Jump to content

వాడుకరి:Chaduvari/2020 లో నేను చేసిన పనులు

వికీపీడియా నుండి

2020 లో వికీపీడియాలో చాలా సంతృప్తి నిచ్చిన పనులు కొన్ని చేసాను. వాడుకరిగా, నిర్వాహకుడిగా నేను చేసిన ఎన్నదగ్గ పనుల్లో కొన్ని ఇక్కడ

  1. దిద్దుబాటులో చేర్చే పాఠ్యం పట్ల నా ప్రాథమ్యాన్ని ఈ ఏడు బహిరంగంగా ప్రకటించాను. చేర్చిన బైట్లను నా పనితీరుకు కొలబద్దగా రెండేళ్ళ నాడే నేను తీసుకున్నప్పటికీ బహిరంగంగా ప్రకటించింది మాత్రం ఈ యేడే. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడు రెండు మూడు నెలలు మినహాయించి మిగతావన్నీ బైట్ల కుంభవృష్టి (నా స్థాయికి అవి కుంభవృష్టే) కురిసిన నెలలే. మొత్తమ్మీద దాదాపు కోటిన్నర బైట్లను చేర్చానీ ఏడు (దాదాపు 15 ఎం.బి)
  2. వికీప్రాజెక్టులు: తెవికీలో ఈ ఏడు నాలుగు ముఖ్యమైన ప్రాజెక్టులు జరిగాయి - ఏప్రిల్లో వ్యాసాల విస్తరణ ఉద్యమం, జూన్,జూలై, ఆగస్టు నెలల్లో మొలకల విస్తరణ ఋతువు*, అక్టోబరులో అనువాద వ్యాసాల ప్రచురణ ఋతువు, నవంబరులో జిల్లా పేజీల క్రమబద్ధీకరణ* (ఇది కొనసాగుతోంది). ఈ నాలుగు ప్రాజెక్టుల్లోనూ చురుగ్గా పాల్గొన్నాను. (* - ఈ గుర్తు ఉన్న ప్రాజెక్టులను నిర్వహించాను.)
  3. కొత్త ప్రతిపాదనలు, చర్చలు: ప్రతిపాదనలు, చర్చల పరంగా నాకు ఇదొక మైలురాయి సంవత్సరం. కొన్ని ప్రతిపాదనలు చేసాను, కొన్ని నెగ్గాయి, కొన్ని వీగిపోయాయి, కొన్ని ఆగిపోయాయి. దాదాపుగా చర్చలన్నిటి లోనూ పాల్గొన్నాను. వాటిలో ముఖ్యమైనవివి:
    1. "మరియు" నియంత్రణ, మానవిక అనువాద శాతాన్ని 30% పరిమితించడం - ప్రతిపాదించాను. అమలు చేసాను
    2. వాడుకరి నిరోధాల సమీక్షా సంఘం: ప్రతిపాదనలు చేసాను, నెగ్గాక, అమలు చెయ్యడంలో, సంఘాన్ని ఏర్పాటు చెయ్యడంలో పాత్ర పోషించాను.
    3. AWB వాడుకరి అనుమతుల విధానాన్ని ప్రతిపాదించాను. చర్చ అసంపూర్ణంగా మిగిలిపోయింది.
    4. తెలుగేతర పేర్లను ఎలా రాయాలనే ప్రతిపాదనపై చర్చ అసంపూర్ణంగా ఉండిపోయింది. జరిగిన చర్చను బట్టి ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి మూలన బడ్డట్లే.
    5. అనువాద పరికరంలో మానవిక అనువాద పరిమితిని తొలగించాలనే ప్రతిపాదనపై చర్చలో పాల్గొని దానికి వ్యతిరేకంగా వాదించాను. దానిపై వోటింగు పెట్టిన విధానాన్ని వ్యతిరేకించాను.
  4. అనువాద పరికరం: అనువాద పరికరంపై చాలా పని చేసాను. 238 వ్యాసాలను అనువాద పరికరం నుండి ప్రచురించాను. వీటిలో చాలావరకు కొత్త వ్యాసాలు కాగా మిగతావి ఉనికిలో ఉన్న పేజీల్లో కొత్త సమాచారాన్ని చేర్చినవి
  5. ఆటోవికీబ్రౌజరు సాయంతో 33 వేలకు పైబడి దిద్దుబాట్లు చేసాను (మరో వాడుకరిపేరుతో), ఇంకా చేసి ఉండాల్సింది.

గూగుల్ యాంత్రికానువాదాల పునఃసృష్టి

[మార్చు]

గూగుల్ యాంత్రికానువాదాలను తొలగించాక వాటిలోంచి కొన్ని పేజీలను సృష్టించాను. ఆ వ్యాసాలివి:

చమురు ఒలకడం, గ్రీన్‌హౌస్ వాయువు, బ్లాక్ హోల్, గ్రీన్‌హౌస్ ప్రభావం, చిలికా సరస్సు ‎, పారిశ్రామికీకరణ, పారిశ్రామిక విప్లవం, భారతదేశ జాతీయ రహదారులు ‎, భూ సర్వే, శబ్ద కాలుష్యం, జల వనరులు , ఓజోన్ క్షీణత, నియాండర్తల్ ‎, పులి, గ్లోబల్ వార్మింగ్, అగ్నిపర్వతం ‎, తేజస్ (యుద్ధ విమానం) ‎, మున్నార్ ‎, భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ‎, నీటి కాలుష్యం ‎

మొత్తం ఎంచుకున్న వ్యాసాలు 20. రాసినవి 20. వీటిలో 19 కొత్త పేజీలు, ఒకటి -రాజశేఖర్ గారు సృష్టించిన దారిమార్పు పేజీలో ఓవర్‌రైట్ చేసాను. ప్రచురించినపుడు పేజీల మొత్తం పరిమాణం (ఇప్పుడు పెరిగి ఉంటుంది): 18,22,802 బైట్లు. అంటే ఒక్కో పేజీ సగటు పరిమాణం: 91,140 బైట్లు.

రెండు వేల వ్యాసాలను తొలగించేందుకు రెణ్ణిముషాలు పడితే, రెండు పదుల వ్యాసాలను సృష్టించేందుకు రెణ్ణెల్లు పట్టింది.

ఈ రెండు నెలల్లో పైవి కాకుండా మరో 11 కొత్త వ్యాసాలను కూడా ప్రచురించాను. ఇవి తొలగించిన వ్యాసాలతో సంబంధం లేనివి. ఆ వ్యాసాలు:

సెరెంగెటి‎, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, పీర్ పంజాల్ కనుమ, పీర్ పంజాల్ శ్రేణి, కెన్యాంత్రోపస్ ‎, భారతదేశంలో అగ్నిపర్వతాల జాబితా, నార్కోండం ద్వీపం, బ్యారెన్ ఐలాండ్, కోట హరినారాయణ ‎, టెర్రాఫార్మింగ్, పారాంత్రోపస్ రోబస్టస్

వీటి సగటు పరిమాణం: 26,710 బైట్లు

*** మొత్తం అన్నీ కూడా గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువదించినవే. ***

2020 సంవత్సరపు గణాంకాలు

[మార్చు]
2020 సంవత్సరపు దిద్దుబాటు పరిమాణపు గణాంకాలు (ప్రధాన పేరుబరిలో చేసిన దిద్దుబాట్లు మాత్రమే)
స్థూల దిద్దుబాటు పరిమాణాలు నికర దిద్దుబాటు పరిమాణాలు
నెల

(2020)

చేర్చిన బైట్లు

(చే)

తొలగించిన బైట్లు

(తొ)

స్థూల దిద్దుబాటు పరిమాణం

ఈ రెండింటి మొత్తం చే+|తొ|

(బైట్లు)

కిలో బైట్లు మెగా బైట్లు నికర దిద్దుబాటు పరిమాణం

చే - |తొ|

(బైట్లు)

కిలో బైట్లు మెగా బైట్లు
జనవరి         1,88,579           -1,22,461           3,11,040           304          0.30             66,118              65          0.06
ఫిబ్రవరి       12,84,082           -3,04,228         15,88,310        1,551          1.51          9,79,854           957          0.93
మార్చి       10,26,510               -84,945         11,11,455        1,085          1.06          9,41,565           919          0.90
ఏప్రిల్       31,75,985           -1,80,809         33,56,794        3,278          3.20       29,95,176        2,925          2.86
మే         5,28,704               -48,181           5,76,885           563          0.55          4,80,523           469          0.46
జూన్       12,18,955           -1,26,899         13,45,854        1,314          1.28       10,92,056        1,066          1.04
జూలై       10,43,285                 -4,837         10,48,122        1,024          1.00       10,38,448        1,014          0.99
ఆగస్టు       31,75,134           -1,04,325         32,79,459        3,203          3.13       30,70,809        2,999          2.93
సెప్టెంబరు         1,70,226               -54,070           2,24,296           219          0.21          1,16,156           113          0.11
అక్టోబరు       12,14,913               -53,612         12,68,525        1,239          1.21       11,61,301        1,134          1.11
నవంబరు       15,21,221           -1,89,808         17,11,029        1,671          1.63       13,31,413        1,300          1.27
డిసెంబరు
మొత్తం