అగ్గివీరుడు
స్వరూపం
| అగ్గి వీరుడు (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.విఠలాచార్య (బి. వి. శ్రీనివాస్?) |
|---|---|
| తారాగణం | ఎస్.వి.రంగారావు, రాజశ్రీ, విజయలలిత, త్యాగరాజు, జి. రామకృష్ణ పొట్టి వీరయ్య |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి (విజయ కృష్ణమూర్తి?) |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం, స్వర్ణలత |
| నిర్మాణ సంస్థ | శ్రీ విఠల్ కంబైన్స్ |
| భాష | తెలుగు |
"అగ్గి వీరుడు" తెలుగు చలన చిత్రం 1969, అక్టోబర్ 17 న విడుదల . శ్రీ విఠల్ కంబైన్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు , రాజశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి అందించారు.దర్శకత్వం బి . వి . శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సినిమా ద్వారా పొట్టి వీరయ్య సినీ రంగ ప్రవేశం చేశాడు.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_యెషోవర్ధన
- రాజశ్రీ_ పద్మావతి
- రామకృష్ణ_శశాంకవర్మ
- కైకాల సత్యనారాయణ
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- ముక్కామల కృష్ణమూర్తి_ధర్మతేజ
- త్యాగరాజు_ రుద్రాక్షుడు
- మధుకూరి సత్యం
- రావి కొండలరావు
- విజయలలిత_కామాంధకి
- సారథి_ చేపలవాడు
- మీనాకుమారి_ హంస .
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్
- కధ: బి.వి.శ్రీనివాస్
- మాటలు: జి.కృష్ణమూర్తి
- సంగీతం: విజయకృష్ణమూర్తి
- పాటలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
- ఛాయ గ్రహణం: హెచ్.ఎస్.వేణు
- ఎడిటింగ్: కె.గోవిందస్వామి
- నిర్వహణ: బి.విఠలాచార్య
- నిర్మాత: బి.వి.శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ: శ్రీవిఠల్ కంబైన్స్
- విడుదల:17:10:1969.
పాటలు
[మార్చు]- ఎవరో నీవెవరో ఎదలో పిలిచి ఎదురున నిలిచి - సుశీల, ఘంటసాల . రచన: సీ. నారాయణ రెడ్డి.
- లేడి కన్నులు రమ్మంటె లేతవలపులు - ఘంటసాల, సుశీల .రచన: సీ. నారాయణ రెడ్డి.
- సరిసరి మగసిరి నీ అందము మరి మరి మనసుకు - బృందగీతం , రచన: కొసరాజు
- అలాంటిదాన్నిగాను ఈలాంటిదాన్నిగాను - సుశీల , రచన: కొసరాజు
- కాకి ముక్కుకు దొండపండు దండగ దండగ - సుశీల., రచన: సి. నారాయణ రెడ్డి
- పిలిచింది అందాల బాల నిను వలచింది - సుశీల , రచన:/సి నారాయణ రెడ్డి
- రాజకుమారి బల్‌సుకుమారి నీసరి ఏరి - పిఠాపురం, స్వర్ణలత
- రవ్వలనవ్వుల రాజకుమారి నా నవజీవన - ఘంటసాల, సుశీల . రచన: సీ . నారాయణ రెడ్డి.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు