వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/యర్రా రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యర్రా రామారావు[మార్చు]

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (జనవరి 16, 2019)14:34 ఆఖరి తేదీ : (జనవరి 23, 2019)
యర్రా రామారావు (చర్చదిద్దుబాట్లు) - యర్రారామారావు గారు తెలుగు వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్/తెలంగాణ గ్రామవ్యాసాల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత జిల్లాల సంఖ్య పెరగడం, మండలాల పునర్వ్యవస్థీకరణ గురించి సరైన అవగాహన కలిగి అనేక వ్యాసాల రూపురేఖల్ని మార్చి మంచి వ్యాసాలుగా తయారుచేస్తున్నారు. తెలుగు వికీపీడియాలో తెలంగాణ గ్రామాల మీద విస్తారంగా పనిచేసి దాదాపు వ్యాసాలన్నిటినీ పునర్విభజన చట్టం ప్రకారమూ, 2011 జనగణన ప్రకారమూ అభివృద్ధి చేసిన వ్యక్తి అతను. గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేయడమే కాకుండా అనవసరంగా ఉన్న ఎటువంటి సమాచారం లేని గ్రామ వ్యాసాలను గుర్తించడం, వాటికి తొలగింపు ప్రతిపాదనలు చేయడం, కొన్నింటికి వికీకరణలు, శుద్ధి చేయడం వంటి పనులు చేస్తున్నారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. అంతకు ముందు గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు,మండలాలు,గ్రామాలు నందు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్పులు,చేర్పులు చేసేటప్పుడు అలాగే భారత జనగణన డేటా నింపేటప్పుడు కొన్ని పాటించవలసిన పద్దతులు,నియమాలు అవసరమని అతను గమనించారు. దానికొరకు గ్రామ వ్యాసంమార్గదర్శకాలను కూడా తయారుచేసి గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు సరైన వర్గీకరణ నియమాలను కూడా తయారుచేసారు.

ఈ పనులన్నీ తెలుగులో ప్రామాణికంగా అనేక చక్కని వ్యాసాలు వ్రాస్తూనే నిర్వహించారు. నిజానికి ఇప్పటికే నిర్వహణా పనులు చేస్తున్న యర్రా రామారావు గారికి ఈ నిర్వాహకహోదా కేవలం ఆ పనులు నిర్వహించడంలో సౌలభ్యం కొరకే. ఇక ముందు కూడా తెవికీని చక్కగా నిర్వహిస్తూ, ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, ఈయన్ను నిర్వహకత్వానికి ప్రతిపాదిస్తున్నా. --కె.వెంకటరమణచర్చ 14:27, 16 జనవరి 2019 (UTC)

యర్రా రామారావు గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

సభ్యుని అంగీకారం/అభిప్రాయం[మార్చు]

(సభ్యుని అంగీకారం ఇక్కడ తెలుపవలెను)

వికీపీడియా నియమాలకు లోబడి కార్వనిర్వాహకునిగా ఎంపిక కొరకు మన గౌరవ తెలుగు వికీపీడియన్స్ మద్దతు కోరుతూ, నేను సమ్మతించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:37, 16 జనవరి 2019 (UTC)

మద్దతు[మార్చు]

  1. --స్వరలాసిక (చర్చ) 14:44, 16 జనవరి 2019 (UTC)
  2. --JVRKPRASAD (చర్చ) 15:06, 16 జనవరి 2019 (UTC)
  3. IM3847 (చర్చ) 03:29, 17 జనవరి 2019 (UTC)
  4. యర్రా రామారావు గారు ఇప్పటికే గ్రామాల వ్యాసాల మార్గదర్శకాల రూపకల్పనలో, నిర్వహణ చర్యలు అభ్యర్థించడంలో ఎంతో పనిచేశారు. ఆయనే స్వయంగా నిర్వాహకుడైతే మన వికీపీడియాలో మూడవ వంతుకు పైగా ఉన్న గ్రామాల వ్యాసాల నిర్వహణలో చాలా మెరుగుదల ఉంటుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 03:57, 17 జనవరి 2019 (UTC)
  5. --Ajaybanbi (చర్చ) 04:35, 17 జనవరి 2019 (UTC)
  6. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:30, 17 జనవరి 2019 (UTC)
  7. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:57, 18 జనవరి 2019 (UTC)
  8. B.K.Viswanadh (చర్చ)
  9. --అర్జున (చర్చ) 04:44, 21 జనవరి 2019 (UTC)

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

దాదాపు క్రియాశీలక సభ్యులందరి మద్దతు కూడగట్టుకొని ఈ ప్రతిపాదన విజయవంతమైనది. కావున యర్రా రామారావు గారికి నిర్వాహకత్వ హోదా ఇవ్వవలసిందిగా అధికారులను కోరుతున్నాను.--కె.వెంకటరమణచర్చ 14:36, 23 జనవరి 2019 (UTC)

సముదాయం నిర్ణయం ప్రకారం, యర్రా రామారావు గారిని "నిర్వాహకుడు" గా మార్చాను. __చదువరి (చర్చరచనలు) 01:21, 24 జనవరి 2019 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

నన్ను వికీపీడియా నిర్వాహకహోదాకు ప్రతిపాదించిన కె.వెంకటరమణ గార్కి, అలాగే నానిర్వాహకహోదాకు మద్దతు తెలిపిన గౌరవ వికీపీడియన్లుకు, పనుల వత్తిడిలో గమనించక నానిర్వాహక హోదా మద్దతుకు స్పందించని తోటి వికీపీడియన్లుకు, నేను వికీపీడియాలో మెరుగ్గా పనిచేయటానికి శ్రమగా భావించకుండా ఒకటి రెండుసార్లు స్వయంగా మా ఇంటికి వచ్చి తగిన సలహాలు ఇచ్చిన పవన్ సంతోష్ గార్కి, చదువరి గార్కి, మీ సహాయ సహకారాలు కోరుచూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:15, 24 జనవరి 2019 (UTC)