కూరాడ (గుడ్లవల్లేరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూరాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,752
 - పురుషులు 1,365
 - స్త్రీలు 1,387
 - గృహాల సంఖ్య 783
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

కూరాడ, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 356.,ఎస్.టి.డి.కోడ్ నం. 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, ముదినేపల్లి నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 57 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. ఎస్.సి.వాడలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  2. లాకు దిగువున సి.బి.సి.ఎన్.సి.పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ 1957,నవంబరు-27వ తేదీనాడు ఏర్పడినది. [6]
  2. 2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గోపి సీతాకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

కూరాడ గ్రామంలో చెరువు వద్ద ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు. మరుసటి రోజైన దశమినాడు, రాత్రికి, స్వామివారి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించెదరు. గ్రామంలో ఈ రథోత్సవాన్ని నిర్వహించడం, వంద సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. దాదాపూ 30 అడుగుల ఎత్తయిన స్వామివారి రథాన్ని, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి, మధ్యలో స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చగా, గ్రామస్థులు, భక్తులు, రథాన్ని ముందుకు కదలించి, రథోత్సవాన్ని ప్రారంభించెదరు. ఆలయం నుండి ఊరిపొలిమేరల వరకు, ప్రతి ఇంటి వద్దా, మహిళలు పూజాదికాలు నిర్వహించెదరు. దేశ, విదేశాలలో ఉంటున్న గ్రామ ఆడబడుచులు, బంధువులు, పరిసర గ్రామాల మహిళలు, భక్తులు, వందలాదిగా తరలివచ్చి రథోత్సవాన్ని కన్నులారా వీక్షించెదరు. [2]

సుమారు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రకలిగిన ఈ ఆలయంలో, 2015,జూన్-13వ తేదీ శనివారంనాడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం,శాంతికళ్యాణం నిర్వహించారు. శ్రీరామ పాదుకా పట్టాభిషేకాన్ని, ప్రతి సంవత్సరం భద్రాచలంలో నిర్వహించినట్లే, నిర్వహించారు. గతంలో ఈ ఉత్సవాన్ని 60 సంవత్సరాలక్రితం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ ఆలయంలో గత 40 రోజులుగా రామాయణాన్ని పారాయణం చేసిన శ్రీ గురజ దాసును, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. [3]

శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయం కూరాడ గ్రామంలో, లాకు దిగువున ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి 58వ వార్షిక ఉత్సవాలను, 2015,ఆగష్టు-16వ తేదీ ఆదివారంనాడు సందడిగా నిర్వహించారు. గత 57 సంవత్సరాలుగా పవిత్ర శ్రావణమాసంలో ఒక ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం అమ్మవారి భారీప్రభకు పూజాధికాలు చేసి మొక్కుబడులు తీర్చి, అలంకరించిన ట్రాక్టరుపై ఊరేగింపు చేసారు. నవదుర్గలు, భూతబేతాళ, శింగి, శింగడు, బుట్టబొమ్మలు, చిత్ర విచిత్ర వేషధారులైన కళాకారుల పదర్శనల నడుమ ఉత్సవాలను చేపట్టినారు. కూరాడ లాకుదిగువ ప్రధాన గ్రామం, కౌతవరం 1వ వార్డు, గుడ్లవల్లేరు గ్రామాలలో ఈ ఊరేగింపు నిర్వహించారు. దీనితో కూరాడ గ్రామంలో లాకు దిగువున పెద్ద యెత్తున సందడి నెలకొన్నది. ఇంటింటా అమ్మవారికి పసుపు నీరు వారపోసి, చీరె, సారెలను సమర్పించుకున్నారు. [5]

శ్రీ అభయాంజనేయస్వామివారి అలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చిరుధాన్యాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2979.[2] ఇందులో పురుషుల సంఖ్య 1463, స్త్రీల సంఖ్య 1516, గ్రామంలో నివాసగృహాలు 755 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 2,752 - పురుషుల సంఖ్య 1,365 - స్త్రీల సంఖ్య 1,387 - గృహాల సంఖ్య 783

మూలాలు[మార్చు]

  1. "కూరాడ (గుడ్లవల్లేరు)". Retrieved 2 July 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,మార్చి-30; 16వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జూన్-15; 29వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,జులై-16; 20వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-17; 25వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-27; 26వపేజీ.