Jump to content

కావూరి వెంకయ్య

వికీపీడియా నుండి

కావూరి వెంకయ్య పలనాటి విద్యాధాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పల్నాడు పాంతానకి వెలలేని కీర్తిని అందించాడు.

పల్నాటి విద్యాధాత

[మార్చు]

గాంధేయవాదిగా నిరూపించుకున్న కావూరి వెంకయ్య పల్నాటి సీమలోని బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యదేవుడు. కొండ కోనల్లోని గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలను చేరదీసి వారిని విద్యాపరంగా అభివృద్ది చేసిన ఘనత వారికే దక్కింది. మారుమూల గ్రామల్లోని విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లును ఏర్పాటు చేశారు. హాస్టళ్ల నిర్వాహన కొరకు గ్రామగ్రామాన తిరిగి పప్పు ధాన్యాలు, నిత్యవసర వస్తువులు సేకరించి విద్యార్థులకు బోజన ఏర్పాట్లు చేసేవారు. మాచర్లలో చెంచుబాలికల హాస్లళ్లు, కళామందిర్ సెంటర్ లోని చిన్నకాన్వెంట్ కు స్థలాన్ని ఇచ్చారు. నాగార్జనసాగర్ లో చెంచు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు గురజాలలో హయ్యర్ గ్రేడు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో పల్నాడులోని బాలబాలికలు దీనిలో శిక్షణ పొంది ఉపాధి పొందారు. వారి శిక్షణా కేంద్రంలో కృతార్ధులైనవారు ఎందరో ఉపాధ్యాయులు గా1990 వరకూ పనచేశారు,నేటికీ కొందరూ పెంక్షన్ తీసుకుంటున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి గాదు.వారిని నేను స్వయంగా కలసి మాట్లాడినాను.వారిని ఘనంగా మెచ్చుకంటారు. సీమలో విద్యాభివ`ద్దికి బాటలు వేసిన వెంకయ్య పల్నాటి విద్యాధాతగా వినుతినెక్కారు. మాచర్ల, గురజాల, కారంపూడి, పిడుగురాళ్ల, నాగార్జునసాగర్, కొత్తపుల్లారెడ్డి గూడెం, అలుగురాసుపల్లె తదితర గ్రామాలలో పాఠశాలల ద్వారా పేదవారికి విద్యాదానం చేశారు.

ప్రముఖులు రాక

[మార్చు]

ఆచార్య రంగా, గొళ్లపూడి సీతారామశాస్త్రి, గోపరాజు రామచంద్రరావు (గోరా) లను ఆహ్వానించి వారిచే విద్యార్థులకు సందేశాలు ఇప్పించేవారు. బూర్గుల రామక`ష్ణారావు, మర్రి చెన్నరెడ్డి, వల్లూరి బసవరాజు, కొండవీటి వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు నేతలు వెంకయ్యగారి ఆశ్రయంలో గడిపి విద్యార్థులకు తమ అమూల్య సందేశాలు ఇచ్చేవారు. వావిరాల గోపాలకృ`ష్ణయ్య తరుచూ వెంకయ్యగారి ఆశ్రమాన్ని సందర్శించి వారి కృ`షిని అభినందించేవారు. చదువుల వాసన ఎరగని మారుమూల అట్టడుగు పిల్లలను వెలుగులోెకి తెచ్చి వారికి విద్యను అందించారు. ఈయన పాఠశాలల్లో చదివిన ఎందరో విద్యార్థులు గొప్పగొప్ప ఉద్యోగాలలో ఉన్నారు. ఇప్పటికి ఆయా కుంటుంబాల వారు వెంకయ్య పేరు చెప్పుకొని ఇంటి దీపం పెట్టుకుంటారు. వెంకయ్య అక్షరాల సోషలిస్టు. అందుకే ఆయన నిర్వహించిన పాఠశాలలు, హాస్లళ్లు భవనాలు, స్థలాలు ప్రభుత్వ పరం చేశారు. మాచర్ల ప్రస్తుతం నడుస్తున్న ఆర్ సీ ఎం పాఠశాలను ఆనాడు భననాలతో సహా యాజమాన్యానకి విరాళం అందించారు. విద్యాలయాలుగా ఉన్న స్వంత భవనాలను కూడా ఉచితం ప్రభుత్వ పరం చేసిన త్యాగ ధనుడు వెంకయ్యగారు.

స్వాతంత్ర్యోద్యమం--జైలు శిక్షలు--

1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చారు.1934లో కొమ్మారెడ్డి సత్యనారాయణ నిర్వహించిన రైతు ఉద్యమం లో పాల్గొని గ్రామాలన్ని తిరిగారు.1932లోఆచార్యరంగాగారు "రైతుకూలీ"ఉద్యమం చేస్తూ పల్నాడు రాగా వెంకయ్య పిగురాళ్ళలో ఘనస్వాగతం పలికి మూడురోజులు వారితో పర్యటించారు.1933లో గాంధీ గారి బాటలో "హరిజన సేవా వ్రతానుష్టానము"లో పల్నాడులో నిర్వహించారు.పల్నాడులో రాజకీయ పాఠశాల ను నడిపినారు.1940 సత్యాగ్రహి, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్లోని జైలు జీవితం గడిపారు. గాంధీజి పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని పల్నాటికి వెలలేని కీర్తని తీసుకొచ్చారు

అవిరామకృషి:---

ఒకవైపు ఉద్యమాలలో పాల్గొంటూ మరోవైపు వివిద గిరిజన గ్రామాల్లో హరిజన గిరిజన బడుగు బహీన వర్గాల అభ్యున్నతికోసం పాఠశాలలు హాస్టళ్ళు నిర్వహించటం వారికి కావలసిన తిండి తిప్పలు చూచుకోవటానికి భుజాన గోనెసంచి తో ఇంటికి తిరిగి జొన్నలు,సజ్జలు,కందులు పోగుచేస్తూ విద్యార్ధులకు భోజనానం పెట్టేవారు. ఎంత ఓపిక సహనం ఉండాలో చూడండి. పూరిపాకలలో పెట్టిన పాఠశాలలు పక్కా భవనాలైనవి. చివరకు అ భవనాలు 1960లో ప్రభుత్వ పరం చేశారు.

రాజకీయ రంగం:---

1949 లో గుంటూరు జిల్లా బోర్డు అభ్యర్థి గా గెలిచారు.1972లో మాచర్ల గురజాల నియోజకవర్గ ాలలో ఇందిరాగాంధీ, కాసుబ్రహ్మానందరెడ్డి పలుకుబడి ని ధీటుగా ఎదుర్కొని రంగాగారి "స్వతంత్ర పార్టీని"గెలిచారు. పల్నాటి సీమలో ప్రజలు ఎంత ఆదరించారో తెలుస్తోంది..

సాహిత్యాభిలాష::---

తాను పెద్దగా చదువు కొనకపోయినా చదువు పట్ల మక్కువ ఎక్కువ. సాహిత్యాభిలాషయు మెండు. "పల్నాటి సోదర కవులతోను,కవిసింహ కాశీపతి గారితోను కొండవీటి వెంకట కవి ఏటుకూరి వెంకట నరసయ్య గార్లతో మంచి సన్నిహిత సంబంధాలు గలవు.గురజాల హాష్టల్లలో కవిసమ్మేళనం , సాహిత్య సభలు నిర్వహించారు.

1974లో కవిసింహ కాశీపతి మరణించగా మాచర్లలో గుర్రంమల్లయ్య,వి.వి.యల్.నరసింహారావుగారితో కలసి అంతిమస్కారాలలో శోభాయాత్రలో పాల్గొన్నారు. సంబంధిత చిత్రాలు నేటికి భద్రంగానున్నవి.

జననము- మరణము:-- ఇంతటి మహనీయుడు "పల్నాటి విద్యాదాత"పల్నాటి జాతిరత్నము గురజాల గ్రామంలో కావూరి రామ్మ ,గురులింగం దంపతులకు 13-01-1907లో జన్మించారు. గురజాల వీధిబడిలో చదువుకొని తర్వాత రెంటచింతల మిషనరీ మాధ్యమిక పాఠశాల లో ఎనిమిదో తరగతి ఛదివారు,అంతకుమించి చదువు అబ్బలేదు.వీరిది సామాన్య రైతుకుటుంబం.

"నూనూగు మీసాల నూత్నయవ్వనంలోనే" గాంధీగారి పిలుపుమేరకు స్వాతంత్ర్య పోరాటంలోకి అభినవ బాలచంద్రుడులా దూకినారు.ఆచార్య రంగాగారికి ఉత్తమ శిష్యుడైనాడు వారికి ఎన్నో సేవలు చేశారు.

దుష్టశక్తుల దుర్మాగమునకు గురై 01-08-1976 లో హత్యకు గురైనారు.పల్నాటి ధృవతారయై నింగిన వెలుగుచున్నారు. వారి శిష్యులు ప్రజలు విద్యార్థులు ఎందరో దుఃఖసాగరంలో మునిగి పోయారు. గురజాల వీధుల్లో వారి అంతిమయాత్ర లోఅశేష ప్రజానీకం పాల్గొన్నారు.

వారి వద్ద చదువుకున్నవారు అభిమానులు 27-09.1976న సంతాప సభను నిర్వహించారు. అభిమానులు కవులు పద్యాలు వ్యాసాలు రాశారు.ఆచార్య రంగాగారు 15 పేజీలు రాశారు వెంకయ్యను గురించి.రేపు 2023ఆగస్టు ఒకటో తారీకుకు ముప్పది ఆరవ వర్ధంతి.

వారి ఆత్మశాంతికి జోహార్లు....

మూలాలు:--పల్నాటి గాంధీ---సేవలు--స్మృతులు.

శ్రీకావూరి వెంకయ్య. సంచిక

కిసాన్ పబ్లికేషన్స్. నిడుబ్రోలు.1976.

theist, Volume 8