వడ్లమన్నాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్లమన్నాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,316
 - పురుషులు 2,166
 - స్త్రీలు 2,150
 - గృహాల సంఖ్య 1,248
పిన్ కోడ్ 521331
ఎస్.టి.డి కోడ్ 08674

వడ్లమన్నాడు, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 331., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

రైలు[మార్చు]

గుడ్లవల్లేరు, పెడన నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 63 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల 1985లో ప్రారంభమైనది. 1991 లో శాశ్వత భవనం నిర్మించారు. గత విద్యా సంవత్సరంలో 320 మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాలలో ఇంతవరకూ వ్రాతబల్లలు లేవు. ఇటీవల మొదటి విడతగా, 4.5 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరుచేయగా, విద్యార్థుల కొరకు 69 బల్లలూ, ఉపాధ్యాయులకు బల్లలూ కుర్చీలు, బీరువాలను ఏర్పాటు చేసారు. [5]
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- వడ్లమన్నాడు గ్రామ శివారుగ్రామమైన కొండిపాలెంలో, ఈ పాఠశాలను 2015, జూలై-1వ తేదీనాడు ప్రారంభించారు. [6]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ బ్యాంక్.

పశువైద్యశాల[మార్చు]

ఈ గ్రామంలోని పురాతన పశువైద్యశాల భవనం శిథిలమవడంతో, నాబార్డ్ అర్.ఐ.డి.ఎఫ్-18వ నిధులు 5.40 లక్షల రూపాయలతో, వెనుకవైపు చెరువుగట్టున, ఒక నూతన భవనం (వెటర్నరీ డిస్పెన్సరీ) నిర్మించారు. [9]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

  1. రైల్వే స్టేషను సమీపంలోని చాట్రయిగుంట చెరువు.
  2. వడ్లమన్నాడు గ్రామ శివారు రెడ్డిపాలెంలోని మంచినీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. రెడ్డిగూడెం గ్రామం, వడ్లమన్నాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పరిశపోగు బాలయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గరికపాటి రాంబాబు ఎన్నికైనారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవలయాలు[మార్చు]

శ్రీ ద్రోణేశ్వర స్వామి వారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాసశివరాత్రి రోజున లక్షదీపోత్సవం నిర్వహించెదరు. [2]

శ్రీ విజయగణపతిస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని మొదట, 1977లో గ్రామస్థులు, చేవేండ్ర రహదారిలో నిర్మించారు. ఈ అలయం శిథిలమవటంతో, 2014లో, ఆలయాన్ని తొలగించి, భక్తుల విరాళాలు 40 లక్షల రూపాయల వ్యయంతో, నూతన ఆలయం నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విజయగణపతి, ద్వారా పాలకులు, మూషికవాహనం, బలిపీఠం, శిఖర, జీవ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయం ఎదుట చలువ పందిళ్ళు, యాగశాల ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 2015, జూన్-2వ తేదీ మంగళవారంనాడు, విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ శనివారం ఉదయం 8-49 గంటలకు, శ్రీ విజయగణపతి, ద్వారపాలకులు, మూషికవాహనం, బలిపీఠం, శిఖర, జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. 7వ తేదీ ఆదివారంనాడు, ఆలయంలో శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ విజయగణపతిస్వామి మూర్తులకు కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. పలువురు దంపతులు ఉభయదాతలుగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ క్రతువుతో ఆలయంలో ప్రతిష్ఠోత్సవాలు ముగిసినవి. [3]&[4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీమతి సూరపనేని సరస్వతమ్మ ఒక శతాధిక వృద్ధురాలు. ఈమె 105 సంవత్సరాల వయస్సులో, 2015, ఆగష్టు-7వ తేదీనాడు, తన స్వగృహంలో, వయోభారంతో కాలంచేసారు. ఆఖరువరకు ఈమె తనపనులు తానేచేసుకుంటూ ఆరోగ్యంగా ఉండటం విశేషం. ఈమె అల్లుడు కానూరి శివాజీరావు, మనుమడు కానూరి సుబ్రహ్మణ్యం చౌదరి, గ్రామ సర్పంచులుగా పనిచేసారు. [7]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4670.[2] ఇందులో పురుషూ సంఖ్య 2349, స్త్రీల సంఖ్య 2321, గ్రామంలో నివాస గృహాలు 1213 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 4,316 - పురుషుల సంఖ్య 2,166 - స్త్రీల సంఖ్య 2,150 - గృహాల సంఖ్య 1,248

మూలాలు[మార్చు]

  1. "వడ్లమన్నాడు". Archived from the original on 10 మార్చి 2019. Retrieved 2 July 2016. Check date values in: |archive-date= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలిపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-3; 16వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూన్-4; 30వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, జూన్-8; 29వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, జూన్-18; 32వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, జూలై-3; 30వపేజీ. [7] ఈనాడు మెయిన్; 2015, జూలై-25; 3వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-15; 31వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-7; 26వపేజీ.