Jump to content

వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తదుపరి చర్యలు

[మార్చు]

ఈ సమావేశంలో చురుగ్గా ఉన్న వాడుకరుల్లో చాలామంది పాల్గొన్నారు. అందులో పాల్గొనని వారు కూడా తమ అభిప్రాయాలు ఇక్కడ రాస్తే, దీనిపై ఇక ముందుకు పోవచ్చు.

చదువరి అభిప్రాయాలు

[మార్చు]

ఈ ఆన్‌లైను సమావేశంలో ప్రస్తుతం తెవికీలో చురుగ్గా ఉన్న వాడుకరులు దాదాపుగా అందరూ పాల్గొన్నారు. నేను హాజరు కాలేదు గానీ, ఇక్కడ రాసిన నివేదిక ప్రకారం నేను గ్రహించినవి ఇవి:

  1. తెవికీ 20 వ వార్షికోత్సవంలో సిఐఎస్ భాగస్వామ్యం తీసుకుంటుందా, అలా అయితే కార్యక్రమం స్థూలంగా ఎలా ఉండాలి అనేది ఈ సమావేశ విషయం.
  2. వార్షికోత్సవంలో ఆటవిడుపు, వేడుకలు వగైరాలతో పాటు సమీక్ష, ప్రణాళికల వంటివి ఉంటే సిఐఎస్‌ అందులో భాగస్వామ్యం తీసుకుంటుంది. (సిఐఎస్ భాగస్వామ్యం తీసుకోవాలంటే ఇది ఒక నిబంధన అని నేను భావిస్తున్నాను.)
  3. సిఐఎస్‌ వారు తెవికీపై స్వతంత్ర సమీక్ష ఒకటి చేస్తారు. దాని నివేదికను వార్షికోత్సవంలో సమర్పిస్తారు. తద్వారా వార్షికోత్సవ సమయంలో దానిపై చర్చ జరిపే అవకాశం కూడా ఉంటుంది.
  4. భవిష్యత్తు కార్యాచరణపై జరిపే చర్చలో కూడా ఈ సమీక్షా నివేదిక పనికొస్తుంది.
  5. సిఐఎస్ వారి భాగస్వామ్య నిబంధనపై సమావేశంలో పాల్గొన్నవారు సానుకూలత వ్యక్తపరచారు. వ్యతిరేకత అయితే అసలు కనబడనే లేదు.

దీనిపై నా అభిప్రాయాలు:

  1. తెవికీని సమీక్షించాలనే సిఐఎస్ వారి ప్రతిపాదన బాగుంది. ఈ సమీక్ష భవిష్యత్తులో తెవికీ ప్రగతికి ఉపయోగపడే అవకాశం ఉంది.
  2. సీఎస్ భాస్వామ్యం కారణంగా నిధులు చేకూరి, ఈ కార్యక్రమాన్ని మరింత పెద్దయెత్తున నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.

ఈ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం లభించింది కాబట్టి, సిఐఎస్, తెవికీ రెండూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే నేనూ భావిస్తున్నాను. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని తెవికీ లోని కార్యక్రమ ప్రతిపాదకులు/నిర్వాహకులను, సిఐఎస్‌నూ కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 00:17, 12 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]