Jump to content

వాడుకరి:Chaduvari/గ్రామాల పేర్లను సరిచెయ్యడం

వికీపీడియా నుండి
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టుకు మూలం ఇక్కడుంది. ప్రస్తుతం ఈ పేజీతో పనిలేదు, దీన్నిక తాజాకరించేది కూడా లేదు. చరిత్ర కోసం మాత్రమే దీన్ని ఉంచుతున్నాను.

గ్రామాల పేర్లు సరిచెయ్యడం

[మార్చు]

గ్రామాల పేజీల్లో సమాచారం చేర్చడమనే పని జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆ పేజీల నాణ్యతను పెంచడమనే పనిని చేపట్టాలి. నాణ్యత విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామం పేరును సరిగ్గా రాయడం. వికీపీడియాలో కొన్ని గ్రామాల పేర్లు తప్పుగా రాసాం. ఇలాంటి తప్పు పేర్లు సుమారు పది నుండి పదిహేను శాతం వరకు ఉండవచ్చని ఒక అంచనా.

అలా తప్పు పేరు రాయడం ఎందుకు జరిగిందంటే..

[మార్చు]
  1. ఈ పేర్లను ఇంగ్లీషు నుండి తెలుగీకరించారు. అలా చెయ్యడంలో అనేక తప్పులు దొర్లాయి. Ramapuram అనే పేరును రామాపురం అని, రామపురం అని, రమాపురం అని రమపురం అనీ రకరకాలుగా తెలుగు చెయ్యవచ్చు. అసలు పేరు ఏదో తెలిసినవాళ్ళే సరిగా చెయ్యగలరు. తెలియనివాళ్ళు తమకు తోచిన పేరును పెట్టి పేజీని తయారుచేసారు.
  2. ఈ ఇంగ్లీషు పేర్లన్నిటినీ భారత జనగణన వారి ఫైళ్ళనుండి తీసుకున్నారు. ఆ ఫైళ్ళలో పేర్ల స్పెల్లింగుల్లో ఉన్న లోపాలు అలాగే తెలుగులోకీ దొర్లుకొచ్చాయి. ఉదాహరణకు రెండు రాష్ట్రాల్లోని పల్లె లు, పల్లి లు అన్నీ కూడా జనగణన వారు పల్లె లుగా చూపించారు. ఆ తప్పులు వికీపీడియనులు కొన్నిటిని సరిచేసి ప్రచురించారుగానీ, మిగిలినవి అలాగే ఉండిపోయాయి. పల్లె, పల్లి ల లాగానే ఇంకా కొన్ని అలాంటి తప్పులున్నాయి - పేట్ / పేట, ఖండ్రిక / కండ్రిగ వంటివి.
  3. తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లోని గ్రామాల పేర్లు చాలావరకు హలంతాలు. వీటిని చాలావరకు సరిగ్గానే రాసాం. కొన్ని తప్పులున్నాయి. వాటిని సరిదిద్దాలి.
  4. ఇదే ప్రాంతంలోని గ్రామాల పేర్లు కొన్నిటికి మధ్యలో హల్లు నిలబడుతుంది. తూప్రాన్‌పేట, సుల్తాన్‌పల్లి వంటివి. చాలా సందర్భాల్లో ఈ పేర్లు తూప్రాంపేట, సుల్తాన్ పల్లి.. ఇలా అయ్యాయి. వీటిని సరిదిద్దాలి.

కొన్ని తప్పులను వికీపీడియనులు గమనించారు..

[మార్చు]
  1. పేజీపేరు తప్పుగా ఉన్నప్పటికీ, పాఠ్యంలో ఈ పేరును సరిదిద్దారు. అలా సరిదిద్దిన వారికి పేజీని సరయిన పేరుకు తరలించడం తెలిసి ఉండదు బహుశా.
  2. ఫలానా గ్రామం పేరు తప్పుగా పడిందని కొన్ని వర్గాల్లో రాసారు.

పేజీ పేరు తప్పో కాదో నిర్ణయించడమెలా?

[మార్చు]

అసలు, పేజీ పేరు తప్పో కాదో ముందు నిర్ణయించాలిగా. అదెలా?

సరైన పేరేదో తెలుసుకోవడం ఎలా..

[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్న గ్రామాల పేజీల్లో సమాచారం చేర్చే యజ్ఞం పూర్తయ్యాక, ఈ పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాల్సిన పనిని చేపట్టాలి. అయితే సరైన పేరేదో తెలుసుకోవడం ఎలాగా?

మనకు సరిగా తోచిన రెండు మూడు పేర్లతో గూగుల్లో వెతకాలి.

  1. సాక్షి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ వంటి పేరొందిన వార్తాపత్రికల లింకులు వస్తే ఆ పేరే సరైందని దాదాపుగా అనుకోవచ్చు. అయితే ఆ ఫలితంలో వచ్చిన గ్రామం, మనం వెతుకున్న గ్రామం ఒకటేనని నిర్ధారించుకున్నాకే ఈ పేరు సరైనదని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే, ఒకే పేరుతో అనేక గ్రామాలున్నాయని గుర్తుంచుకోండి.
  2. ఫలితాల్లో వార్తాపత్రికలు రాకపోతే.. సామాజిక మాధ్యమాల (బ్లాగులు, ఫేసుబుక్కు, వగైరా) లింకులేవైనా వచ్చాయేమో చూడండి. మూణ్ణాలుగు పైగా వేరువేరు లింకులు మనం వెతుకుతున్న పేరునే చూపిస్తూంటే ఆ పేరు సరైనదని అనుకోవచ్చు. ఒకటో రెండో వస్తే అది కొంత బలహీనమైన సూచికగా భావించాలి. కొందరు బ్లాగరులు, ఫేసుబుక్కరులూ వికీపేజీని తీసుకెళ్ళి తమ పేజీల్లో పెట్టేసుకున్నారు. వాటిని పట్టించుకోకూడదని వేరే చెప్పాల్సిన పనిలేదు.
  3. ఫలితాల్లో వికీపీడియా, దాని మిర్రరు సైట్లూ వస్తాయి. మిర్రరు సైట్లలో వచ్చే సమాచారం వికీలో ఉన్న సమాచారం లాగానే ఉంటుంది. అది మిర్రరనేందుకు అదే గుర్తు. గ్రామం పేరు సరైనదో కాదో నిర్ధారించుకునేందుకు వికీపీడియా, దాని మిర్రర్లూ అస్సలు పనికిరావు.
  4. ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సైట్లు వస్తాయి. వాటిని పట్టించుకోకుండా ఉంటే మంచిది. కొన్ని ప్రభుత్వ సైట్లు వికీపీడియానే అనుసరిస్తున్నాయన్న సూచనలున్నాయి.
  5. మీరు చెందుర్తి పేరుతో వెతుకుతున్నారనుకోండి.. చెందుర్తి వాతావరణం ఎలా ఉందీ.. అంటూ కొన్ని వాతావరణం సైట్ల లింకులు (స్కైమెట్ వెదర్ వంటివి) వస్తాయి. వాటిని పట్టించుకోకండి. అవి వికీపీడియాను అనుసరిస్తున్నట్లుగా సూచనలున్నాయి.

సరిదిద్దడమెలా

[మార్చు]

సరైన పేరేదో తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు సరిదిద్దాలి. ఈ విధానమేంటి?

  1. తప్పు పేరుతో ఉన్న గ్రామం పేరును, చర్చాపేజీతో సహా సరైన పేరుకు తరలించాలి. ఈ పని ఏ వాడుకరైనా చెయ్యవచ్చు. తరలించేటపుడు పాత పేజీని దారిమార్పుగా ఉంచాలి.
  2. ఆ గ్రామం ఏ మండలానికి చెందుతుందో ఆ మండలంలో ఉన్న ఇతర గ్రామాల పేర్లలో కూడా తప్పులున్నాయేమో చూసి వాటిని కూడా సవరించాలి.
  3. ఆ తరువాత మండలం పేజీలో ఉన్న మండలాల జాబితాలో తప్పుగా రాసిన గ్రామాల పేర్లను సవరించాలి.
  4. చివరగా, మండలంలోని గ్రామాల మూసలో ఈ పేర్లను సవరించాలి.

కొన్ని ఉపయోగపడే లింకులు

[మార్చు]
క్ర.సం లింకు ఏ ప్రాంతం కోసం
1 https://web.archive.org/web/20171022041741/http://archives.eenadu.net/07-14-2017/district/inner.aspx?dsname=Visakhapatnam&info=vsp-gen7 విశాఖ జిల్లాలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాలు
2 https://web.archive.org/web/20171022042424/http://archives.eenadu.net/07-14-2017/district/inner.aspx?dsname=Visakhapatnam&info=vsp-gen3 విశాఖ జిల్లా జి.మాడుగుల, కుంబిడిసింగి, గద్దెరాయి
3 https://ins.media/articles/bt-roads-in-maoist-dominated-villages విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో సొలభం, గలగండ,

వంతాల, లక్కపాడు, బరిసింగి, గానుగురోలు, అంబలమామిడి,

దబ్బలగరువు, గెమ్మిలి, పాచనపల్లి, కొక్కిరాపల్లి, బొడ్డగొంది, కిముడుపల్లి, వెన్నెల కోట