అక్షాంశ రేఖాంశాలు: 16°22′31″N 81°00′40″E / 16.375199°N 81.010982°E / 16.375199; 81.010982

కూచికాయలపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విన్నకోట
—  రెవెన్యూయేతర గ్రామం  —
విన్నకోట is located in Andhra Pradesh
విన్నకోట
విన్నకోట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′31″N 81°00′40″E / 16.375199°N 81.010982°E / 16.375199; 81.010982
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674

కుచికాయలపూడి, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.గుడివాడ నుండి 9 కి.మీ. దూరంలో ఉంది. నేషనల్ హైవే 214 నుండి 2 కి.మీ, దూరంలో ఉంటుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, వడ్లమన్నాడ, పెంజెండ్ర

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

మంచినీటి చెరువు ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో దశాబ్దాలుగా, పూడికతీయక చెరువు పూడిపోయి నీటి నిలువలు ఉండేఋవికావు. త్రాగునీటికి, వాడుకనీటికీ గ్రామస్థులు నానా అవస్థలూ పడేవారు. జనవరి/2017లో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 3.3 లక్షల వ్యయంతో, చెరువులో పూడిలతీత కార్యక్రమం చేపట్టినారు.దాని ఫలితంగా, ప్రస్తుతం వేసవిలో గూడా ఈ చెరువు జలకళను సంతరించుకొన్నది. గ్రామస్థుల అవసరాలను తీర్చుచున్నది. [5]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కొడాలి రామరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో, నూతన ధ్వజస్థ్సంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వతేదీ గురువారంనాడు ప్రారంభించారు. ఆ రోజు రాత్రి, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, విష్వక్సేనపూజ నిర్వహించారు. 29వ తేదీ శుక్రవారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, పెద్ద ఎత్తున అన్నసమారాధన ఏర్పాటుచేసారు. శనివారంనాడు రాత్రి ఏర్పాటుచేసిన సంగీతవిభావరి, ఆదివారం ఏర్పాటుచేసిన చిన్నారుల సంప్రదాయ కోలాటం అందరినీ ఆకట్టుకున్నవి. ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను పురస్కరించుకొని, ఆదివారం రాత్రి, శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొనడం విశేషం. [1]

శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయంలో, 2015,ఆగష్టు-19వతేదీ బుధవారంనాడు, నాగపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. [3]
  2. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, సుబ్రహ్మణ్య షష్టి వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలు

[మార్చు]

ఈ ఊరు వ్యవసాయరంగంలో బాగా అభివృద్ధి సాధించింది.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. ఈ ఊరిలో పొట్లూరి, కోగంటి, వల్లభనేని, బొప్పన, తాతినేని ఇంటి పేర్లు గల వారు ఉన్నారు.
  2. క్వాలిటీ ఫీడ్స్ (రామనపూడి) అధినేతలు శ్రీ కోగంటి గోపాలకృష్ణ, శ్రీ ఆంజనేయులు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ ఊరు డప్పు కళాకారులకు ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామంలో పూర్ణ అను ఒక డప్పు కళాకారుల బృందం ఉంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-1&2; 29వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-17; 26వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-20; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-19; 25వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మే-21; 1వపేజీ.