వికీపీడియా చర్చ:తెవికీ 20 వ వార్షికోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ

ప్రధాన పేజీ చర్చ[మార్చు]

పాత3చర్చ[మార్చు]

ఈ విభాగం లోని చర్చ వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం పేజీ నుండి ట్రాన్స్‌క్లూడు చేసినది.

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

తదుపరి చర్యలు[మార్చు]

ఈ సమావేశంలో చురుగ్గా ఉన్న వాడుకరుల్లో చాలామంది పాల్గొన్నారు. అందులో పాల్గొనని వారు కూడా తమ అభిప్రాయాలు ఇక్కడ రాస్తే, దీనిపై ఇక ముందుకు పోవచ్చు.

చదువరి అభిప్రాయాలు[మార్చు]

ఈ ఆన్‌లైను సమావేశంలో ప్రస్తుతం తెవికీలో చురుగ్గా ఉన్న వాడుకరులు దాదాపుగా అందరూ పాల్గొన్నారు. నేను హాజరు కాలేదు గానీ, ఇక్కడ రాసిన నివేదిక ప్రకారం నేను గ్రహించినవి ఇవి:

  1. తెవికీ 20 వ వార్షికోత్సవంలో సిఐఎస్ భాగస్వామ్యం తీసుకుంటుందా, అలా అయితే కార్యక్రమం స్థూలంగా ఎలా ఉండాలి అనేది ఈ సమావేశ విషయం.
  2. వార్షికోత్సవంలో ఆటవిడుపు, వేడుకలు వగైరాలతో పాటు సమీక్ష, ప్రణాళికల వంటివి ఉంటే సిఐఎస్‌ అందులో భాగస్వామ్యం తీసుకుంటుంది. (సిఐఎస్ భాగస్వామ్యం తీసుకోవాలంటే ఇది ఒక నిబంధన అని నేను భావిస్తున్నాను.)
  3. సిఐఎస్‌ వారు తెవికీపై స్వతంత్ర సమీక్ష ఒకటి చేస్తారు. దాని నివేదికను వార్షికోత్సవంలో సమర్పిస్తారు. తద్వారా వార్షికోత్సవ సమయంలో దానిపై చర్చ జరిపే అవకాశం కూడా ఉంటుంది.
  4. భవిష్యత్తు కార్యాచరణపై జరిపే చర్చలో కూడా ఈ సమీక్షా నివేదిక పనికొస్తుంది.
  5. సిఐఎస్ వారి భాగస్వామ్య నిబంధనపై సమావేశంలో పాల్గొన్నవారు సానుకూలత వ్యక్తపరచారు. వ్యతిరేకత అయితే అసలు కనబడనే లేదు.

దీనిపై నా అభిప్రాయాలు:

  1. తెవికీని సమీక్షించాలనే సిఐఎస్ వారి ప్రతిపాదన బాగుంది. ఈ సమీక్ష భవిష్యత్తులో తెవికీ ప్రగతికి ఉపయోగపడే అవకాశం ఉంది.
  2. సీఎస్ భాస్వామ్యం కారణంగా నిధులు చేకూరి, ఈ కార్యక్రమాన్ని మరింత పెద్దయెత్తున నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.

ఈ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం లభించింది కాబట్టి, సిఐఎస్, తెవికీ రెండూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే నేనూ భావిస్తున్నాను. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని తెవికీ లోని కార్యక్రమ ప్రతిపాదకులు/నిర్వాహకులను, సిఐఎస్‌నూ కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 00:17, 12 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

సన్నాహక సమావేశాలపై చర్చ[మార్చు]

రెండవ సన్నాహక సమావేశం: వివరమైన చర్చ[మార్చు]

@Chaduvari, @Vjsuseela, @V Bhavya, @యర్రా రామారావు, @Divya4232, @Nskjnv, @Kasyap, @Pranayraj1985, @రహ్మానుద్దీన్, @Adithya pakide, @Lahariyaniyathi గార్లకు నమస్కారం. మనం గత బుధవారం రాత్రి వీడియోకాల్లో చేసిన రెండో సన్నాహక సమావేశం తాలూకు చర్చను నేను నాకు సాధ్యమైనంత వివరంగా ఇక్కడ రాశాను. ఇది నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా రాసినది. మీరు మాట్లాడిన అంశాలకు దీనిలో నేను రాసిన విధానానికి ఏమైనా తేడాలుంటే ఇక్కడ తెలియజేయమని మనవి. లేకుంటే లేదని కూడా ఇక్కడే తెలియజేస్తే ప్రయోజనకరం. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 02:25, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ (CIS-A2K) గారూ నావరకు నాకు ఏమీ తేడాలు లేవు.కాకపోతే దీని సందర్బంగా అవకాశం ఉంటే చిన్న బుక్లెట్ ఒకటి ప్రచురిస్తే బాగుంటుందని సూచించాను.అన్నీ వచ్చినవని భావిస్తున్నాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 02:46, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ, " ప్రత్యేక సంచిక ప్రచురిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని సూచించారు" అన్న వాక్యంలో మీ బుక్లెట్ ఆలోచనను క్యాప్చర్ చేశానండీ. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:11, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండీ. యర్రా రామారావు (చర్చ) 06:49, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan (CIS-A2K) గారూ, నేను చెప్పినవి వచ్చాయి.__ చదువరి (చర్చరచనలు) 03:18, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, పాల్గొన్నందుకు, ఇప్పుడు పరిశీలించి చెప్పినందుకు ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:11, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan (CIS-A2K) గారూ, నావరకు నాకు ఏమీ తేడాలు లేవు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:18, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 08:28, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan (CIS-A2K) గారూ, సరిగ్గానే ఉందండి. ధన్యవాదాలు.--VJS (చర్చ) 06:44, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారూ, ధన్యవాదాలండీ. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 08:28, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వార్షికోత్సవ సన్నాహకాలు, పనుల గురించి చదువరిదొక సూచన[మార్చు]

వార్షికోత్సవాలకు సంబంధించి పనులు వేగం పుంజుకుంటున్నాయ్. చర్చలు జరుగుతున్నై. లక్ష్యాలు, డబ్బులు వగైరాల అంచనాలు వేసే స్థితికి వచ్చాం. ఈ సమావేశాలు, చర్చలకు సంబంధించి నివేదికలు ఇవ్వడం అనేది ఒక పెద్ద పని. ఇంకా బోలెడు పనులు ముందు ముందు చెయ్యాల్సి ఉంది. ఈ పనులు ప్రస్తుతం పవన్ గారు మాత్రమే చేస్తున్నారు. ఈ బాధ్యతలను ఇతరులు కూడా స్వీకరిస్తే పని సులువౌతుంది. పవన్ గారూ, వార్షికోత్సవాలు నిర్వహించేందుకు కమిటీలు ఎలాగూ అవసరమే కాబట్టి వాటిని వీలైనంత త్వరగా వేసి పనులు పంచుకుంటే పనులు చేసే వేగం కూడా పెరుగుతుంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 09:17, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari ఏయే కమిటీలు ఉంటే బావుంటుందన్నదానిపై ఒక జాబితా వేయమని ప్రణయ్ రాజ్ గారిప్పటికే సూచించారు. ఆ పనిమీదుంటానండీ. రేపటి ఉదయం లోగా ఈ పనిచేసేస్తాను. ఈ కింద మీరు పెట్టిన "కమిటీలపై చర్చ" దగ్గరే చేస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 09:19, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, ఈ అంశంపై ఒక అప్డేట్. నిన్న నాకు దీనిపై పనిచేయడం కుదరలేదు. అలానే, ఈ అంశంపై పూర్తి సమగ్రంగా ఒక్కసారే నా ఇన్పుట్ పెట్టాలని పనిచేస్తున్నాను. కాబట్టి, రేపు సాయంత్రంలోగా పోస్టు చేస్తానండీ. గమనించగలరు. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 17:04, 27 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ ప్రణాళికపై చర్చ[మార్చు]

కమిటీలపై చర్చ[మార్చు]

వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023లో ఏర్పాటైన కమిటీలు, వాటి నిర్వహణ, అందులో పాలుపంచుకున్నవారి భాగస్వామ్యం వంటివాటిలో గల సాధకబాధకాలను అనుసరించి ఈ కింది అంశాలను సూచిస్తున్నాను. ఏయే కమిటీలు ఉంటే బావుంటుందో, వాటికి ఏయే బాధ్యతలు ఉండొచ్చో, ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకుంటే బావుంటుందో నా అవగాహన మేరకు సూచిస్తున్నాను.

ముందుగా ప్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్‌ని విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో నిర్వహించడానికి ఆసక్తి చూపించిన @Kasyap: గారు స్వయంగా ఆ నిర్వహణ బాధ్యత స్వీకరిస్తే బావుంటుందని సూచిస్తున్నాను. ఆయనకు ఉన్న నిర్వహణానుభవం, మరీ ముఖ్యంగా పలుమార్లు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ విషయంలో చురుగ్గా పనిచేసిన అనుభవం ఇందుకు చాలా ఉపకరిస్తుందని నా భావన.

కమ్యూనికేషన్స్ కమిటీ
  • అంతర్గత, బహిర్గత సమాచారాలన్నిటి ప్రసార, నిర్వహణా బాధ్యతలు ఈ కమిటీ చేపడుతుంది.
    • ఉదాహరణకు ఈ కమిటీ సభ్యులే ఇవ్వవలసిన పత్రికా ప్రకటనలు తయారుచేయడం, తెలుగు వికీమీడియా విషయాలపై కథనాలు తయారుచేసి మీడియాతో సమన్వయం చేయడం మొదలుకొని ఇకపై ఈ పేజీల నిర్వహణ, మీటింగ్ నోట్స్ ప్రచురణ, ఇతర కమిటీల అంతర్గత సమావేశాల మీటింగ్ నోట్స్ విషయంలో ప్రచురణ/ఫాలో అప్ వరకూ బయటి, లోపలి సమాచారాలన్నిటినీ నిర్వహిస్తారు. ఇందులోకి కార్యక్రమ నివేదిక కూడా వస్తుంది.
  • పత్రికా సంబంధాల విషయంలోనూ, సామాజిక మాధ్యమాల నిర్వహణ విషయంలోనూ, ప్రాజెక్టు నివేదికలను రాయడంలోనూ మంచి అవగాహన కలిగిన @Nskjnv:, @Pranayraj1985: గార్లు ఈ పనులు చేపడితే బావుంటుందని భావిస్తున్నాను.
    • అవసరం మేరకు వారు మీడియా వ్యవహారాల్లో మరింత నైపుణ్యం కలిగినవారెవరైనా (వికీలోనివారు కావచ్చు, బయటివారు కావచ్చు) సాయంచేస్తారనుకుంటే వారిని కూడా కలుపుకుని ముందుకుపోవచ్చు.
స్కాలర్‌షిప్స్ కమిటీ
  • స్కాలర్‌షిప్స్‌కి సంబంధించిన ప్రమాణాలు ఏర్పాటుచేయడం నుంచి ఫారం ఓపెన్ చేయడం, స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ అంచనా కట్టడం, స్కాలర్‌షిప్స్ ప్రకటించడం వరకూ ఈ కమిటీ బాధ్యత.
    • స్కాలర్‌షిప్స్ ప్రమాణాల్లో ప్రస్తుతం చురుగ్గా రాస్తున్నవారికి, గతంలో రాసి మానేసినవారికి ఎలాంటి నిష్పత్తిలో ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళల శాతం కనీసం ఎంత ఉండాలి, ఆఫ్‌-వికీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మొదలుకొని వివిధ ప్రమాణాలను ఏర్పాటుచేసుకుంటారు. దాన్ని అప్లికేషన్‌లో సమర్పించిన సమాచారాన్ని బట్టీ మాత్రమే కాకుండా వివిధ ఉపకరణాలు ఉపయోగించి మరింత వివరాలు సేకరించి సమాచారాన్ని విశ్లేషిస్తారు. ఆపైన, అప్లికేషన్లను మదింపు వేసి అంచనా కడతారు. ఈ మదింపు ముందుగా అనుకున్న ప్రమాణాలను బట్టి ఉంటుంది. చివరగా స్కాలర్‌షిప్స్ ప్రకటిస్తారు.
    • ఇప్పటికే వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 విషయంలో ప్రమాణాలు, వాటిని మదింపు వేయడానికి వాడిన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని సదరు స్కాలర్‌షిప్ టీమ్ వారి నుంచి తీసుకుని అచ్చంగా ఉపయోగించుకోకుండా మనకు అవసరమైన మార్పులన్నీ చేసి వాడుకోవచ్చు.
    • సాంకేతిక నైపుణ్యాలను, అవసరమైన చోట విధానాలను రూపొందించుకోవడం, కచ్చితమైన నిర్ణయాలను తీసుకోగలగడం వంటి లక్షణాలను ఆధారం చేసుకుని @రవిచంద్ర:, @యర్రా రామారావు: గార్లు ఈ కమిటీ ఏర్పాటుచేస్తే బావుంటుందని భావిస్తున్నాను. ఈ కమిటీలో ఇద్దరు కాక మరి ఇంకొక వ్యక్తి అయినా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రోగ్రామ్స్ కమిటీ
  • కార్యక్రమ లక్ష్యాలకు అనుగణంగా ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయడం మొదలుకొని వాటిని నిమిష నిమిషం ఎలా జరుగుతుందన్న షీట్ వరకూ తీసుకురావడం వరకూ వీరి బాధ్యతలు.
    • ప్రోగ్రామ్స్ రూపకల్పనతో పాటుగా వాటి నిర్వాహకులు, ప్రసంగకర్తలు ఎవరు ఉంటారు, కార్యక్రమం తరహా ఏమిటి, ఎలా జరగాలి వంటివి కూడా వీరే ఆలోచించి, ప్రాక్టికల్ విషయాలు పరిగణనలోకి తీసుకుని, ఇతర కమిటీలతో సమన్వం చేసుకుని, అవసరం మేరకు స్పీకర్లను ఆహ్వానించడం, వారు ఖరారుకాకుంటే వేరేవారిని చూడడం - వంటి పనులన్నీ ఈ కమిటీకి ఉంటాయి.
    • ఈ కమిటీలో @Vjsuseela:, @Chaduvari:, @V Bhavya: గార్లు ఉండడం బావుంటుందని నా అభిప్రాయం. ఆమోదకరం అనుకుంటే నేనూ ఇందులో భాగం పంచుకోగలను.
ఈవెంట్ సేఫ్టీ అండ్ ఇంక్లూజన్ కమిటీ
  • కార్యక్రమం అందరు సభ్యులకూ సుభ్రదంగా ఉండేలాగా, కలుపుకుపోతూండేలాగా చూసుకునే పని వీరిది. ఇందుకోసం అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు
    • మొదటే అన్ని ఇతర కమిటీలకు సేఫ్టీ అండ్ ఇంక్లూజన్‌కి సంబంధించిన సూచనలు చేస్తారు. ఇందుకు అవసరమైతే వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 వారు తమ కమిటీలకు చేసుకున్న సూచనల జాబితా తీసుకుని వాటిలో మనకి పనికొచ్చేవి స్వీకరించి చేయొచ్చు.
    • కార్యక్రమం సురక్షితంగా ఉండేలా, అందరినీ గౌరవంగా ఒకరినొకరు చూసేలా అవసరమయ్యే శిక్షణా కార్యక్రమం చేపట్టడమూ వీరు చేయవచ్చు.
    • ఆన్‌గ్రౌండ్ ఈ సభ్యులు అందుబాటులో ఉండే సేఫ్టీ అండ్ ఇంక్లూజన్‌కి సంబంధించిన సమస్యలేమైనా వస్తే వాటి మీద పనిచేస్తారు కూడాను. ఇది వీరు చేసే పనులు అన్నిటిలోనూ ముఖ్యమైన భాగం.
  • కమిటీలో @Divya4232: గారితో పాటు ఇంకెవరైనా వివాదాల పరిష్కరణలోనూ, నిర్ణయాల్లోనూ సమతూకంగా వ్యవహరించేవారు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం. ఇది నేర్చుకోవాల్సిన రంగం కనుక అవసరమైతే కొంత నిపుణులతో వీరికి శిక్షణ ఇప్పించవచ్చు. పోనుపోను తెవికీకి ఈ జట్టు సభ్యుల అనుభవం బాగా పనికివస్తుంది.
    • ఈ కమిటీకి సేఫ్టీ అండ్ ఇంక్లూజన్ విషయంలో సలహాలకు అనుభవజ్ఞులు ఉండాలి కాబట్టి వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 సహ నిర్వాహకురాలు, వికీ విమన్స్ క్యాంప్ 2023 నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి, సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన నితేష్‌ని ప్రతిపాదిస్తున్నాను.
లాజిస్టిక్స్ కమిటీ
  • హోటల్ నుంచి బస్సుల దాకా, భోజనం నుంచి రవాణా దాకా ప్రతీ లాజిస్టిక్స్ వ్యవహారాలూ వీళ్ళే చూస్తారు. ఈ పనిని మౌలికంగా సీఐఎస్-ఎ2కె చేపడుతుంది. అయితే, సముదాయ సభ్యుల సహాయం కూడా బాగా అవసరం. కాబట్టి, పై కమిటీల్లో పని పూర్తయిన కమిటీలు (ఉదాహరణకు స్కాలర్‌షిప్స్ పని రెండు మూడు వారాల్లో ముగిసిపోతుంది), కాస్త సాయం చేయగలం అనుకన్న కమిటీల సభ్యులు కూడా ఇందులో సాయం చేస్తే బావుంటుంది.
  • సీఐఎస్-ఎ2కె నుంచి నేనూ, మేదిని, నితేష్, మరొక కొత్తగా చేరబోయే సభ్యుడు దీనిలో ఉండి కార్యక్రమాలు విజయవంతం కావడానికి తగ్గ కృషి చేస్తాము. విశాఖపట్టణం ప్రాంతంపై బాగా అవగాహన ఉన్న @Rajasekhar1961: గారి సహాయం ఉండే వీలుంది. @Batthini Vinay Kumar Goud:, @Ramesam54:, @Tmamatha:, @Adithya pakide: తదితరులు ఈ కమిటీలో ఉండడం బావుంటుందని నా అభిప్రాయం.

పైన పద్నాలుగు నుంచి పదిహేడు మంది వరకూ పేర్లు సూచించాను. 30-40 మంది ఉండే కార్యక్రమంలో ఇంతమంది నిర్వాహకులు అవసరమా అన్న ప్రశ్న కూడా రావచ్చు. అయితే దీనివెనుక, ఎక్కువమంది పాల్గొంటే చేసే పని భారం తగ్గుతుందన్న ఆలోచన ఒకటైతే, అందరూ పాల్గొనడం వీలు కుదరకపోవచ్చు కాబట్టి కొద్దిమంది తప్పుకున్నా, పనిచేయలేకున్నా కొందరి మీదే భారం పడకుండా ఉంటుందన్న ఆలోచన మరొకటి. మీమీ అభిప్రాయాలు తెలుపగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 16:45, 28 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు పవన్ గారు. నాకు సూచించిన కమిటీ లో పని చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.@Pavan (CIS-A2K) V Bhavya (చర్చ) 17:22, 1 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు[మార్చు]

డిసెంబరు లోకి వచ్చేసాం. Kasyap, Nskjnv, రవిచంద్ర, V Bhavya, Divya4232, Rajasekhar1961, Batthini Vinay Kumar Goud, Ramesam54 గార్లకు - కమిటీల్లో చేరే విషయమై పైన చేసిన ప్రతిపాదనలపై మీ సమ్మతి కూడా తెలియజేస్తే, వీలైనంత త్వరగా కమిటీల సమావేశాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమ రూపురేఖలు, ప్రణాళికలు, కార్యాచరణ వగైరాలపై మాట్లాడుకోవచ్చు. 4 వ తేదీ సోమవారానికల్లా సమ్మతి తెలియజేయవలసినదిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 16:41, 1 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదికపై చర్చ[మార్చు]

డిసెంబరు 10 న హైదరాబాద్ లో ప్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్‌ - ఒక ఆలోచన[మార్చు]

తెవికీ 20 వ వార్షికోత్సవం జరుపుకొంటూ మన ఆవిర్భావ దినోత్సవం డిసెంబరు 10న, ప్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్‌ ఒకటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో మనకు తెలిసిన కొత్త వికీపీడియాన్ లు , ప్రెస్సు వారిని పిలిచి వార్షికోత్సవా ఉద్దేశాలను మన ప్రణాళికను రెండు గంటల ఔట్రీచ్ ఈవెంట్‌ గా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలదు, సభ్యులు అభిప్రాయం రేపు సాయంత్రం లోపల తెలియచేయగలరు. సీఐఎస్‌-ఎ2కె వారి తోర్పాటును బట్టీ ఈ కార్యక్రమ లాజిస్టిక్స్,తేనీటి ఫలహార,బ్యానర్ తదితర ఏర్పాట్లు నేను చేయగలను, ఒక వేళ ఉన్న హైదరాబాద్ వికీపీడియన్ లు కలసి ప్రస్‌క్లబ్ లో ఒక ప్రకటన చేసినా బాగుంటుంది అనుకొంటున్నాను. Kasyap (చర్చ) 06:35, 4 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన అన్నా..నేను తప్పకుండా హాజరవుతాను. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 06:46, 4 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ... మంచి కార్యక్రమం, నేను కూడా వస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:10, 5 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు ఆదిత్య పకిడే Adbh266 గారు ప్రణయ్‌రాజ్ వంగరి గారు, అయితే నిన్న జరిగిన చర్చల అధారంగా , ఉన్న సమయం వనరులను బేరీజువేసుకొని ఆవిర్భావ దినోత్సవం డిసెంబరు 10న నిర్వహించతలపెట్టిన ప్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్‌ ఆలోచనను విరమిస్తున్నాను. --Kasyap (చర్చ) 05:25, 6 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అయితే ఒక పని చేద్దాం. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహించాలి అనుకుంటున్నాం కాబట్టి, డిసెంబరు 10 ఆదివారం రోజున మధ్యాహ్నం గంటన్నరపాటు (30 నిముషాలు తెవికీ జన్మదిన శుభాకాంక్షలు-సభ్యుల అనుభవాలు, 60 నిముషాలు శిక్షణా తరగతులు) ఆన్లైన్ కార్యక్రమం నిర్వహిద్దాం. అపుడు తెవికీ జన్మదినంనాడు ఒక కార్యక్రమం చేసినట్టు కూడా ఉంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:46, 6 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూడవ సమావేశం[మార్చు]

తెవికీ 20 వ వార్షికోత్సవానికి సంబంధించి కమిటీలపై చర్చ, సభ్యుల స్పందనలు అనుసరించి కమిటీలను ఏర్పాటు చేయడమైనది. (కమిటీ టాబ్ ను ఉపయోగించండి). ఈ కమిటీలు, సభ్యుల నిర్వహించవలసిన విధులు, బాధ్యతలు గురించి చర్చించుటకు 5 డిసెంబర్, 2023న రాత్రి 7-9 గం.కు గూగుల్ మీట్ లో సమావేశము ఏర్పాటు చేయడమైనది.

@Chaduvari,@V Bhavya, @యర్రా రామారావు, @Divya4232, @Nskjnv, @Kasyap, @Pranayraj1985, @పవన్ (CIS-A2K), @రవిచంద్ర:,@Divya4232, @Rajasekhar1961: @Batthini Vinay Kumar Goud:, @Ramesam54:, @Tmamatha:, @Adithya pakide: @Vjsuseela

సభ్యులు అందరు తప్పకుండా సమావేశములో పాల్గొనవలసినదిగా మనవి. VJS (చర్చ) 12:06, 4 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారూ, నేనూ పాల్గొంటానండీ. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:26, 4 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ పాల్గొంటాను. యర్రా రామారావు (చర్చ) 14:03, 4 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారూ... అందుబాటులో లేకపోవడం వల్ల నేన ఈ సమావేశంలో పాల్గొనలేకపోయాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:08, 5 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. కమిటీలు, సమావేశ నివేదిక పరిశీలించండి. ధన్యవాదాలు VJS (చర్చ) 04:35, 6 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ ప్రణాళిక[మార్చు]

కార్యక్రమ ప్రణాళీకలో ఇప్పటి వరకూ వివరాలు నింపకపొవడానికి ఏదైనా కారణం ఉందా.B.K.Viswanadh (చర్చ) 17:42, 29 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ ప్రణాళికకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కార్యక్రమం ఖరారు అవడంతోటే వివరాలు నింపబడుతాయి. ధన్యవాదాలు. - ప్రోగ్రామ్ కమిటీ. VJS (చర్చ) 14:51, 30 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా కార్యనిర్వాహక కమిటీ, సిఐఎస్ ఎ2కె సభ్యులందరికి నమస్కారం, శుభాభినందనలు..! వేదిక వివరాలు, అక్కడికి చేరుకున్నాక సంప్రదించాల్సిన వారి పేరు తెలియచేయగలరు. ధన్యవాదాలు.. --Muralikrishna m (చర్చ) 05:30, 24 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]