అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక స్వచ్ఛంద సంస్థ.
అట్టడుగు నుంచి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న అక్కినేని నాగేశ్వరరావు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదులో అభివృద్ధికి అక్కినేని గారు విశేష కృషి చేశారు. కృషి, పట్టుదల, అంకిత భావం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ కల వ్యక్తులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన అక్కినేని ఆశయాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు తోటకూర ప్రసాద్. డిసెంబరు 20వ తేదీన హైదరాబాదులో ద్వితీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానం చేశారు.
ప్రథమ పురస్కారాలు-2014
[మార్చు]“అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికాను 2014లో స్థాపించాం. గతేడాది డిసెంబరు నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మించిన గుడివాడలో మొదటి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానం చేశాం.
ద్వితీయ పురస్కారాలు-2015
[మార్చు]ఆయనతో ఎంతో అనుబంధం గల భాగ్యనగరంలో ఈ సంవత్సరం పురస్కారాలను అందించారు. వివిధ రంగాల్లో ప్రముఖులు కలసి పనిచేసినపుడే మంచి సమాజం ఏర్పడుతుందని అక్కినేని అనేవారు. అందువల్ల, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమయాలు – పరిష్కారాలు అనే అంశం మీద లఘు చిత్రాల పోటీ (షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్) నిర్వహించాం. తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో శేఖర్ కమ్ముల, ఎల్బీ శ్రీరాం, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్ సత్తారుల కమిటీ ముగ్గురు విజేతలను ఎంపిక చేసింది. 20న వారికి నగదు బహుమతి అందించారు. అక్కినేని గోల్డెన్ హీరోయిన్ల పేరుతో ఆయనతో పనిచేసిన కృష్ణవేణి, విజయ నిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు ఇచ్చారు. నవరత్నాలు పేరుతో సమాజంలో తొమ్మిది రంగాల్లో ప్రముఖులను పురస్కారాలతో సత్కరించారు. రవి కొండబోలు మాట్లాడుతూ.. “1995 నుంచి అక్కినేనితో పరిచయం, మంచి స్నేహం ఉంది. అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన 89వ పుట్టినరోజును ఘనంగా జరిపాం. అమెరికాలో అన్ని నగరాలూ తిరిగి ఎంతో సంతోషించారు.
ఈ సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న నవరత్నాలు :
- జీవిత సాఫల్య పురస్కారం : ఘట్టమనేని కృష్ణ
- విశిష్ట వ్యాపార రత్న : ఏ.వి.ఆర్. చౌదరి
- సినీరత్న : కైకాల సత్యనారాయణ
- రంగస్థల రత్న : కర్నాటి లక్ష్మీనరసయ్య
- విద్యారత్న : చుక్కా రామయ్య
- వైద్యరత్న : డాక్టర్ గుళ్ల సుర్యప్రకాష్
- సేవారత్న : డాక్టర్ సునీతా కృష్ణన్
- యువరత్న : కుమారి పూర్ణ మాలావత్
- చేనేత కళారత్న : నల్లా విజయ్