గుల్ల సూర్యప్రకాశ్
(గుళ్ల సుర్యప్రకాష్ నుండి దారిమార్పు చెందింది)
గుల్ల సూర్యప్రకాశ్ | |
---|---|
జననం | గుల్ల సూర్యప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రావిపల్లి గ్రామం. |
వృత్తి | గుండె వైద్య నిపుణులు |
ప్రసిద్ధి | గుండె వైద్య నిపుణులు |
డాక్టర్ జి.సూర్యప్రకాశ్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు. వీరు సికింద్రాబాదు లోని కేర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టరు గా తన వైద్య సేవలందిస్తున్నారు.
వీరి జన్మస్థలం విజయనగరం జిల్లాలోని రావిపల్లి గ్రామం.
ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత, వీరు విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1984లో వైద్య విద్య నభ్యసించారు. విద్యార్ధిగానే వీరు బంగారు పతకాలు సాధించారు. తరువాత జాతీయ స్థాయిలో మంచి రాంకు సాధించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరి M.D. పూర్తిచేశారు. తరువాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో D.M (Cardiology) 1994లో పూర్తిచేశారు. వీరు 100 పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలను వివిధ పత్రికలలో ప్రచురించారు. అమెరికా, యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి విశేష అనుభవం గడించారు.