తన సంస్థానాన్ని పందెం కడతాడు. నవభోజునికి తెలియకుండా అగ్నిపాలుడు తన అనుచరుడైన మాహూ, కొంతమంది సైనిక బృందంతో ప్రసేనుడి ఇంటికి బయల్దేరుతాడు.మార్గ మాధ్యమంలో కాలభోజుని అనుచరుడైన విష్ణుమిత్రున్ని కలిసి కొన్ని లేఖలు అందుకుంటాడు. అవి తన ప్రేయసికి అందించమని ప్రేయసి పేరు చెప్పకుండానే స్పృహ కోల్పోతాడు.
మాహూ ద్వారా విష్ణుమిత్రుడు మరణించాడని భావించిన అగ్నిపాలుడు దారి తప్పి బృందంతో వీడి ప్రసేనుడి కోటకు చేరుకుంటాడు. తన వద్ద ఉన్న లేఖల కారణంగా అగ్నిపాలుడిని విష్ణు మిత్రుడిగా భావించి ప్రసేనుడు ఆశ్రయం ఇస్తాడు. సమయం గడువగా వకుళమాల, అగ్నిపాలుడిని ప్రేమించిన విషయం తెలుసుకున్న వకుళమాల మామ బేతాళవర్మ రాజద్రోహం చేయుటకు పూనుకుంటాడు. విష్ణుమిత్రుని ప్రేయసి తండ్రి అయిన మణిమంతుని ద్వారా విష్ణుమిత్రుడి స్వభావం మంచిది కాదని భావించిన వకుళమాల విష్ణుమిత్రునిగా చెలామణీ అవుతున్న అగ్నిపాలుడిని నవభోజ మహారాజు సైనికులకు పట్టిస్తుంది. విష్ణుమిత్రునిగా భావించి అగ్నిపాలుడిని తీసుకు వెళ్ళిన సైనికులలో ధర్మనందుడు ఉదార స్వభావం కలిగిన వాడవటంతో అగ్నిపాలుడికి మాహుని వెతుకుటలో సహాయం చేస్తాడు.అవజ్ఞుని స్వభావం తెలియని నవభోజుడు అతనిని న్యాయస్థానానికి అధినేతగా చేస్తాడు. ఈ అవకాశం అదునుగా భావించిన అవజ్ఞవర్మ అగ్నిపాలుడిని విష్ణుమిత్రుని పేరుమీద రాజద్రోహ నేరం క్రింద ఉరి శిక్ష విధిస్తాడు. ఓబలుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న నవభోజ మహారాజు జయసింగ్, మాహూల ద్వారా అగ్నిపాలుడిని కాపాడుతాడు. అగ్నిపాలుడు బేతాళవర్మ కుట్ర నుంచి ప్రసేనుని కాపాడి వకుళమాలని సొంతం చేసుకుంటాడు.
నవలగా 2011 లో విడుదల అయిన పుస్తకమ్ వివరాలు
[మార్చు]- ప్రచురణ కర్త : వాహిని బుక్ ట్రస్ట్ , మంచిపుస్తకం
- మొత్తం పేజీలు : ౧౫౪
- పుస్తకం వెల : రూ. ౬౦/-
- చిత్రకారుడు : వడ్డాది పాపయ్య
- ముందుమాట : 'రచన'శాయి
- విశ్లేషకులు : వసుంధర