Jump to content

వాడుకరి చర్చ:Ramya Kanumalli

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Ramya Kanumalli గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Ramya Kanumalli గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 08:08, 16 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

రమ్య కనుమల్లి గారు, ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీ లాంటి వారి అవసరం తెలుగు వికీపీడియా చాలా ఉంది, మీ మార్పులు చేర్పులు అలాగే ఇవ్వండి, కానీ మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టారు, గమనించారా? చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి రమ్య కనుమల్లి గారు,ఇక్కడ నొక్కి ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)10:49, 17 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షికలు వద్దు

[మార్చు]

రమ్య కనుమల్లి గారు, చాలా చురుకుగా మార్పులు - చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీ మార్పులు చేర్పులు అలాగే చేస్తూనే ఉండండి అయితే, మీ వద్ద ఎలాంటి సమాచారం లేకపోయినా శీర్షికలు పెడుతున్నారు, ఉదాహరణకి సమీపంలోని గ్రామాలు, మండలాలు, ఇలాంటివి సమాచారం ఉంటే శీర్షిక పెట్టి సమాచారం లేని శీర్షికలు వద్దు. మీ సమయం వృధా అవుతుంది. మీరు చేర్చిన ఖాళీ శీర్షికలు నిర్వాహకులు తొలగిస్తున్నారు, దానివలన మీకు నిర్వాహకులకు ఇద్దరికీ సమయం వృధా అవుతోంది గమనించగలరు. ధన్యవాదాలు.-- ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)12:18, 20 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గొల్ల (గ్రామం) గ్రామ వ్యాసంలో మీ మార్పులు గురించి

[మార్చు]

రమ్య కనుమల్లి గారు, మీరు వికీపీడియాలో సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.కానీ మీరు చేస్తున్న మార్పులు సహేతుకంగా ఉండటలేదు.అన్నీ ఖాళీ విభాగాలు చేరుస్తున్నారు.ఈ విషయంపై ప్రభాకర్ గౌడ్ గారు మీకు వివరంగా తెలియజేసారు.అయినప్పటికి మీరు పదే పదే గ్రామ వ్యాసాలలో అదే మార్పులు చేస్తున్నారు.మీ దగ్గర తగిన మూలలతో సమాచారం ఉన్నప్పుడు మాత్రమే ఏ వ్యాసంలో నైనా, అవసరమనుకుంటే కొత్త విభాగం చేర్చి సమాచారం కూర్పు చేయాలి.గొల్ల (గ్రామం)లో మీరు చేసిన రద్దు చేసిన కూర్పులును తిరిగి కూర్పు చేసారు.ఎందుకు రద్దుచేసారో గమనించండి. ఒకవేళ అర్ధంకాకపోతే రద్దు చేసిన వాడుకరిని నిరభ్యంతరంగా నేను మీకు తెలియపర్చినట్లుగా వారి చర్చాపేజీ ద్వారా అడగవచ్చు.భయపడవలసిపనిలేదు. దయచేసి వికీపీడియాలో ఏదో తోచుబడికోసమో లేక గణాంకాలు కోసం చేయవద్దు.ముందుగా మీరు ఇతరవ వాడుకరులు చేసే సవరణలు గమనించండి. మీ చర్చా పేజీలోని స్వాగత మూసలో వివరించిన ప్రకారం అన్నీ చదివి అర్థం చేసుకోండి.మీరు అలానే పదేపదే అలాటి మార్పులు చేస్తూ ఉంటే, నిర్వహకులు మిమ్మల్ని నిరోధించటానికి అవకాశం ఉంది.ఇది దృష్టిలో ఉంచుకోండి.మీకు ఏమైనా సందేహాలు ఉంటే, సహాయం కావాలి ద్వారా అడగవచ్చు.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 15:06, 24 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.