జి. రామకృష్ణ

వికీపీడియా నుండి
(రామకృష్ణ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జి. రామకృష్ణ
జననం15 అక్టోబరు 1939
భీమవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం22 అక్టోబరు 2001 (వయసు 62)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
క్రియాశీల సంవత్సరాలు1960-1995
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటుడు
జీవిత భాగస్వామిగీతాంజలి (నటి)

జి. రామకృష్ణ భారతీయ సినిమా నటుడు. అతను తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాల్లో నటించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం నకు చెందిన రంగస్థల నటుడు. అతను 1950 లలో చెన్నైకి వెళ్లాడు. అతని సినీరంగ ప్రవేశం 1960 లో నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాతో ప్రారంభమైంది.[1]

అతని మొదటి వివాహం భీమవరం నకు చెందిన మహిళతో జరిగింది. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగింది. అతను తన మొదటి భార్య, కుమార్తెను వదిలి మద్రాసుకు వచ్చాడు. అతను తెలుగు నటి గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. అతను 2001 లో మరణించాడు.[2]

సినిమా జీవితం

[మార్చు]

అతను నోము, పూజ, నేను – నా దేశం, బొమ్మా బొరుసా, బడిపంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము, హంతకులొస్తున్నారు జాగర్త , మగాడు, కటకటాల రుద్రయ్య, దొరలు దొంగలు, కోటలోపాగా, విశ్వనాధ నాయకుడు మొదలైన సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.

యశోద కృష్ణ, వినాయక విజయము, దేవుడే దిగివస్తే వంటి అనేక పౌరాణిక చిత్రాలలో అతను వివిధ పాత్రలు పోషించాడు. అతను ఎన్. టి. రామారావు , అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. TOI, Correspondent. "Telugu Actor Ramakrishna Dead". timesofindia. Times Group. Retrieved 20 June 2016.
  2. https://timesofindia.indiatimes.com/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms

బాహ్య లంకెలు

[మార్చు]