Jump to content

న్యాపతి నారాయణమూర్తి

వికీపీడియా నుండి
న్యాపతి నారాయణమూర్తి
జననంన్యాపతి నారాయణమూర్తి
1897
బరంపురం
మరణం1951
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత
మతంహిందూ

న్యాపతి నారాయణమూర్తి తెలుగు పత్రికా సంపాదకుడు.


ఇతడు 1897లో బరంపురంలో జన్మించాడు.

సంపాదకుడిగా

[మార్చు]

ఎన్.జి.రంగా నడిపిన వాహిని వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఆంధ్రవాణి పత్రికకు సంపాదకునిగా ఉన్నాడు. ఆంధ్రప్రభ దినపత్రికకు ఖాసా సుబ్బారావు తరువాత సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆంధ్రప్రభలో పాన్-సుపారి అనే శీర్షికను నిర్వహించాడు. భారతి, కళింగ పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాశాడు. జైభారత్ అనే పత్రికను స్థాపించి నిర్వహించాడు. విజయప్రభ పత్రికకు 1951లో సంపాదకుడిగా ఉన్నాడు.[1]

స్వాతంత్ర్యోద్యమంలో

[మార్చు]

ఇతడు సహాయనిరాకరణోద్యమంలో, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మద్యం దుకాణాలవద్ద, విదేశీ షాపులవద్ద పికెటింగ్‌లో పాల్గొని 1922లో నెలరోజుల పాటు జైలుశిక్షను అనుభవించాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాదికి పైగా కారాగారంలో ఉన్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. నరిశెట్టి ఇన్నయ్య (1 July 2014). "నేను రాసిన పత్రికలు - నాకు తెలిసిన ఎడిటర్స్" (PDF). కౌముది. Retrieved 24 March 2024.
  2. తుర్లపాటి రాజేశ్వరి (2012). ఒరిస్సాలో తెలుగువారు (1 ed.). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 8–9. Retrieved 30 March 2024.