త్యాగయ్య (1946 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్యాగయ్య
(1946 తెలుగు సినిమా)

అప్పటి సినిమా పోస్టరు 1
దర్శకత్వం చిత్తూరు నాగయ్య
నిర్మాణం చిత్తూరు నాగయ్య
రచన చిత్తూరు నాగయ్య,
ఎస్.వి.ఆర్.ఆచార్య
తారాగణం చిత్తూరు నాగయ్య,
ముదిగొండ లింగమూర్తి,
బి.జయమ్మ,
హేమలతాదేవి,
సరితాదేవి,
న్యాపతి నారాయణమూర్తి,
రాయప్రోలు సుబ్రమణ్యం,
కె.దొరైస్వామి,
ఎమ్.సి.రాఘవన్,
నటేశన్,
సౌందర్యలక్ష్మి
సంగీతం చిత్తూరు నాగయ్య
గీతరచన సముద్రాల రాఘవాచార్య (త్యాగరాజు పాటలు కాకుండా మిగిలినవి)
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం మొహమ్మద్ ఎ.రహమాన్
నిర్మాణ సంస్థ శ్రీ రేణుకా ఫిల్మ్స్
నిడివి 186 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజు జీవిత కథ ఆధారంగా తీయబడిన ఈ సినిమాను చిత్తూరు నాగయ్య రూపొందించాడు. నాగయ్యే ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రధాన పాత్రధారి. ఈ చిత్రం దర్శకునిగా నాగయ్య ప్రథమ యత్నం.

మొత్తం సినిమాలో 34 పాటలు ఉన్నాయి. అందులో 28 త్యాగరాజు కీర్తనలు వాడారు. ఇంకా పురందరదాసు కన్నడ కృతి (దేవరనామ), పాపనాశనం శివన్ వ్రాసిన ఒక తమిళకృతి (గాయని డి.కె.పట్టమ్మాళ్), ఒక హిందీ పాట (గాయకుడు జె.ఎ.రహమాన్) ఉన్నాయి.

తెలుగు సినిమా చరిత్రలో "క్లాసిక్"గా నిలచిపోయే చిత్రాలలో ఇది ఒకటి. సంగీతానికీ, నటనకూ, కథనానికీ కూడా అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుకొన్న చిత్రం.[ఆధారం చూపాలి]

నటులు-పాత్రలు

[మార్చు]

పాటలు

[మార్చు]

01. ఎందు వెదుకుదురా హరిని ఎందు వెదుకుదురా - చిత్తూరు వి. నాగయ్య

02. ఎన్నడు చూచునో ఇనకుల తిలకా - చిత్తూరు వి. నాగయ్య

03. ఎటులా బ్రోతువో తెలియ ఏకాంత రామయ్యా - చిత్తూరు వి. నాగయ్య

04. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - చిత్తూరు వి. నాగయ్య

05. జోజో శ్రీరామా జోజోరఘుకుల తిలకా - చిత్తూరు వి. నాగయ్య, జయమ్మ

06. మనసా ఎటులోర్తువే నా మనవిని చేకొనవె -చిత్తూరు వి. నాగయ్య

07. తెర తీయగరాదా నాలోని తిరుపతి .. శివుడనో మాధవుడనో - చిత్తూరు వి. నాగయ్య బృందం

08. దొరుకునా ఇటువంటి సేవా దొరకునా అల్పతపమున - చిత్తూరు వి. నాగయ్య

09. నామొరాలకింపవేమీ ఆలకింపవేమి ఓ రామా - చిత్తూరు వి. నాగయ్య

10. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాధా - చిత్తూరు వి. నాగయ్య

సినిమాలో సన్నివేశాలు

11. నిధి చాలా సుఖమా రామ సన్నిది సేవా సుఖమా -చిత్తూరు వి. నాగయ్య

12. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే - చిత్తూరు వి. నాగయ్య బృందం

13. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్ళి చేద్దాము - బృంద గీతం

14. శ్రీ నారద మౌని గురురాయా కంటిని నే ఈనాటికి -చిత్తూరు వి. నాగయ్య

15. శ్రీరామ రఘురామా సింగారరామ ఏమి సేవింప రాదా ఓ మనసా -చిత్తూరు వి. నాగయ్య

16. శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారామ్మ - బృంద గీతం

17. శ్రీకరంబైనట్టి శ్రీ కృష్ణ తులసి ఏకచిత్తంబుతో - జయమ్మ

18. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా -చిత్తూరు వి. నాగయ్య

( అమర గాయకుడు ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో 'గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి ( నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట, వివరాలు లభించలేదు)

స్పందన

[మార్చు]

త్యాగయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు సంపాదించుకుంది.

ఆనాటి మైసూరు మహారాజా త్యాగయ్య సినిమాను తన ప్యాలెస్‌లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశాడు. సినిమా అమితంగా నచ్చడంతో చిత్తూరు నాగయ్యను వెండి శాలువా కప్పి, 101 బంగారు నాణేలు, శ్రీరామచంద్రుని రూపు ఉన్న ఒక బంగ్లారు నెక్లెస్ బహూకరించి సత్కరించాడు.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కాలిపు, కూర్మావతారం (2006). "నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు". ఈమాట. Retrieved 28 January 2019.

ఆధారాలు

[మార్చు]