Jump to content

స్వర్ణమంజరి

వికీపీడియా నుండి
స్వర్ణమంజరి
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి
సంగీతం ఆదినారాయణరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్
భాష తెలుగు

అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఆదినారాయణరావు నిర్మించిన జానపద చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలలో నిర్మించారు. తమిళ చిత్రంలో జెమినీ గణేశన్ కథానాయకుడు. స్వర్ణ మంజరి చిత్రం 1962 ఆగస్టు 10 న విడుదల. తెలుగు చిత్రంలో అంజలీదేవి, నందమూరి తారక రామారావు , నాగయ్య, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఆదినారాయణ రావు సమకూర్చారు .

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

స్వర్ణమంజరి సౌందర్యరాశి. అంతే కాదు మంచి నర్తకి కూడా. ఆమె ఒకసారి యువరాజు చంద్రభాను జన్మదినం సందర్భంగా రాజాస్థానంలో నాట్యం చేయవలసి వస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. దీనిని రాజగురువు మహేంద్రశక్తి సహించలేకపోతాడు. స్వర్ణమంజరిని తన రహస్య గృహానికి రప్పించి బంధించబోగా ఆమె ఉపాయంతో తప్పించుకుంటుంది. ఈలోగా మిత్రుడు శ్రీముఖునితో కలిసి లోకసంచారానికి వెళ్లిన చంద్రభానుడిని సంగీతవృక్షం అంతరిక్ష మార్గంలో గొనిపోయి ఒక సరోవరం దగ్గర పడేస్తుంది. ఆ సరోవరంలోని యామిని అనే మత్సకన్య చంద్రభానును తన లోకానికి లాక్కుపోయి అతడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. స్వర్ణమంజరి కూడా శ్రీముఖుని సహాయంతో అక్కడికి చేరుకుని యువరాజును రక్షించడానికి పూనుకొంటుంది. కాని యామిని వారిద్దరినీ చూసి అక్కడి నుండి తరిమింది. స్వర్ణ చేతులను ఖండించింది. చేతులు లేని స్వర్ణను యువరాజు పెళ్ళి చేసుకుని బిడ్డను కంటాడు. రాజగురువు అప్పటికీ ఆమెపై పగసాధించడానికి కుయుక్తితో రాజ్యం నుండి వెళ్ళగొట్టిస్తాడు. ఆమె అడవులపాలవుతుంది. యువరాజు మత్సకన్య శాపవిముక్తి కోసం సింహాలతో పోరాడుతాడు. డ్రాగన్‌ను చంపుతాడు. అతడు తిరిగి స్వర్ణమంజరిని కలుసుకుంటాడా? రాజగురువు ఏమవుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది[1].

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు సీనియర్ సముద్రాల వ్రాయగా ఆదినారాయణరావు సంగీతాన్ని అందించాడు[2].

క్ర.సం పాట గాయినీగాయకులు
1 మధురమైన గురు దీవెన మరపురాని ప్రియ భావన చిత్తూరు నాగయ్య,
పి.సుశీల
2 మందాకినీ సలిల చందన చర్చితాయా.. ఝణన ఝణన ఘంటసాల,
పి.సుశీల
3 తరలిరావా నను కావ శరణు నీవే మహదేవా తరలిరావా పి.సుశీల
4 చూతము రారే చూడసొంపౌ కల్యాణమే వైభోగమే పి.సుశీల,
ఎస్.జానకి బృందం
5 ఏమో ఏమో యెదలొన పొంగె ఆనందం ఘంటసాల,
ఎస్. జానకి,
పి.సుశీల
6 ఇదియే జీవితానందము మధుర మగుతొలిరేయీ హాయీ పి.సుశీల,
ఘంటసాల
7 మైమరపించే ఈ సొగసు మురిపించే నీదేలే చెలి నీదేలే ఎస్.జానకి బృందం
8 ఆడేను పాడేనుగా ఆనందమీనాడెగా ఇక స్వేచ్చవినోదాల హాయిగా ఎస్.జానకి
9 రావే ప్రణవరూపిణీ రావే నాకళాసాధన శక్తి నీవే ఘంటసాల
10 అమ్మా నీ ఆశలన్నీ తీరెనా నీలాపనిందే మిగిలెనా ఘంటసాల కోరస్

11.జనన జనన నాట్యమే ,ఘంటసాల, సుశీల, బృందం రచన:సముద్రాల

మూలాలు

[మార్చు]
  1. చిత్రసమీక్ష, రూపవాణి, ఆంధ్రప్రభ దినపత్రిక, 17-08-1962 పేజీ 4[permanent dead link]
  2. కొల్లూరి భాస్కరరావు. "స్వర్ణమంజరి - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)