భాగ్యలక్ష్మి (1943 సినిమా)
భాగ్యలక్ష్మి (1943 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
తారాగణం | చిత్తూరు నాగయ్య(శ్రీనివాసరావు), మాలతి (భాగ్యలక్ష్మి), దొరస్వామి, టి.సూర్యకుమారి, గిరి (విశ్వనాధరావు), ఉమామహేశ్వరరావు, కమలా కోట్నీస్, ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఎ. మధురం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | శ్రీ రేణుక ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
భాగ్యలక్ష్మి 1943లో వెలువడిన తెలుగు సినిమా. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ఇది 100వ తెలుగు టాకీ సినిమా. చిత్తూరు నాగయ్య నిర్మాతగా ఇది తొలి సినిమా.[1]
కథ
[మార్చు]ధర్మన్నకు తిరుపతిలో ఒక పిల్లవాడు దొరికితే తెచ్చుకుని, శ్రీనివాసరావు అనే పేరు పెట్టి పెంచుకున్నాడు. ఆ అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలు ధర్మన్నకు తెలియవు. శ్రీనివాసరావు విద్యాబుద్ధులు నేర్చుకుని సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించి బడిపంతులుగా ఉంటున్నాడు. ఊరి వారందరికీ శ్రీనివాసరావు అంటే అమితానురాగం. ధర్మన్న పొరుగింట్లో రంగమ్మ అనే ఆమె ఉంటున్నది. ఆమె ధర్మన్నకు దూరపు బంధువు. రెండిళ్ళ మధ్య గోడ అడ్డుగా ఉన్నా రెండు కుటుంబాలూ ఒకే ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాయి. రంగమ్మకు ఇద్దరు సంతానం. గోపి, భాగ్యలక్ష్మి. గోపి శ్రీనివాసరావులు ప్రాణమిత్రులు. భాగ్యలక్ష్మి అంటే కూడా శ్రీనివాసరావుకు అమిత ప్రాణం. భాగ్యలక్ష్మి చిన్నతనం నుంచీ ధర్మన్న దగ్గరే పెరిగింది. శ్రీనివాసరావు ఆటా, పాటా నేర్పి విద్యావంతురాలిని చేశాడు. భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావులకు ఈడొచ్చినాసరే, వారి స్నేహాన్ని ఎవరూ అనుమానించలేదు. భాగ్యలక్ష్మి అమాయకురాలు. తన అన్నతో ఆడుకున్నట్టే, శ్రీనివాసారావుతోనూ ఆడుకుంటున్నది. ఆ యిద్దరూ ఒకరి హృదయాన్ని మరొకరు తెలుసుకోకుండా కాలం గడుపుతున్నారు.
భాగ్యలక్ష్మి బడిలో నాటకాలు వేసేది; బహుమతులు పుచ్చుకునేది. ఈడొచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆమె బడి పిల్లలతో కలిసి నాటకం వేస్తే, మేనమామ కోటయ్య చిందులు తొక్కాడు. పెళ్ళీడొచ్చిన పిల్ల అలా నాటకాలు ఆడుతూ ఉంటే, పెళ్ళికాదని మందలించి, వెంటనే పెళ్ళి చెయ్యాలని ఆదేశించాడు. ఐతే, సంబంధ నిర్ణయంలో గోపీకి, కోటయ్యకు తెగలేదు. భాగ్యలక్ష్మిని శ్రీనివాసరావుకు ఇచ్చి పెళ్ళి చెయ్యాలంటాడు గోపి. కులగోత్రాలు తెలియనివాడికిస్తే కుటుంబ గౌరవం మంటకలిసి పోతుందని కోటయ్యవాదం. చివరికి కోటయ్య మాటే నెగ్గింది. ఆ ఊళ్ళోనే ఉంటున్న రిటైర్డ్ తాశీల్దార్ జానకిరామయ్య కొడుకు విశ్వనాథరావుకు లక్ష్మిని ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. ముహూర్తం నిశ్చయమైంది. ఆ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు కుప్పలా కూలిపోయాడు. హృదయంలో చెలరేగిన బాధను ఎవరితోనూ చెప్పలేక, అర్ధరాత్రివేళ ఇల్లు విడిచి పరారైనాడు.
ఆ మర్నాడే భాగ్యలక్ష్మి పెళ్ళి. ధర్మన్న కొడుకు కోసం ఊరంతా వెదికాడు. లాభం లేక తిరుపతికే ప్రయాణం కట్టాడు.
భాగ్యలక్ష్మి భర్తను ఎంతగానో పూజించింది. ఆయనకు ప్రేమదేవత అయ్యింది. ఒక అబ్బాయి పుట్టాడు.
శ్రీనివాసరావు మనోవేదనతో బాధపడుతూ ఒక పాడు గుడిలో పడిపోతే, ఒక లంబాడీ గుంపు చేరదీసింది. ఆ గుంపు నాయకుడి కూతురు అతని మీద కన్నువేసింది. భాగ్యలక్ష్మిని మరచిపోలేక, నాయకుడి కూతురు బాధ పడలేక శ్రీనివాసరావు కొందరు యాత్రీకులతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. తిరుపతిలో ధర్మన్న కొడుకును గుర్తించి, అతి కష్టం మీద ఇంటికి తీసుకువచ్చాడు. శ్రీనివాసరావు రావడం అందరికీ ఆనందంగానే ఉంది. అయితే, అంతకు ముందు అతనితో పాటు బళ్ళో పనిచేస్తూ, అతన్ని ప్రేమించిన పంతులమ్మ కామాక్షి తిరిగి తన కోరిక వెళ్ళబుచ్చుతుంది. శ్రీనివాసరావు అంగీకరించకపోవడంతో కామాక్షికి కడుపు మండిపోయింది. దాంతో అతనికీ, లక్ష్మికీ సంబంధం ఉందనీ, ఆమె సంసారం పాడు చెయ్యడానికే అతను తిరిగి వచ్చాడనీ పుకారు పుట్టిస్తానని బెదిరించింది. ఆ అమాయకురాలి పాతివ్రత్యాన్ని తానే లోకానికి చాటుతానని, శ్రీనివాసరావు లక్ష్మి భర్త దగ్గరకు బయలుదేరాడు. అంతకు ముందే క్లబ్బులోని మిత్రుల వెటకారపు మాటలతో, భార్యను అనుమానించి, విశ్వనాథరావు భార్యను ఇల్లు వెళ్ళగొడుతున్న సమయానికి శ్రీనివాసరావు వచ్చి ఆమె నిర్దోషి అని చెప్పడంతో భర్త అనుమానం మరింత దృఢమైంది. భాగ్యలక్ష్మిని బజార్లో నెట్టివేశాడు. ఆ దృశ్యం చూసి శ్రీనివాసరావు మతిభ్రష్టుడైనాడు. మరికొన్ని మలుపులతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం
[మార్చు]చిత్తూరు నాగయ్య(శ్రీనివాసరావు),
మాలతి (భాగ్యలక్ష్మి),
దొరస్వామి,
టి.సూర్యకుమారి,
గిరి (విశ్వనాధరావు),
ఉమామహేశ్వరరావు,
కమలా కోట్నీస్,
ఎన్.ఎస్.కృష్ణన్,
టి.ఎ. మధురం,
గౌరీపతి శాస్త్రి,
పార్వతీబాయి
సాంకేతికవర్గం
[మార్చు]- పాటలు, మాటలు : సముద్రాల రాఘవాచార్య
- సంగీతం : భీమవరపు నరసింహారావు
- ఛాయాగ్రహణం : ఎం.ఎ.రహమాన్
- శబ్దగ్రహణం: ఎ.కృష్ణన్
- కళ : ఎన్.వి.ఎస్.రామారావు
- నృత్యం :శ్రీనివాస కులకర్ణి
- కూర్పు : టి.ఎ.ఎస్.మోని
- స్టిల్స్: ఎం.సత్యం
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
సముద్రాల రాఘవాచార్య | |||
సముద్రాల రాఘవాచార్య | |||
సముద్రాల రాఘవాచార్య | |||
సముద్రాల రాఘవాచార్య |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (1 October 1974). "శ్రీ రేణుకావారి భాగ్యలక్ష్మి". విజయచిత్ర. 9 (4): 7.