కౌతరం
కౌతరం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 7,170 |
- పురుషులు | 3,564 |
- స్త్రీలు | 3,606 |
- గృహాల సంఖ్య | 2,013 |
పిన్ కోడ్ | 521331 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
కౌతరం, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 331, యస్.టీ.డీ.నం. 08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
సమీప మండలాలు[మార్చు]
పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
రైలు వసతి[మార్చు]
- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77211
- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77235
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
- విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వజ్రోత్సవాలు 2016, ఆగష్టు-14వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు. [14]
చెక్ పోస్ట్ వద్దనున్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రo[మార్చు]
శ్రీకైకాల సత్యనారాయణ కృషి వలన ఈ వూరిలో స్వంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుమతి వచ్చి నిర్మాణం జరుగుచున్నది. ఈ కేంద్రానికి 30 సెంట్ల స్థలాన్ని, శ్రీ వడ్లమూడి వరప్రసాద్ విరాళంగా ఇచ్చారు. [2]
గ్రామీణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]
1908, ఫిబ్రవరి-11వ తేదీన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రిజిష్టరు కాబడిన ఈ సంఘం, 106 సంవత్సరాల చరిత్ర, బియ్యం మిల్లు నిర్వహణ, ధాన్యం నిలవలకు గోదాములు, రైతులకు ఎరువుల సరఫరా, గ్రామస్థుల నగదు, బంగారు నగల భద్రతకు లాకర్ల వ్యవస్థ, 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సభ్యులకు డివిడెండ్లు, ఈ సంఘానికి ప్రత్యేకం. జిల్లాలోని పురాతన సొసైటీలలో ఒకటిగా, దశాబ్దాలుగా నిరంతర డివిడెండ్లను పంచే ఏకైక సంఘంగా వినుతికెక్కినది. [6]
గ్రామ పంచాయతీ[మార్చు]
పద్మాలపాలెం, కౌతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
2013 జూలైలో కౌతరం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి పడమట సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [8]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ వరసిద్ధివిఘ్నేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయం కౌతరం-సీతపేటలో ఉంది.
శ్రీ మరిడి మహాలక్షి అమ్మవారి ఆలయం[మార్చు]
కౌతరం గ్రామంలోని ఈ పురాతన ఆలయంలో, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో శుక్ల పక్షంలో, పది రోజులపాటు అమ్మవారి వార్షిక వేడుకలు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ పదిరోజులూ, అమ్మవారికి రోజుకొక అలంకారంతో గ్రామస్థులు పూజాదికాలు నిర్వహించెదరు. చివరి రోజున గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల భక్తులు, సంప్రదాయానుసారం, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కుబడుల నేపథ్యంలో ప్రతి ఇల్లూ, ఆడబడుచులు, పిల్లా పాపలతో కళకళలాడుతుంది. ఈ ఉత్సవాలకొరకు సుదూర ప్రాంతాల నుండి బంధువులు, గ్రామస్థులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవారి ఎదుట అన్న కుంభరాశి పోసి, పూజాధికాలు నిర్వహించెదరు. మహిళలు పంచభక్ష్య పరమాన్నాలను అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు. ముత్తైదువలు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. ఘటం, పోతురాజుల గడతో గ్రామోత్సవం నిర్వహించెదరు. 11 రోజులుగా అమ్మవారికి నవాలంకరణలు చేసి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు చేసిన భక్తులు సంప్రదాయానుసారం, అమ్మవారిని ఊరిపొలిమేరలలో విడిచి వచ్చెదరు. కొలుపుల జాతరగా పిలిచే ఈ ఉత్సవాల పరిసమాప్తితో ఆలయం నుండి అమ్మవారిని భుజాలపై ఎత్తుకొని వీధులలో గ్రామోత్సవం నిర్వహించెదరు. మళ్ళీ 12 సంవత్సరాలకు గ్రామానికి రావాలంటూ గ్రామ పొలిమేర పసుభట్లపాలెంలోని ఊరిచివర డొంక పొలాల గట్టున అమ్మవారిని విడిచి పెడతారు. మట్టితో చేసిన అమ్మవారి ప్రతిమ కాలానుగుణంగా ప్రకృతిలో కలిసిపోయి పంచభూత రూపాలుగా గ్రామాన్ని కాపాడుతుందని గ్రామస్థుల విశ్వాసం. దీనితో ఉత్సవాలు పరిసమాప్తి చెందుతవి. [3], [4] & [5]
శ్రీ గౌతమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
- ఈ ఆలయానికి మొత్తం మూడుచోట్ల 8.83 ఎకరాల మాన్యం భూమి ఉంది. [12]
- ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకొని, 2016, మే-21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. [13]
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]
- గ్రామంలోని ఒకటవ వార్డులోని ఈ ఆలయ అభివృద్ధి, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మహిళలే నిర్వహించుచున్నారు.
- విద్యాదీపం పథకం:- ఈ ఆలయంద్వారా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించుచున్నారు. ఈ పథకానికి దాతల విరాళలను గూడా స్వీకరించుచున్నారు. [7]
- ఈ ఆలయ 17వ వార్షికోత్సవాన్ని, 2016, జనవరి-29వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రతేక ఫలరసాల అభిషేకాలు, విశేష పూజాధికాలు నిర్వహించారు. పెద్ద యెత్తున ప్రసాదాలు పంపిణీ చేసారు. [10]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]
శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం[మార్చు]
స్థానిక 1వ వార్డు పరిధిలో ఉన్న ఈ ఆలయంలో, 2015, ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు, నెయ్యల సంఘీయులు, శ్రీ కనకదుర్గమ్మ తల్లి 40వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ వర్గీయులు, శ్రావణమాసంలో ఒక అదివారంనాడు, అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవారి భారీప్రభతో కనకతప్పెట్లు, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. కౌతరం, కూరాడ, గుడ్లవల్లేరు గ్రామాలలో ప్రభను ఊరేగించారు. [9]
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయానికి మొత్తం మూడుచోట్ల 10.10 ఎకరాల మాన్యం భూమి ఉంది. [12]
ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకొని, 2016, మే-21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. [13]
శ్రీ సీతారామాలయం[మార్చు]
కౌతవరం గ్రామానికి శివారు గ్రామమయిన పద్మాలపాలెం గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని, నాయీ బ్రాహ్మణ సంఘీయుల ఆధ్వర్యంలో, రెండు సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయం ప్రముఖ వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయానికి ప్రక్కనే ఉంది. [11]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
- వడ్లమూడి గోపాలకృష్ణయ్య సాహితీపుంభావ సరస్వతి, వాఙయ మహాధ్యక్ష బిరుదాంకితులు.
- నార్ల వెంకటేశ్వర రావు పత్రికా సంపాదకుడు, రచయిత.
- కానూరి లక్ష్మివర ప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త.
- కైకాల సత్యనారాయణ చలనచిత్రనటుడు.
- బాడిగ వెంకట నరసింహారావు బాలబంధు.
- నార్ల తాతారావు , విద్యుత్తురంగ నిపుణులు.
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7927.[1] ఇందులో పురుషుల సంఖ్య 4002, స్త్రీల సంఖ్య 3925, గ్రామంలో నివాసగృహాలు 2120 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 7,170 - పురుషుల సంఖ్య 3,564 - స్త్రీల సంఖ్య 3,606 - గృహాల సంఖ్య 2,013
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2014-11-29.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2013, జూన్-18; 13వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, మే-10; 15వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, మే-12; 7వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014, మే-13; 16వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-10; 9వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, జూన్-26; 31వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, జూలై-25; 25వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-31; 25వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 26వపేజీ. [11] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-17; 3వపేజీ. [12] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-12; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-22; 1వపేజీ. [14] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఆగష్టు-14; 1వపేజీ.