మామిడికోళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడికొల్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 529
 - పురుషులు 283
 - స్త్రీలు 246
 - గృహాల సంఖ్య 178
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

మామిడికోళ్ళ, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 356. ఎస్.ట్.డి.కోడ్ =08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

పాఠశాల[మార్చు]

  1. ఈ గ్రామములో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్థులకు చోటిచ్చి, 2015.జూన్-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించారు. [3]
  2. ఈ పాఠశాలలో కీ.శే.జెట్టి రాఘవయ్య ఙాపకార్ధం వారి కుమారుడు శ్రీరాం ఏర్పాటుచేసిన భవనంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించారు. [6]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు[మార్చు]

గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015, జూలై-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [4] ఇదివరకు సగం శుభ్రంచేసి వదలివేసిన ఈ చెరువు పనులను తిరిగి ప్రారంభించి, ఒకటిన్నర లక్షల రూపాయలు వెచ్చించి, 40 రోజులపాటు వందలాది ఉపాధి కూలీల శ్రమతో ఎట్టకేలకు ఈ చెరువు ఇప్పటికి శుభ్రపడినది. [7]

మంచినీటి బావి[మార్చు]

ఈ గ్రామములోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. గ్రామ సర్పంచి చొరవతో, 2015, డిసెంబరు-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కాటూరి సాగర్ బాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ వీరమ్మ తల్లి దేవాలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో రెండవ శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళలో, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సంబరాలలో భాగంగా, భక్తులు చేపట్టిన విద్యుత్తు ప్రభలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తును. ఓంకారం, శ్రీ ఆదిదేవుడు, శ్రీ మహాగణపతి, పరమశివుడు, శివలింగం, శ్రీ సాయినాధుడు, అమ్మవారు తదితర రూపాలను విద్యుద్దీపాలతో నయనమనోహరంగా ఏర్పాటుచేస్తారు. ట్రాక్టర్లు, సాంప్రదాయక ఎడ్లబండ్లపై వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రభలు రాత్రంతా, గ్రామంలో ఊరేగుతూ, భక్తులను ఆనందడోలికలలో ఓలలాడించును. ప్రతి ఇంటా భక్తులు, ఈ ప్రభలకు పసుపు నీరు వారపోసెదరు. భక్తులు అమ్మవారి ఆలయం వద్దకుచేరి, మ్రొక్కుబడులు తీర్చుకుంటారు. అమ్మవారికి, ఆలయంలో రాత్రంతా, పూజాకార్యక్రమాలు జరుగుచూనే ఉండటం విశేషం. రాత్రంతా ఆలయం వద్ద అన్నదానం నిర్వహించెదరు. [2]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 597.[2] ఇందులో పురుషుల సంఖ్య 320, స్త్రీల సంఖ్య 277, గ్రామంలో నివాస గృహాలు 180 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 529 - పురుషుల సంఖ్య 283 - స్త్రీల సంఖ్య 246 - గృహాల సంఖ్య 178

మూలాలు[మార్చు]

  1. "మామిడికోళ్ళ". Retrieved 2 July 2016. Cite web requires |website= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014;ఏప్రిల్-13; 16వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూన్-17; 30వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, జూలై-17; 25వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-11; 25వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-26; 26వపేజీ. [7] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మే-31; 2వపేజీ.