వాడుకరి చర్చ:Bollojubaba

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Bollojubaba గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చర్చసాయీరచనలు 01:30, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

యానాం గురించి[మార్చు]

బొల్లోజు బాబా గారూ!

నమస్కారం. తెలుగు వికిపిడియాలో మీరు వ్యాసాలు కూర్చడానికి ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు. మీ బ్లాగు కూడా చూశాను. చరిత్ర పట్ల, సాహిత్యం పట్ల మీకు ప్రత్యేక ఆసక్తి ఉన్నదనుకొంటాను. మీరు మీ సభ్యుని పేజీలో వ్రాసిన విషయం గురించి ఈ క్రింది సూచనలు, వ్యాఖ్యలు గమనించగలరు. వికీ పీడియా విధానాలు, లక్ష్యాలు మీకు అంతగా పరిచయం ఉండకపోవచ్చును అని ఈ సుదీర్ఘమైన వివరణ ఇస్తున్నాను. అన్యధా భావించవలదు.

  • సాధారణంగా రచయితలు తమను గురించి తమ సభ్య పేజీలో వ్రాసుకొంటారు. తాము వ్రాసే సమాచారాన్ని వేరే వ్యాసాలలో వ్రాస్తారు. ఇప్పటికే వ్రాసిన కొన్ని ఇతర వ్యాసాలు పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది.
  • మీరు మీ సభ్య పేజీలో వ్రాసిన యానం విమోచనోద్యమం సమాచారం చాలా చక్కగాను, ఆసక్తికరంగాను ఉంది. అభినందనలు.
  • మీరు వ్రాసిన విషయాన్ని విభజించి రెండు వేరు వేరు వ్యాసాలుగా కూర్చితే బాగుంటుంది. ఉదాహరణకు (1)యానాం విమోచనోద్యమం - ఇందులో ఆ ఉద్యమం నేపధ్యం, పోరాట క్రమాలు, పరిణామాలు, నాయకులు వంటి విషయాలు వ్రాయవచ్చును. (2) యానాం విమోచనోద్యమం (పుస్తకం) - ఇది మీరు వ్రాసిన పుస్తకం గురించి. ఇందులో రచయిత గురించి, లోపలి అంశాల గురించి, ఇతర విశేషాలగురించి ఉండవచ్చును.
  • ప్రస్తుతం మీకు వికీపీడియా క్రొత్త గనుక, మీరు అనుమతిస్తే, మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని రెండు వ్యాసాలుగా నేను విభజిస్తాను. తరువాత ఆ వ్యాసాలను మీరు ఇంకా విస్తరించవచ్చును లేదా సరి దిద్దవచ్చును.
  • మరొ కొన్ని ముఖ్య విషయాలు మీరు గమనించవలసిందిగా మనవి
    • వికీపీడియాలో వ్యాసాలు ఫలాని రచయితల పేర్లమీద ఉండవు. ఇది ఉమ్మడి కృషి. మీరు వ్రాసిన విషయాలను మరెవరైనా (నిర్దాక్షిణ్యంగా కూడా) మార్చే అవకాశం ఉంది. కనుక ఫలాని వ్యాసం ఫలాని వారు వ్రాశారన్న ఫుట్‌నోట్ ఉండదు. రచయితల పేర్లు వ్యాసం చరిత్రలో ఆటోమాటిక్‌గా నమోదు అవుతాయి.
    • మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని కొంత "వికీకరంచడం" జరుగుతుంది. అంటే అభిప్రాయాలు, గౌరవ వచనాలు వంటివి, ఆధారం లేనివి తొలగించబడుతాయి. ఇది వారి పట్ల అగౌరవ సూచకంగా కాదు. ఏక వచన సంబోధనమే వికీలో మంచిదన్న అభిప్రాయంతో. (ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతున్నది)
    • వికీపీడియాలో రచయితలు తమను గురించిన వ్యాసాలు వ్రాయకూడదని ఒక నియమం ఉంది. అందుకు corollary గా బహుశా రచయితలు తమ పుస్తకాల గురించి కూడా వ్రాయకూడదనుకొంటాను. (ప్రచార ధోరణిని నియంత్రించడాననికి ఈ నియమం ఉద్దేశింపబడింది. మీ పుస్తకం గురించి వ్యతిరేక భావంతో కాదు). కనుక మీ పుస్తకం గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని మీరు వ్రాయడం ఉచితం కాదు.

ఇన్ని నియమాలు మీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయాలని కాదు సుమండీ. దయచేసి వికీలో ఇతర వ్యాసాలు పరిశీలించండి. ఈ నియమాల సదుద్దేశాన్ని మీరు గమనించగలరు. సమిష్టి కృషిగా తెలుగు వికిపీడియాను ఒక సమగ్ర తెలుగు విజ్ఞాన సర్వస్వంగా తీర్చి దిద్దడానికి సహకరించమని కోరుతున్నాను. మీకు ఆసక్తి ఉన్న అంశాలపై మరిన్ని వ్యాసాలు వ్రాయండి. ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక వ్రాయండి.


అన్నట్లు నాదో సందేహం - యానం లేదా యానాం - ఏది సరైన పదం?


ధన్యవాదాలతో, మిత్రుడు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:29, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి[మార్చు]

అయ్యా నేను యానం విమోచనోద్యమము అనే వ్యాసం వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను, రెండు సార్లు టైపుచేసాను. పంపించాను. అదిమీకు చేరిందోలేదో తెలియదు. దయచేసి దానిని ఎడిట్ చేసి ప్రదర్శించండి. చరిత్రలో అదొక ముఖ్యమైన ఘట్టం. దాన్ని పదిమందికి తెలిసేలా చేయండి. కొన్ని ఫొటోలు కూడాఉన్నాయి. వాటిని ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలియటంలేదు.

దయచేసి నన్నెవరైన చెయ్యితిరిగిన వాళ్లు దత్తత తీసుకొని మార్గ దర్శకత్వం వహించండి.

దీనితరువాత ఫ్రెంచ్ యానంలో 1820-40 లలో సుమారు 3000 వేల మంది విదేశాలకు ఎగుమతి చేయబడ్డారు. ఇది ఒకరకమైన బానిస వ్యాపారం. దీనిపైన కూడా చాలా ముఖ్యమైన చారిత్రాత్మక ఘట్టం.

దీనిని కూడా మీ సహాయంతో వికిలో ఉంచాలని ఆసిస్తున్నాను. హెల్ప్ చెయ్యండి. కాసుబాబు గారికి సోమసుందర్ గారి వ్యాసాన్ని దిద్దుబాటు చేసాను. కొన్ని అతిశయోక్తులను తొలగించాను. ఒక సారి పరిశీలించి వికీకరించవలసినది గా కోరుచున్నాను.

భవదీయుడు. బొల్లోజు బాబా


బొల్లోజు బాబా bollojubaba@gmail.com

http://sahitheeyanam.blogspot.com/

తప్పక వ్రాయండి, సందేహించ వద్దు[మార్చు]

బొల్లోజు బాబా గారూ! మీరు వ్రాసిన ఈ అభ్యర్ధన చూడక ముందే నేను మీ చర్చా పేజీలో కొన్ని విషయాలు వ్రాశాను. మీరు సందేహించకుండా వికిపీడియాలో ఇలాంటి వ్యాసాలు వ్రాస్తూ ఉండండి. ఏమైనా సందేహాలుంటే ధారాళంగా అడగండి. మీకు వికీపీడియాలో అందరి సహకారాలు తప్పక లభిస్తాయి. ఒక్క రోజు ఆగితే మీరు ఇప్పటికే వ్రాసిన విషయాన్ని కొంచెం పునర్వ్యవస్థీకరించి నేను వ్యాసాలుగా ఉంచుతాను. అంతే కాదు, ఇంకా ఏయే విషయాలపై వ్యాసాలు వ్రాయాలని మీకు ఆసక్తి ఉందో చెప్పండి.

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ పేజీలోనే {{సహాయం కావాలి}} అని టైపు చేసి, ఆక్రింద మీ ప్రశ్నలను అడగండి వీలయినంత త్వరలో ఎవరో ఒకరు మీ ప్రశ్నలకు సమాధానం చెబుతారు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:49, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం తయారయింది. చూడండి[మార్చు]

బొల్లోజు బాబా గారూ! మీరు వ్రాసిన విషయాన్ని యానాం విమోచనోద్యమం అనే వ్యాసంలోకి మార్చాను. స్వల్ప మార్పులు చేసి, బొమ్మలు అతికించాను. దయచేసి ఒకమారు చూసి ఏనైవా సవరణలుంటే చేయగలరు. ఇంకా మీకు ఆసక్తి ఉన్న విషయాలపై వ్యాసాలు వ్రాస్తూ ఉండండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:12, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సోమసుందర్ గారి బొమ్మ[మార్చు]

మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మ:DSC06912.JPGను ఆవంత్స సోమసుందర్ అనే వ్యాసంలో ఉంచాను. అయితే ఈ బొమ్మకు కాపీ హక్కుల వివరాలు తెలుపవలసి ఉంది. మీరు సోమసుందర్ గారి అనుమతితో ఈ ఫొటో తీసుకొన్నారని నాకు అనిపిస్తుంది. అంటే వారికి అభ్యంతరం ఉండకూడదు. అలాగయితే తెలుపండి. బొమ్మకు creative commons అనే ట్యాగ్ పెడతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:21, 13 అక్టోబర్ 2008 (UTC)

సహాయ అభ్యర్ధన[మార్చు]

కాసుబాబు గారికి నమస్కారములు సోమసుందర్ గారి వ్యాసాన్ని సరిదిద్దాను. పరిశీలించండి. దయచేసి వికీకరించవలసినదిగా కోరుచున్నాను. భవదీయుడు బొల్లోజు బాబా

మీరు వర్గం:తెలుగు కవులు లో చేర్చిన అంశాలను, ఒక వ్యాసంలోకి బదిలీ చేసాను. మీ వ్యాసం మీరు రాసుకోరాదు. అందుకని ఏవైనా విషయాలు చేర్చాలంటే మూలాలతో సహా మాకు పంపించండి నేను ఆ వ్యాసంలో చేరుస్తాను. మీ చిత్రాన్ని, మీరు ప్రముఖులతొ ఉన్న చిత్రాలను, పురస్కార చిత్రాలను కూడా చేర్చండి.--కె.వెంకటరమణచర్చ 14:20, 10 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


Bollojubaba (చర్చ) 04:45, 31 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


Bollojubaba (చర్చ) 04:45, 31 జనవరి 2024 (UTC) నేను రాసిన వ్యాసభాగాన్ని దయచేసి తొలగించవలసినదిగా కోరుచున్నాను.[ప్రత్యుత్తరం]

నేను బౌద్ధమతంపై ఒక వ్యాసం రాసి దానిని మూడు పార్టులుగా 3, 5, 6 ఫిబ్రవరి 2022 లలో నా ఫేస్ బుక్ వాల్ పై పంచుకొన్నాను. అదే వ్యాసాన్ని "బుద్ధిజం కొన్ని ఆలోచనలు" పేరుతో FEBRUARY 7, 2022 న నా బ్లాగులో ప్రచురించాను. ఈ వ్యాసాన్ని తెలుగు వికిపీడియా దొంగిలించి "బౌద్ధ మతం" అనే వ్యాసంలో "సమకాలీన బౌద్ధం" అనే హెడ్డింగుకింద దాన్ని యధాతధంగా వాడుకొంది. కనీసం నా పేరుకానీ, నా బ్లాగును ఒక సోర్స్ గా కానీ ఉటంకించలేదు. (See link in first comment) నేడు ఆ వ్యాసాలను నేను పుస్తకరూపంలో తీసుకొని వద్దామని అనుకొంటున్నాను. ఈ విషయం గమనించకపోయినట్లయితే, నేనేదో వికినుండి కాపీ చేసాను అని పాఠకులు అనుకొనే అభిప్రాయం కలగవచ్చు.

బొల్లోజు బాబా

నా వ్యాసం లింకు https://sahitheeyanam.blogspot.com/2022/02/blog-post_7.html?fbclid=IwAR0H5pX7sryuoWWk2toRR_yBNMkpANCd4YzNZQ3GwJXYhLVHoJRZxoMqG28

మీరు కాపీ చేసిన పార్టు

https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%8C%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7_%E0%B0%AE%E0%B0%A4%E0%B0%82?fbclid=IwAR2OCvp-XcpkxM9lcU_HmcKDvQM9MZSZl-SnyTLVsywppXrIrawri_kD5-w

ఈ వ్యాసనిర్మాణంలో మీరు కూడా ఉన్నారు కనుక ఇలా అడుగుతున్నాను. దయచేసి తొలగించండి.

బొల్లోజు బాబా

బాబా గారూ నమస్కారం. మీరు ChaduvariAWBNew చర్చ పేజీలో జనవరి 31 న రాసిన దాన్ని ఇప్పుడే చూసాను. అది నా AWB ఖాతా అండి. దాన్ని ఎప్పుడో గానీ చూడను. AWB ద్వారా పనులు చేసేటప్పుడు కూడా దాన్ని చూసే అవసరం పడదు. పైగా దాన్నుండి గమనింపులు కూడా రావు. అంచేత మీకు జవాబివ్వడం ఆలస్యమైంది, మన్నించండి. నాతో సంప్రదించేందుకు ఇకపై వాడుకరి:Chaduvari ని వాడవలసినదిగా విజ్ఞప్తి. ఇక, సమస్యకు వస్తే..
మీ బ్లాగును కాపీ కొట్టినందుకు తెవికీ తరఫున క్షమాపణలు. కానీ ఏ భాగాన్ని కాపీ కొట్టారో, ఎవరు కాపీ కొట్టారో తెలియలేదు. మీరు ఇచ్చిన మీ బ్లాగు లింకులో ఏమీ చూపించడం లేదు. "Sorry, the page you were looking for in this blog does not exist." అని మాత్రమే అక్కడ చూపిస్తోంది. బహుశా లింకులో దోషమేమైనా ఉందేమో! మీరు ఆ లింకును సరిచేసి మళ్ళీ ఇస్తే ఆ భాగాన్ని తీసెయ్యగలుగుతాను. ఇకపై ఈ చర్చను చర్చ:బౌద్ధ మతం పేజీలో రాస్తే భవిష్యత్తులో అది ఒక రికార్డుగా మిగిలిపోతుంది.
కాపీహక్కుల ఉల్లంఘనలపై తెవికీ చాలా కఠినంగా ఉంటుంది. ఎక్కడైనా ఉల్లంఘన కనిపిస్తే తక్షణమే ఆ భాగాన్ని తీసేస్తుంది. అలాంటిది మీరు ఫిర్యాదు చేసాక కూడా ఇన్నాళ్ళ దాకా సవరించకపోవడం, మీకు ఇబ్బంది కలిగించడం చాలా కష్టంగా ఉంది నాకు. దయచేసి ఆ పేజీకి చెందిన సరైన లింకు ఇవ్వండి. మీ బ్లాగులోనే కాదు, మరెక్కడ ఆ సమాచారం ఉన్నా సరే.. ఆ లింకు ఇవ్వండి. తక్షణమే సవరణ చర్యలు తీసుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 01:47, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఈ ఫిర్యాదు చేసినవెంటనే సమకాలీన బౌద్ధం అనే భాగాన్ని తొలగించారు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 03:20, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]