విన్నకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విన్నకోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,382
 - పురుషుల సంఖ్య 1,693
 - స్త్రీల సంఖ్య 1,689
 - గృహాల సంఖ్య 929
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674

విన్నకోట, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 325. యస్.టీ.డీ.కోడ్ 08674.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 57 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 2017, ఫిబ్రవరి-11న, శ్రీ సూరిసెట్టి శివనాగేశ్వరరావు నూతనంగా ఏర్పాటుచేసిన చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. [12]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

ఈ సంఘం 1958లో ఏర్పడినది. ఈ సంఘానికి 1993 లో, అప్పటి ఛైర్మన్ శ్రీ సుంకర వీరబ్రహ్మంనాయుడు ఆధ్వర్యంలో స్వంత భవనం నిర్మించారు. విన్నకోట, కూరాడ, కట్టవానిచెరువు, పురిటిపాడు, చినగొన్నూరు మొదలగు గ్రామాలకు చెందిన 1200 మంది గ్రామస్థులు, ఈ సంఘంలో సభ్యులు. పెరిగిన లావాదేవీలకనుగుణంగా, నేడు సంఘానికి ఉన్న భవనం, గోదాము సరిపోవుటలేదు. దీనితో ప్రస్తుత కార్యాలయం ప్రక్కనే నూతనంగా 9 లక్షల అంచనా వ్యయంతో మరియొక భవనాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ వ్యయంలో 4 లక్షల రూపాయల స్వంత నిధులున్నవి. మిగతా రు.5 లక్షల నిధులను ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కె.డి.సి.సి.బ్యాంకు) ఋణంగా అందజేసినది. ఈ నూతనభవనంలో అధ్యక్ష, కార్యదర్శులకు గదులేగాక, ప్రత్యేకంగా ఒక నగదు కౌంటరును ఏర్పాటు చేసారు. మండలంలోని కౌతవరం తరువాత, బ్యాంక్ వాతావరణంతో ఒక నగదు కౌంటరును నిర్మించడం విశేషం. ఈ నూతన భవనాన్ని, 2015, నవంబరు-7న, అప్కాభ్ ఛైర్మన్ శ్రీ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రారంభించెదరు. [7]

పశుగణాభివృద్ధి కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి పది లక్షల రూపాయల నిధులతో చేపట్టిన నూతన భవన నిర్మాణం పూర్తి అయినది. [5]

గ్రామములో వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

సుబ్బి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. సుబ్బిచెరువు గ్రామం, విన్నకోట పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 1988 నుండి 1995 వరకూ ఈ గ్రామానికి సర్పంచిగా శ్రీ శాయన సుధాహర్ పనిచేశారు. [2]
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి పాలేటి నాంచారమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పేర్ని శివప్రసాదు ఎన్నికైనారు. [5]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని, స్థానిక శివాలయం వద్ద, 1882లో చిట్టి పిచ్చయ్యశాస్త్రి తండ్రి రామన్నశాస్త్రి, స్థానిక బ్రాహ్మణుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయంలోని విగ్రహం భద్రాద్రి లోని రాముని విగ్రహాన్ని పోలి ఉండటం విశేషం. ఇది బ్రాహ్మల దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. నాటినుండి 147 సంవత్సరాలుగా, వారి వంశీకులు సీతారామశర్మ (రాము), నేడు చిట్టి సూర్యప్రభాకరరావు (సూరిబాబు) ఈ ఆలయ పర్యవేక్షణ నిర్వహించుచున్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ పురాతన ఆలయం చుట్టూ రక్షణగా మండపం నిర్మించారు. నేడు ఆలయ ధ్వజస్తంభం రహదారి ప్రక్కగా వెళ్ళడం, పల్లంగా మారడంతో, 2015, మే నెల 2వ తేదీ నాడు, నూతన ఆలయ నిర్మాణం కొరకు, వెనుక స్థలంలో శంకుస్థాపన నిర్వహించి, నిర్మాణం ప్రారంభించారు. ఇందుకుగాను గ్రామ పరిసర బ్రాహ్మణ సంఘీయులనుండి 35 లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించారు. 28 అడుగుల ఎత్తున, గర్భాలయం, అంతరాలయం ఎదుట ముఖమంటపం నిర్మించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠకు 39 అడుగుల ఎత్తయిన భారీ టేకును సిద్ధం చేసారు. [8]

సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016, ఫిబ్రవరి-16వ తేదీ (మాఘమాసం) మంగళవారంనాడు, యాగశాలలో చండీపారాయనం, హోమాలు, అరుణపారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. 17వ తేదీ బుధవారం ఉదయం 8-21 గంటలకు, శ్రీ గణపతి, శ్రీ హనుమాన్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ సాయిబాబా, ద్వారపాలక, జీవధ్వజ, శిఖర సహిత శ్రీ సీతారామాంజనేయస్వామి వారి యంత్ర, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించెదరు. అనంతరం మహా పూర్ణాహుతి హోమం, అన్నసంతర్పణ రాత్రికి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. [10]

శ్రీ భూ సమేత శ్రీ జనార్ధనస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ఆరు సంవత్సరాలనుండి ఎక్కువగా మహిళాభక్తులు శ్రీ గోవింద (శ్రీ వేంకటేశ్వర) మాల దీక్షలు చేపట్టుచున్నారు. తాజగా 2015, డిసెంబరు-14వ తేదీ సోమవారంనాడు, ఈ ఆలయంలో 20 మంది మహిళా భక్తులు, నలుగురు పురుషులు ఈ దీక్షలు చేపట్టినారు. మండలం మొత్తం మీద గోవింద దీక్షలు తీసుకునే గ్రామం విన్నకోట ఒక్కటే. [9]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా, ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [11]

శ్రీ భోగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ కొర్ల అంకమ్మ తల్లి ఆలయం తల్లి ఆలయం[మార్చు]

గ్రామములో అమ్మవారి ఉత్సవాలు తొమ్మిది సంవత్సరాలకొకసారి వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలు, తాజాగా, 2015, మే నెల-14వతేదీ గురువారంనాడు ప్రారంభించారు. ఆ రోజున అమ్మవారిని తెల్లచీరెతో అలంకరించి, నైవేద్యాలు సమర్పించారు. 15వతేదీ శుక్రవారంనుండి, 24వతేదీ ఆదివారం వరకు, దేవీనవరాత్రులను తలపించేలాగా, రోజుకొక అలంకారంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. [3]&[4]

అమ్మవారికి, 2015, మే నెలలో, 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు, 14 సంవత్సరాల తరువాత, పెద్ద యెత్తున జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా, మే-6వ తేదీనాడు, గంగమ్మ తల్లిని తీసుకొని వచ్చి, అంకమ్మ తల్లి ఆలయంలో ఉంచారు. 2015, జూన్-21వతేదీ ఆదివారంనాడు, గంగమ్మ తల్లిని తిరిగి, ఆమె ఆలయానికి చేర్చారు. దీనినే నెలసంబరంగా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. [5]

35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ ఆలయ పునర్నిర్మణానికి తీర్మానం చేసారు. [6]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం[మార్చు]

ఈ మందిరం విన్నకోట గ్రామ శివారులోని సుబ్బిచెరువు వద్ద ఉంది.

జనాబా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,382 - పురుషుల సంఖ్య 1,693 - స్త్రీల సంఖ్య 1,689 - గృహాల సంఖ్య 929
జనాభా (2001) -మొత్తం 3742 -పిరుషులు 1860 -స్త్రీలు 1882 -గృహాలు 895 -హెక్టార్లు 1414

మూలాలు[మార్చు]

  1. "విన్నకోట". Retrieved 2 July 2016.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-25; 9వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, మే-14; 30వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, మే-26; 29వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-31; 26వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-10; 26వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-5; 25వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-16; 27వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-15; 25వపేజీ. [10] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-17; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-18; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, ఫిబ్రవరి-12; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=విన్నకోట&oldid=2559849" నుండి వెలికితీశారు