ఆర్య రాజేంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌
పదవీ కాలం
2020 డిసెంబర్ 28 – ప్రస్తుతం
ముందు కె శ్రీకుమార్

రాష్ట్ర అధ్యక్షురాలు
కేరళ బాల సంఘం, కేరళ

వ్యక్తిగత వివరాలు

జననం 1999 జనవరి 12
తిరువనంతపురం, కేరళ, భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
తల్లిదండ్రులు
  • రాజేంద్రన్
  • శ్రీలత

ఆర్య రాజేంద్రన్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది. ఆర్య రాజేంద్రన్ దేశంలోనే అతి చిన్న వయస్సులో (21 ఏళ్ల ) మేయర్ అయిన వ్యక్తిగా చరిత్ర సృష్టించింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఆర్య రాజేంద్రన్ 1999 జనవరి 12న కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో రాజేంద్రన్, శ్రీలత దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి కె.యం. రాజేంద్రన్ (ఎలక్ట్రీషియన్), తల్లి శ్రీ లత ఎల్ఐసి ఏజెంట్. ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్య రాజేంద్రన్ చిన్నతనం నుంచి సీపీఎం పార్టీ భావజాలంలో పెరిగిన ఆమె సీపీఎం విద్యార్థి విభాగం (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, కేరళ బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది.ఆమె 2020లో కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ముదవన్‌ముకల్ డివిజన్ నుండి సీపీఎం అభ్యర్థిగా పోటిచేసి సమీప ప్రత్యర్థిపై విజయం సాధించింది. అయితే మేయర్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోవడంతో ఆర్య రాజేంద్రన్ ను పార్టీ ఎంపిక మేయర్‌ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆమె అతి చిన్న వయసులో 2020 డిసెంబర్ 28న మేయర్‌గా భాద్యతలు చేపట్టి రికార్డు సృష్టించింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu, V6 Velugu (25 December 2020). "దేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV5 News (28 December 2020). "చరిత్ర సృష్టించిన మేయర్ ఆర్య." www.tv5news.in (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (29 December 2020). "తిరువనంతపురం మేయర్‌ పీఠంపై ఆర్య రాజేంద్రన్‌". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  4. The Hindu (2 January 2021). "21-year-old Arya Rajendran, youngest Mayor in the country, sworn in" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.