లేడీ మింగ్ జియాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేట్[permanent dead link] వాల్ వద్ద విలపిస్తున్న లేడీ మెంగ్ జియాంగ్

లేడీ మెంగ్ జియాంగ్ లేక మెంగ్ జియాంగ్ నూ వివిధ రూపాంతరాలు కలిగిన ఒక చైనీస్ గాథ. క్విన్ సామ్రాజ్యం కాలంలో ఈ గాథ జరిగినట్టు చెప్తారు. దాని ప్రకారం - లేడీ మెంగ్ జియాంగ్ భర్తను రాజాధికారులు బలవంతంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణంలో వెట్టిచాకిరి చేసే కూలీగా తీసుకువెళ్తారు. ఆ తర్వాత అతని వివరాలు ఆమెకు ఏమీ తెలియరాకపోయే సరికి, చలికాలం పనికివచ్చే దుస్తులు తీసుకుని అతని కోసం గ్రేట్ వాల్ వద్దకు బయలుదేరుతుంది. దురదృష్టవశాత్తు, ఆమె చేరుకునేసరికే అతను చనిపోతాడు. ఈ దుర్వార్త తెలుసుకుని ఆమె బిగ్గరగా దుఃఖిస్తుంది. ఆమె ఏడుపుకు గోడలో కొంత భాగం కూలిపోయి అందులోంచి అతని ఎముకలు కనిపిస్తాయి.

ఈ గాథ చైనాలోని నాలుగు గొప్ప జానపద గాధలుగా పేరొందినవాటిలో ఒకటి. తెల్ల పాము గాథ ("బైషెఝువాన్"), లియాంగ్ షాంబో - ఝు యింగ్తాయ్, నేత పని అమ్మాయి - ఆవుల మంద అన్న గాథల సరసన ఈ గాథ నాలుగు గొప్ప జానపద గాథల్లో ఒకటిగా స్థానాన్ని పొందింది.[1] 20 శతాబ్ది తొలినాళ్ళలో చైనీస్ జానపద అధ్యయనకారులు ఈ గాథ గత 2 వేల సంవత్సరాలుగా వివిధ రూపాల్లో చైనా జానపద జీవితంలో కనిపిస్తుందని గుర్తించారు.[2]

లేడీ మెంగ్ జియాంగ్ దు:ఖం వల్ల దెబ్బతిన్నదని ఈ గాథలో చెప్పే చైనా గోడ భాగం ప్రస్తుతం చైనాలోని షండాంగ్ ప్రావిన్సులోని జిబో నగరంలో ఉంది. లేడీ మింగ్ జియాంగ్ మూలాలు సుంగ్ వంశ పాలనా కాలంలో ఉన్నాయని చెప్తారు. ఆమెకు హెబెయ్ ప్రావిన్సులో తూర్పున చైనా గోడ ప్రారంభమయ్యే క్వింహాంగ్‌డావో ప్రాంతంలో 1549లో మింగ్ వంశ పాలనా కాలంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ఈనాటికీ నిలిచివుంది[3]

లేడీ మెంగ్ జియాంగ్ పేరులో మెంగ్ అన్నది ఆమె వంశనామం కాదు. మెంగ్ జియాంగ్ అన్నది క్వి రాజ్యంలో ఆడవారికి సాధారణ నామం. జియాంగ్ అన్నది క్వి పాలకుడి ఇంటిపేరు, రాచరిక నామం కాగా, మెంగ్ అన్నది ముఖ్య భార్యకు కాకుండా వేరే భార్యకు జన్మించిన తొలి సంతానం అన్న అర్థం ఇస్తుంది. [4]

మూలాలు

[మార్చు]

ఇవీ చదవండి

[మార్చు]