వికీపీడియా:సహాయ కేంద్రం/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 2 | పాత చర్చ 3 | పాత చర్చ 4

Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

సుసర్ల దక్షిణామూర్తి

http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%A6%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF అనే లింకులో పెద్ద పొరబాటు జరిగింది. సంగీతదర్శకుణ్ణి అతని తాతగారితో కన్‌ప్యూజ్ చేశారు. పైగా త్యాగరాజు శిష్యుడి పేరు తప్పుగా రాశారు. మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్య. రోహిణీప్రసాద్.

మీరు దృష్టాంతాలు (References) ఉదహరించి నిరభ్యంతరంగా మార్చండి. ఇటువంటి ప్రశ్నలను ఆ వ్యాస చర్చా పేజీలో రాయండి , ప్రస్తుతానికి నేను చేరుస్తాను. అర్జున 05:54, 26 మే 2010 (UTC)

ఈము పిట్టలగురించి వివరాలు

please information of emu birds like how to remove oil from emu birds and meat,skin.oil etc. and also send the food details and medicine .

  • note send all information in Telugu language

మీ Wikipedia లొ questions ఎక్కధ అదగాలొ వివర0గా చెప్ప0ధి? మీ answers ను rahguramreddy000@gmail.com కు ప0పిచ0ధి.

ఈము చూడండి. అర్జున 05:49, 26 మే 2010 (UTC)

ఆరువేలనియోగులు

మేము ఆరువేల నియోగి బ్రహ్మలము.మాకు పాటించవలసిన నియమాలు,పధతులు తెలుపగోరేదము.నావయస్సు62 సంవత్సరములు ఇట్లు కొప్పాకరామకృష్ణ

బ్రాహ్మణులు చూసి సంబంధిత మార్పులు చేయండి. అర్జున 05:47, 26 మే 2010 (UTC)

వ్యాసాలలో బొమ్మలు కనపడటం లేదు ఎందుకని

నేను మాఊరి గురించి ఒక వ్యాసాన్ని రాశాను కానీ దానిలో ఒక చిత్రాన్ని ఉంచదలచాను అది ఎలానో చెప్పండి? నేను ఎకౌంటు కూడా క్రియేట్ చేశాను.

వ్యాసంలో బొమ్మ ఉంచాలంటే ముందుగా ఎడమవైపున ఉన్న ఫైలు అప్లోడు ద్వారా వికీపీడియాలోకి ఎక్కించండి. తర్వాత [[ఫైలు:Filename.xxx|thumb|right|200px|Caption]] అని వ్యాసంలో పెడితే బొమ్మ కనపడుతుంది. --రవిచంద్ర (చర్చ) 15:05, 25 మార్చి 2010 (UTC)

అపిల్ కీబోర్డ్ తో టైప్ చేయడం ఎలా

సబ్యత్వం కావాలి

నాకు వికీపీడియాఎకాంటు ఉంది కానీ సభ్యత్వం లేదు .అసలు సభ్యత్వం అంటే ఏమిటి ? ఇంకా పేజీలలో వివిధ రకాలుగా రాసేందుకు కోడ్లు ఏమైనా ఉంటే చెప్పగలరు!

అకౌంటు/ఖాతా అన్నా సభ్యత్వం అన్నా అంతా ఒకటే. మీకు ఖాతా ఉన్నది కాబట్టి వికీపీడియాలో మార్పులు చేసేటప్పుడల్లా ప్రవేశించి( లాగ్ ఇన్ ) అయి చేస్తే ఆ మార్పులు మీఖాతాలోకి వెళతాయి. ఇలాంటి చర్చా పేజీల్లో వ్యాఖ్యలు రాసేటపుడు ~~~~ ఇలా నాలుగు టిల్డే గుర్తులు టైపు చేస్తే వ్యాఖ్య చివర మీ సంతకం పడుతుంది. ఇలాగా --రవిచంద్ర (చర్చ) 04:27, 31 మార్చి 2010 (UTC)

విషయసూచిక(దాచు) ఎలా పెట్టాలి

సార్ ఒకపేజీ ద్రియేట్ చేసినప్పుడు దానిలో విషయసూచిక(దాచు) అనే ఒక పెట్టె కనబడుతుంది కదా ? అది ఎలా పెట్టాలో చెప్పగలరు

దానిని చూపెట్టడానికి ఏమీ చేయనక్కరలేదు. ఒక పేజీలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ విభాగాలు పెడితే దానంతట అదే కనిపిస్తుంది. --రవిచంద్ర (చర్చ) 04:35, 1 ఏప్రిల్ 2010 (UTC)

సహాయము

అయ్యా క్రైస్తవమతముకు సంబందించిన పేజీలో "క" కింద కొన్ని లింకులను య కింద కొన్ని లింకులను జతపరిచారు అలాగే నేను కూడా ఒక కొత్తవ్యాసాన్ని రాసి అక్కడ లింకు తగిలించ దలచాను సహాయం చేయగలరు. (సురేష్)

మీరు వ్యాసం చివరలో [[ వర్గం: క్రైస్తవ మతము]] అని చేర్చితే, ఆ వ్యాస ప్రారంభ ఆక్షరం క్రింద ఆ వ్యాసం ఆటోమాటిక్ గా పెట్టబడుతుంది. అర్జున 05:35, 26 మే 2010 (UTC)

రచ్చ బండ - cancellation of rachchabanda alrts to my e.mail

please cancel my request of RACHCHABANDA alerts. kindly do not send me any unsolicited alerts and mails from rachchabanda. thank you. vinay since57@gmail.com

మీరు పొరబడినట్లున్నారు. తెవికీ స్పాము పంపదు. మీ ప్రశ్న రచ్చబండ గూగుల్ గ్రూప్ కి సంబంధించినదేమో?[1] అర్జున 05:41, 26 మే 2010 (UTC)

కొన్ని ఛిత్కాలు రాయాలి అనుకొన్తున్నాను

ఆరొగ్య ఛిత్కాలు, హాస్యమ్, గురిన్ఛి రయాలి అనుకున్యతున్నాను ఎక్కద రాయాలి?

చిట్కా_వైద్యాలు అన్న పేజీ చూసి సరియైన చోట మార్పులు చేయండి. అర్జున 05:13, 26 మే 2010 (UTC)

హిందూమతం ప్రాజెక్టు

నేను ఇటీవలే తెవికి లో సభ్యునిగా చేరాను.హిందూమతం ప్రాజెక్టు లో సభ్యునిగా ఎలా చేరాలో చెప్పండి.Akrbabu 10:20, 16 జూన్ 2010 (UTC)

వికీపీడియా:WikiProject/హిందూమతం పేజీ చూడండి. ఈ ప్రాజెక్టు నవంబరు 2009 నుండి క్రియాశీలకంగా లేదు. మీరు దీనిని మరల చేతనం చేయవచ్చు. ప్రాజెక్టు గురించి అవగాహనకు, ఇతర ప్రాజెక్టు పేజీలు చూడండి. మీ ప్రయత్నాలకు శుభంకోరుతూ.. అర్జున 15:35, 16 జూన్ 2010 (UTC)

రాయడము గూర్ఛిసమ్దెహము

నేను కొన్ని తెలుగు సామెతలు సేకరిన్ఛాను వాటిని ఈ పేజిలో రాయవఛ్ఛా

సామెతలు చదివి, రాయండి. ఈ పేజీలో రాయకూడదు. అర్జున 06:13, 14 జూలై 2010 (UTC)

తెలుగు వెబ్ సిట్ సహాయం కొరకు

నేను తెలుగులో వెబ్ సైట్ తయారు చేయాలనుకుంటున్నాను.విండోస్ 7 ని వాడుతున్నాను.తెలుగు కోసం 'అను 7.0 సాఫ్ట్ వేర్' ను వాడుతున్నాను. కాని, నేను ఉపయోగిస్తున్న అడోబ్ డ్రీంవీవర్ సీయస్3 సాఫ్ట్ వేర్ లో తెలుగు పదాలు రావడం లేదు.అడోబ్ డ్రీంవీవర్ సీయస్3 లో తెలుగు రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి సాఫ్ట్ వేర్ వాడాలి? తెలుపగలరు. Aggidi 18:11, 28 జూలై 2010 (UTC) - Aggidi 18:11, 28 జూలై 2010 (UTC) శ్రీకాంత్

తెవికీ కి సంబంధించని సాంకేతిక సమస్యలకి ఈ పేజీ సరైన వేదికకాదు. మీరు అమ్మకందారుని లేక , దానికి సంబంధించిన మెయిలింగు లిస్టులలో సంప్రదించితే మంచిది--అర్జున 05:22, 29 జూలై 2010 (UTC)

village

నేను మా ఊరి గురిన్ఛి రాయాలన్తె ఎక్కద రాయాలి?

మీ ఊరికోసము, లేక మీ మండలము లేక జిల్లాకోసం వెతికి, ఆ పేజీలలో వుండే లింకులను అనుసరిస్తూపోతే, మీకు కావలసిన పేజీవస్తుంది. ఉదా: పర్చూరు లింకు చూడండి.--అర్జున 08:39, 20 ఆగష్టు 2010 (UTC)

doubt regarding typing

అయ్యా, నేను కొత్తగా వికిపీడియాలో చేరాను. దయ చేసి నా ఈ సందేహాన్ని తీర్చండి.బరహా నోట్ పాడ్ లో టైప్ చేసి కాపీ పేస్ట్ చేస్తే వికిపీడియా పేజీల్లో ప్రింట్ అవుతుందా? ఇట్లు భవదీయుడు, రాయపెద్ది అప్పాశేష శాస్త్రి రిటైర్డ్ ప్రిన్సిపాల్ rassastry@gmail.com +91 94402 44283

స్వాగతం. తప్పకుండా. చాలా ప్రశ్నలకు పరీక్షించటమే (చేసి చూడటమే) సమాధానం. తెలుగు తోడ్పాటు అన్ని రకాల కంప్యూటర్లలో చాలా మెరుగైంది. మామూలుగా పనిచేయటానికి, మీ కిష్టమైన పద్ధతి వాడి తెలుగు వికీపీడియా (తెవికీ)లోనే టైపుచేయవచ్చు తెవికీలో టైపింగ్ గూర్చి చాలా సమాచారము వుంది. అవి పరిశీలించి మీ సందేహాలు ఇక్కడగాని, మెయిలింగ్ లిస్టు లో కాని అడగండి.--అర్జున 04:25, 29 ఆగష్టు 2010 (UTC)

Sasikanth

నేను ఒక్కొక్కఇంటి పేర్ల మానవుల పరంపర గురించి వంశచరిత్ర/వంశవృక్షము వ్రాయాలనుకుంటున్నాను. వీలయితే దానికి సంబందించిన లింకు ఇవ్వగలరు. మీ ़़़़़

  • సరిగా అర్థం కాలేదు. తెలుగునాట ఇంటిపేర్ల జాబితా చూడండి. ఒక్కొక్క ఇంటిపేరు కి మీరు చరిత్ర రాయాలనుకుంటున్నారా ? అలాగైతే ఈ జాబితాలో ఇంటిపేరు లింకులపై నొక్కి మీరు రాయాలనుకున్నది రాయవచ్చు. --శశికాంత్ 16:31, 17 సెప్టెంబర్ 2010 (UTC)

Sasikanth

నేను (ఒక్కొక్క) ఇంటి పేర్లతో మానవుల వంశ చరిత్ర/వంశ వృక్షము వ్రాయాలని అనుకుంటున్నాను. దానికి సంబందించిన లింకు ఇవ్వగలదరు. ़~~़़़़PRASAD

  • ఈ పెట్టెలో మీ వ్యాసం పేరును(Title) రాసి, బటన్ నొక్కండి. అప్పుడు పేజీ వస్తుంది. ఆ పేజీలో రాసి భద్రపరిస్తే పని అయిపోతుంది. ఇంకా సహాయం కావాలంటే అడగండి.

neenu ela login avvali

గొవింద రాజు--122.169.162.243 04:34, 6 డిసెంబర్ 2010 (UTC)

మీరు ఖాతా తీసుకుంటే మీ ఖాతా తో ప్రవేశించి (లాగ్ఇన్) అయ్యి మార్పులు చేయవచ్చు. తెవికీ మొదటిపేజీలో కుడివైపు పై భాగాన వుండే లింకు (లోనికి ప్రవేశించండి/లేక ఖాతాని సృష్టించుకోండి) నొక్కి మీరు సభ్యత్వం పొందవచ్చు. --అర్జున 06:53, 8 డిసెంబర్ 2010 (UTC)

up loading essays

పెండ్యాల రాంబాబు సాప్ట్ వేరునుపయోగించి వ్రాసిన వ్యాసం ను వికిపిడియలో ఎలా 'అప్ లోడ్'చెయ్యాలి.

పాలగిరి-నా వద్ద వంట నూనెల గురించి వ్రాసిన వ్యాసాలు వున్నాయి.అయితే వాటిని పెండ్యాల రాంబాబు తెలుగు సాప్ట్ వేరు ఉపయోగించి వ్రాసాను.వాటిని వికిపిడియ లో 'అప్ లోడ్'చెయ్యిటకు ప్రయత్నించిన వీలుకావడం లేదు.మన వీకిపిడియ 'మీద నేరుగా వ్రాయలన్న కొన్ని సంయుక్త అక్షరములను వ్రాయడం కుదరటం లేదు.అలాగే మద్యలో ఇంగ్లిక్ష్ పదాలను వ్రాయడం కుదరటం లేదు.సలహ ఇవ్వగలరు.వంటనూనెలగురించి నావద్ద తెలుగులో సమగ్రహమెఇన వ్యాసాలు వున్నాయి.

పెండ్యాల రాంబాబు గారి సాఫ్ట్వేర్, పాతపద్ధతి ఫాంట్లు (TL-Rambabu) వాడుతుంది. అంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం (http://www.apolc.net/) వారి సైట్ కూడా దీనినే వాడుతుంది. దానిని మీరు యూనికోడ్ లోకి మార్చే పద్ధతి వుందేమో పరిశీలించండి. చాలా పాత పాంట్లని పద్మ అనే ఫైర్ఫాక్స్ ఉపకరణం ద్వారా యూనికోడ్లోకి మార్చే సౌకర్యముంది. అయితే ఇంకా పెండ్యాల రాంబాబు గారి ఫాంటు తోడ్పాటు లేదు. ఆ సాఫ్ట్వేర్ బాగా ప్రాచుర్యంలో వుంటే, మీ అభ్యర్థనను పద్మ వారికి తెలియచేయండి. --అర్జున 00:28, 30 జనవరి 2011 (UTC)
కీ బోర్డు వ్యాసం చూస్తే మీ టైపింగ్ సందేహాలకు సమాధానం దొరుకుతుంది.--అర్జున 00:30, 30 జనవరి 2011 (UTC)
పాలగిరి: గుణింతాలను,సంయుక్త ఆక్షరాలను ఎలా “ Type’చెయ్యాలి. కొన్ని పదాలను ఉదా:Hydro,dei,train,pei tri లాంటి పదాలను వికీపిడియ పేజిలో టెఇపు(Type)ఎలా చెయ్యలో దయచేసి సలహ ఇవ్వగలరా.నాకు ఇబ్బందిగా వున్న పదాలు. ట్రెఇ(tri or try) పెఇన(peina),హెఇడొజను(hydrogen,),ఇలాంటి ఆక్షరము లను టెఇపు(Type) చెయ్యు గెఇడ్(Guide) వివరాలు అందించగలరు.
వికీపీడియా:టైపింగు సహాయం వాడుతుంటే, హైడ్రో haiDrO గా టైపుచేస్తే చాలు. గుణింతాలు రాసేటప్పుడు హల్లు కి గల ఇంగ్లిషు అక్షరాలలో చివర a తీసేసి తగిన అచ్చు అక్షరాలు టైపు చేస్తే సరి. ka క అయితే ke కె అవుతుంది. సంయుక్తాక్షరాలకు కూడా హల్లులో చివరన వుండే a తొలగించి దాని తరువాత హల్లు అక్షరము (a లేకుండా) టైపు చేసి తరువాత అచ్చుకి తగ్గట్టుగా ఇంగ్లిషు అక్షరాలు టైపు చేస్తే సరిపోతుంది.ఉదాహరణకు అర్జున రాయటానికి arjuna అని టైపుచేస్తే చాలు. ఆ పేజీలో చాలా వుదాహరణలున్నాయి. గమనించండి.--అర్జున 04:55, 31 జనవరి 2011 (UTC)

గూగుల్‌ అనువాద పరికరం

గూగుల్‌ అనువాద పరికరం వాడడం ఎలా?

SphOorTy 20:13, 12 ఏప్రిల్ 2011 (UTC)

గూగుల్‌ అనువాద పరికరం సహాయం పేజీ దానిలో వీడియో చూశారా http://translate.google.com/support/toolkit/bin/answer.py?hl=en&answer=147809 -అర్జున 16:02, 13 ఏప్రిల్ 2011 (UTC)

సంతకం

సంతకం తెలుగులో పెట్టడం ఎలా?

SphOorTy 20:17, 12 ఏప్రిల్ 2011 (UTC)

మీరు వికీపీడియాలో ప్రవేశించన తరువాత పై వరుసలో నా అభిరుచులు పై నొక్కినపుడు కనబడేపేజీలో సంతకం అనే విభాగంలో తెలుగులో మీ పేరు రాసుకుంటే చాలు.--అర్జున 16:05, 13 ఏప్రిల్ 2011 (UTC)

ఊరుకి సంబందించిన చిత్రములు

  • ఏదైన ఒక ఊరుకి సంబందించిన చిత్రములు, వివరములు, అక్షాంశ-రేఖాంశములు, మరే విధములయినటువంటివి (ఉదా: "విజయవాడ" కు సంబందించిన, పొందుపరచిన చిత్రముల వివరములు లాంటివి) ఏవిధముగా పొందగలము.
  • దయచేసి తెలియజేయ గలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:43, 9 జూన్ 2011 (UTC)

ఇంతకు ముందు వీటి గురించి తెలుగులో కృషి చేసినవారు ఇప్పుడు క్రియాశీలంగా లేరు. భారతదేశ మేప్ ల గురించిన ప్రాజెక్టునిసంప్రదించండి . --అర్జున 16:57, 19 జూలై 2011 (UTC)

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --2&3

నేను ‘బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన ౨&౩ భాగాలు పోస్టు చేసాను. కాని అందులో చాల తక్కువ భాగం మాత్రమే ప్రచురితమయింది. అంతే కాదు, అది బాగా కుదింపబడింది. ఎందుకలా జరిగింది. ఏదైనా పరిమితి ఉందా ? ఇలాగయితే ౩౬ భాఘల బాలాజీ కథని ఎలా పోస్టు చేయగలను ? విషయం అందంగా కనపడాలి,మరియు నాలుగయిదు పేజీలకి సరిపడేలా ఉంటే ఏం చేయాలి ? --SrIdhar 07:23, 2 జూలై 2011 (UTC)

సమస్య పరిష్కరించబడిన విదానానికి వాడుకరి చర్చా పేజీ చూడండి.--అర్జున 16:49, 19 జూలై 2011 (UTC)

ఇంగ్లీషు పదాలు చేర్చుట

తెలుగులో వ్యాసం వ్రాయునప్పుడు,ఇంగ్లీసు పదాలను చేర్చవలెనన్న ఎలా? దయచేసి చెప్పగలరు. పాలగిరి

వికీపీడియా తెలుగు టైపింగు సహాయం పద్ధతి వాడుతున్నట్లయితే ఎస్కేప్ (Esc) నొక్కితే ఇంగ్లీషుకి మారుతుంది. మరల ఎస్కేప్ నొక్కితే తెలుగుకి మారవచ్చు.-- అర్జున 09:28, 27 జూలై 2011 (UTC)

చిత్రాలను వ్యాసానికి అనుగుణంగా అప్‌లోడ్్‌చెయ్యడం

ఆయ్యా,నేను 'ఇండొర్‌గేమ్స్' పేరుతో ఒక వ్యాసాన్ని అప్‌లోడ్‌చెయ్యడం జరిగినది.అయితే ఆ గేమ్స్ కు సంభందించిన పొటొలను అప్‌లోడ్ చెయ్యడం నాకు రాదు.దయచేసి మన సభ్యులెవరైన పొటొలను చేర్చిన,వారికి ధన్యవాదాలు తెలుపగలను. పాలగిరి

తరువాత ప్రశ్నసమాధానంచూడండి. అర్జున 10:15, 15 సెప్టెంబర్ 2011 (UTC)

బొమ్మల అప్‌లోడింగ్

రాజశేఖరుగార్కి నమస్కారంలతో, బొమ్మల లైసెంగ్‌అనగా నేమి,వీటిని నేను నెట్‌నుండి బ్రౌజ్‌చేసి పంపాను.దయచేసి తెలియచెయ్యగలరు.reddy 12:02, 24 ఆగష్టు 2011 (UTC)

చూడండి లింకు అర్జున 10:14, 15 సెప్టెంబర్ 2011 (UTC)

నకలు తీయడం

నేను తెల్కిలోని తెలుగు వ్యాసాలను save/selectచేసి ,కంప్యుటరులో నా ఫైల్‌లో పెస్ట్‌చేసిన,తెలుగులో కాకుండగా చిన్న క్యుబ్‌లవలె సేవ్‌అవుచున్నది.తెలుగులో కన్పించవలెన్న ఏమి చెయ్యాలి,Rama krishna reddy.P 05:13, 15 సెప్టెంబర్ 2011 (UTC)

చూడండి లింకు
ఇంతకు ముందు వరుసలో వ్యాఖ్య రాసినది అర్జున 10:10, 15 సెప్టెంబర్ 2011 (UTC)

పట్రాయని సంగీతరావు

నమస్కారం. పట్రాయని సంగీతరావు అనే పేజీ సృష్టించాను. కానీ ఇమేజ్ ని అప్ లోడ్ చెయ్యాలంటే వీలవడం లేదు. కారణం ఏమిటి.

పట్రాయని సీతారామశాస్త్రిగారి వ్యాసం లో ఫోటో కింద ఇచ్చిన ఎక్స్ టర్నల్ లింక్..తప్పుగా ఉంది. అది పట్రాయని నరసింహశాస్త్రిగారి పేజీకి తీసుకుని వెళ్తోంది.

సంగీతరావుగారి ఫోటో ని వ్యాసంలోనే అప్ లోడ్ చెయ్యడానికి ఎందుకు వీలుపడదు? పట్రాయనివారు అనే వ్యాసంలోనే ఆ వంశ ప్రముఖుల గురించి చేర్చమని సూచించారు కానీ వ్యాసం చాలా విస్తారంగా ఉంటుంది. దానికన్నా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పేజి సృష్టించి లింక్ ఇవ్వడం సరైన పని అని నా ఉద్దేశం.

  • బొమ్మలను వ్యాసాలలోనికి నేను చేర్చాను. చూడండి. వంశ ప్రముఖుల గురించి మీరు వంశ వృక్షంలో గాని వారి వారికి చెందిన పేజీలలో గాని రచించండి. ఏమీ తేడా లేదు. సంగీత పాఠశాల ఫోటో ఉంటే ఇంకా బాగుంటుంది.Rajasekhar1961 12:30, 7 అక్టోబర్ 2011 (UTC)

తెలుగు హైకూ

తెలుగు హైకు లకు సమ్బన్దిన్ఛిన సమఛారమ్ ఎమి లెదు,ఆ సమఛారమ్ తెలుపగలరు

మీకు తెలిసినదానితో మీరే వ్యాసం ప్రారంభించవచ్చు. --అర్జున 15:09, 6 నవంబర్ 2011 (UTC)

viraaLaM

నేను, వికీపీడియాకు ప్రతీ నెలా డెబిట్ కార్డ్ ద్వారా రూ.100/- విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను.అందుకు సంబందించిన వివరాలను తెలియజేయగలరు.--Potti 11:03, 1 జనవరి 2012 (UTC)

ధన్యవాదాలు. వికీపీడియా మొదటిపేజీలో విరాళం ఇవ్వాల్సిన లింక్ ఉంటుంది. లేకపోతే ఈ లింక్ చూడండి. http://wikimediafoundation.org/w/index.php?title=WMFJA085/te&utm_source=donate&utm_medium=sidebar&utm_campaign=20101204SB002&language=te&uselang=te&country=IN&referrer=http%3A%2F%2Fte.wikipedia.org%2Fwiki%2F%25E0%25B0%25AE%25E0%25B1%258A%25E0%25B0%25A6%25E0%25B0%259F%25E0%25B0%25BF_%25E0%25B0%25AA%25E0%25B1%2587%25E0%25B0%259C%25E0%25B1%2580 AngajalaARS 11:05, 1 జనవరి 2012 (UTC)
మీరు వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశానికి విరాళమివ్వవచ్చు. వికీమీడియా భారతదేశం విరాళాల లింకు చూడండి. --అర్జున 13:41, 1 జనవరి 2012 (UTC)
రెండింటికి భేదం ఏమైనా ఉన్నదా. విరాళాల వినియోగంలో వికీ మీడియా భారతదేశం కి ఏమైనా ప్రత్యేక స్థానం ఉంటే తెలియజేయండి.AngajalaARS 13:52, 1 జనవరి 2012 (UTC)
వికీమీడియా భారతదేశంస్వతంత్ర ప్రతిపత్తిగల లాభాపేక్షరహిత సభ్యుల సంస్థ. వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో లాభాపేక్షలేని ధర్మకర్తల సంస్థ. ఇవి రెండూ సహకరించుకుని పనిచేస్తాయి. వికీమీడియా ఫౌండేషన్ నుండి ధనరాసి పొందటానికి , చట్టప్రకారమైన అనుమతులకోసం సమయం పడుతుంది. ‌వికీమీడియా భారతదేశానికి విరాళమిస్తే వెంటనే భారత సంబంధిత ప్రణాళికలకు ఖర్చుపెట్టటం వీలవుతుంది. మరిన్ని వివరాల కోసం పై వ్యాసాలలో ఉల్లేఖించిన వెబ్ సైట్లు చూడండి. --అర్జున 13:58, 1 జనవరి 2012 (UTC)