కోట హరినారాయణ
కోట హరినారాయణ | |
---|---|
జననం | 1943 బరంపురం, ఒరిస్సా |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ |
|
Notable credit(s) | తేజస్ యుద్ధ విమానం |
పురస్కారాలు |
|
కోట హరినారాయణ (జననం:1943) ఏరోనాటికల్ ఇంజనీరు. తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరు, ఛీఫ్ డిజైనరు.[1] యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు ఉప కులపతిగా పనిచేసాడు. [2] ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]హరినారాయణ 1943 లో సారథి, ముత్యం దంపతులకు ఒడిషా లోని బరంపురంలో జన్మించాడు. ఐదుగురు పిల్లల్లో హరినారాయణ మధ్యవాడు.[4] బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగు చదివాడు.[5] ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరో ఇంజనీరింగులో ఎమ్ టెక్, బోంబే ఐఐటీలో పిహెచ్డి చేసాడు.
అతను చదువుకునే సమయంలో భారతదేశం ఎదుర్కొన్న రెండు యుద్ధాలు - 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం - అతనికి ఏరోనాటికల్ ఇంజనీరింగుపై ఆసక్తి కలిగించాయి.
1967లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఫ్లైట్ టెస్ట్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు.[4] 1970లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో చేరాడు.1982లో మళ్ళీ హెచ్ఏఎల్ లో చీఫ్ డిజైనరుగా నాసిక్ లో పనిచేశాడు. మిగ్ -21 విమాన ఆయుర్దాయాన్ని పెంచే ప్రాజెక్టులో పనిచేసాడు.
1985 డిసెంబరులో హరినారాయణ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ డైరెక్టరుగా ఎంపికయ్యాడు. 2002 జూన్ వరకు అక్కడే పనిచేసి రిటైరయ్యాడు. ఈ కాలం లోనే తేజస్ యుద్ధ విమాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాడు.
పదవీ విరమణ చేసాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు 2002 నుండి 2005 వరకు ఉపకులపతిగా పనిచేసాడు. 2016 లో తన పాత సహోద్యోగులతో కలిసి డ్రోన్ల తయారీ కోసం జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను బెంగళూరులో స్థాపించాడు.
మారుమూల గ్రామాల్లో విద్యాభివృద్ధి కోసం వికసిత్ భారత్ ఫౌండేషన్‌ను స్థాపించాడు.[4]
పురస్కారాలు
[మార్చు]
- విశిష్ట శాస్త్రవేత్త పురస్కారం, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ [6]
- నేషనల్ ఏరోనాటిక్స్ ప్రైజ్ - 1996
- ఎఫ్ఐఇ ఫౌండేషన్ పురస్కారం - 1996
- డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం - 2001
- ఎస్బిఐ వారి ప్రజ్ఞా పురస్కార్ - 2001
- భారత ప్రభుత్వ పద్మశ్రీ - 2002[7]
- గుజార్ మల్ మోడీ సైన్స్ ఫౌండేషన్ పురస్కారం - 2006
- ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వారి జీవన సాఫల్య పురస్కారం - 2006[8]
- ఓం ప్రకాశ్ భసీన్ పురస్కారం - 2007
- బెర్హంపూర్ యూనివర్సిటీ డాక్టరేటు - 2008
- డిఆర్డివో జీవన సాఫల్య పురస్కారం - 2008
- లోకమాన్య తిలక్ పురస్కారం - 2011
- ఒక ఎయిర్ షోలో తేజస్ విమాన ప్రదర్శన చూసిన ఒక ఆయుధ వ్యాపార దళారీ ఆయనతో ఇలా అన్నాడు: "కొంప ముంచావు కదయ్యా! తేజస్‌తో మా రెండొందల విమానాల వ్యాపారం ఫోగొట్టావు"[4]
- గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్)[9]
మూలాలు
[మార్చు]- ↑ "Zephyr 2009 - Celebrating the Spirit of Aviation - Aerospace Engineering, IIT Bombay". aero.iitb.ac.in. Archived from the original on 3 సెప్టెంబరు 2011. Retrieved 18 ఫిబ్రవరి 2020.
- ↑ "German grant for Hyderabad varsity". The Hindu Business Line. 4 November 2004. Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 27 January 2010.
- ↑ "Kalam for updating aeronautical policy". The Hindu. 22 January 2003. Archived from the original on 20 జూలై 2009. Retrieved 27 January 2010.
- ↑ 4.0 4.1 4.2 4.3 "తేజస్‌తో తలెత్తుకున్నాం". ఈనాడు. Archived from the original on 23 Feb 2020. Retrieved 23 Feb 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-26. Retrieved 2020-02-18.
- ↑ "`LCA is about creating wealth for country' -- Dr Kota Harinarayana, Programme Director (LCA), Aeronautical Development Agency". The Hindu Business Line. 13 January 2001. Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 27 January 2010.
- ↑ "Padma Vibhushan for Rangarajan, Soli Sorabjee". The Hindu. 26 January 2002. Archived from the original on 21 ఆగస్టు 2010. Retrieved 27 January 2010.
- ↑ "ప్రొఫైల్ - డా. హరినారాయణ" (PDF). నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్. Archived from the original (PDF) on 2018-04-13.
- ↑ Andhra Jyothy (8 June 2023). "పద్మశ్రీ కోట హరినారాయణకు గీతం డాక్టరేట్". Archived from the original on 8 June 2023. Retrieved 8 June 2023.