టెర్రాఫార్మింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెర్రాఫార్మింగ్ నాలుగు దశలలో అంగారకుడు -కళాకారుడి ఊహ

ఏదైనా గ్రహం లేదా సహజ ఉపగ్రహం లేదా వేరే ఏదైనా ఖగోళ వస్తువు వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలను, ఉపరితల పరిస్థితులను, పర్యావరణాన్నీ భూమిని పోలినట్లు ఉండేలా మార్చి, ఆ ఖగోళ వస్తువును భూమిపై ఉండే జీవులకు నివాస యోగ్యంగా ఉండేలా మార్చడాన్ని టెర్రాఫార్మింగ్ అంటారు. తెలుగులో దీన్ని భూమి తయారీ అనవచ్చు.

టెర్రాఫార్మింగ్ భావన వైజ్ఞానిక కల్పన, వాస్తవ శాస్త్రం రెండింటి నుండీ అభివృద్ధి చెందింది. ఈ పదాన్ని జాక్ విలియమ్సన్ 1942 లో ఆస్టౌండింగ్ సైన్స్ ఫిక్షన్, [1] లో ప్రచురించిన సైన్స్-ఫిక్షన్ చిన్న కథ (" కొలిజన్ ఆర్బిట్ ") లో రూపొందించారు. కాని ఈ భావన అంతకు ముందే ఉండి ఉండవచ్చు.

ఒక గ్రహపు పర్యావరణాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చగలిగినప్పటికీ, అక్కడ ఏ అడ్డంకులూ ఉండని భూమి లాంటి వాతావరణాన్ని సృష్టించగల సాధ్యాసాధ్యాలు ఇంకా ధృవీకరణ కాలేదు. సాధారణంగా టెర్రాఫార్మింగ్ చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారు. గ్రహాన్ని వేడెక్కించి, దాని వాతావరణాన్ని మార్చడం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. నాసా ఈ అంశంపై గోష్ఠులు కూడా నిర్వహించింది. అంగారక వాతావరణాన్ని మార్చగల సాంకేతిక సమర్థత మానవాళికి ఉండవచ్చు, కాని అందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఏ ప్రభుత్వానికైనా లేదా ఏ సమాజానికైనా తలకు మించినవి. టెర్రాఫార్మింగ్‌కు అవసరమైన సుదీర్ఘమైన కాలపరిమితులు, ఆచరణీయత చర్చనీయాంశమైనవి. నైతికత, లాజిస్టిక్స్, ఆర్థికాంశాలు, రాజకీయాలు, వాతావరణాన్ని మార్చే పద్దతి వంటివి ఇంకా జవాబు లేని ఇతర ప్రశ్నలు.1

వివిధ కోణాలు, నిర్వచనాలు

[మార్చు]

1985 లో, మార్టిన్ జె. ఫాగ్ టెర్రాఫార్మింగ్ పై అనేక వ్యాసాలను ప్రచురించడం ప్రారంభించాడు. 1992 లో జర్నల్ ఆఫ్ ది బ్రిటిష్ ఇంటర్‌ప్లానెటరీ సొసైటీ వారు టెర్రాఫార్మింగ్ పై రూపొందించిన పూర్తి సంచికకు సంపాదకుడిగా కూడా పనిచేశాడు. తన పుస్తకం టెర్రాఫార్మింగ్: ఇంజనీరింగ్ ప్లానెటరీ ఎన్విరాన్మెంట్స్ (1995) లో ఫాగ్, టెర్రాఫార్మింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలకు ఈ క్రింది నిర్వచనాలను ప్రతిపాదించాడు: [2]

  • ప్లానెటరీ ఇంజనీరింగ్ : గ్రహవ్యాప్త లక్షణాలను ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్నినియోగించడం.
  • జియో ఇంజనీరింగ్: ప్రత్యేకించి భూమిపై అమలు చేసిన ప్లానెటరీ ఇంజనీరింగ్. గ్రీన్‌హౌస్ ప్రభావం, వాతావరణ కూర్పు, ఇన్సోలేషన్ లేదా ఇంపాక్ట్ ఫ్లక్స్ వంటి కొన్ని గ్లోబల్ పారామితుల మార్పుతో వ్యవహరించే మాక్రో ఇంజనీరింగ్ భావనలు మాత్రమే ఇందులో ఉన్నాయి.
  • టెర్రాఫార్మింగ్: జీవానికి మద్దతు ఇచ్చేలా గ్రహ వాతావరణం సామర్థ్యాన్ని పెంచే ప్లానెటరీ ఇంజనీరింగ్‌ ప్రక్రియ. భూమి జీవావరణపు అన్ని విధులను నిర్వర్తించే బహిరంగ గ్రహ పర్యావరణ వ్యవస్థను, మానవులకు పూర్తిగా నివాసయోగ్యంగా ఉండే వ్యవస్థను.సృష్టించడం టెర్రాఫార్మింగ్‌ లక్ష్యం.

వివిధ స్థాయిల లోని మానవ అనుకూలతలను బట్టి ఫాగ్ వాటికి నిర్వచనాలను రూపొందించాడు: [3]

  1. నివాసయోగ్య గ్రహం (హ్యాబిటబుల్ ప్లానెట్ -హెచ్‌పి): సౌకర్యవంతంగా, ఇబ్బందుల్లేకుండా మానవులు నివసించేందుకు వీలుగా భూమి లాంటి వాతావరణంతో కూడిన ప్రపంచం.
  2. జీవానుకూల గ్రహం (బయోకంపాటిబుల్ ప్లానెట్ -బిపి): జీవం వృద్ధి చెందడానికి అవసరమైన భౌతిక పారామితులను కలిగి ఉన్న గ్రహం. ప్రస్తుతం జీవం లేకపోయినా, టెర్రాఫార్మింగ్ అవసరం లేకుండానే గణనీయమైన సంక్లిష్టత కలిగిన జీవావరణాన్ని పోషించ గల సామర్థ్యం ఉన్న గ్రహం.
  3. సులువుగా టెర్రాఫార్మింగ్ చెయ్యగల గ్రహం (ఈసిలీ టెర్రాఫార్మబుల్ ప్లానెట్ - ఇటిపి): కొద్దిపాటి టెర్రాఫార్మింగ్ ద్వారా సులువుగా నివాసయోగ్యంగా మార్చగల గ్రహం. కొద్దిపాటి గ్రహ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా, స్టార్‌షిప్ లేదా రోబోట్ పూర్వగామి యాత్ర ద్వారా నిర్వహించవచ్చు.

అంగారకుడు యవ్వనంలో ఉన్న సమయంలో రెండో రకానికి చెందిన గ్రహం అనీ, కానీ ప్రస్తుతం ఈ మూడు వర్గాలలోనూ లేదనీ ఫాగ్ అన్నాడు. దాన్ని టెర్రాఫార్మింగ్ చెయ్యడం చాలా కష్టం.. [4]

నివాసయోగ్యతకు ఆవశ్యకాలు

[మార్చు]

జీవితానికి అత్యంతావశ్యకం శక్తి నందించే వనరు. ఒక ఖగోళ వస్తువు ఉపరితలం జీవానికి మద్దతు ఇవ్వాలంటే, ముందు అనేక ఇతర భూభౌతిక, భూరసాయనిక, ఖగోళ భౌతిక ప్రమాణాలకు తప్పనిసరిగా అనుగుణంగా ఉండాలి. భూమిపై సరళమైన జీవులతో పాటు సంక్లిష్టమైన, బహుకణ జీవులు వర్ధిల్లడానికి కారణమైన అంశాలుండాలి. ఈ విషయం సిద్ధాంతం గ్రహ శాస్త్రంలోను, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రోబయాలజీ లోనూ భాగంగా ఉంది.

భావి లక్ష్యాలు

[మార్చు]

అంగారకుడు

[మార్చు]
టెర్రాఫార్మింగ్ తరువాత మార్స్ - చిత్రకారుని ఊహ

సౌర వ్యవస్థలో అంగారకుడు భూమిని బాగా పోలి ఉండే గ్రహం. [5] [6] మొదట్లో అంగారకుడిపై భూమి లాగే పర్యావరణం ఉండేదని, దట్టమైన వాతావరణంతో, నీటితో పుష్కలంగా ఉండేదనీ, వందల కోట్ల సంవత్సరాల కాలంలో అవన్నీ పోయాయనీ భావిస్తున్నారు. [7]

అంగారకుడిపై జరిగిన ఈ మార్పు ఎలా జరిగి ఉంటుందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే ముఖ్యంగా మూడు యంత్రాంగాలు దీనికి కారణమై ఉండే అవకాశం ఉన్నట్లు అనిపిస్తాయి: మొదటిది: ఉపరితలంలో నీరు ఉంటే, కార్బన్ డయాక్సైడ్‌కు రాళ్ళకూ రసాయనిక చర్య జరిగి కార్బోనేట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలో వాతావరణాన్ని లాగేసి ఉపరితలంపై బంధిస్తుంది. భూమిపై అయితే, ప్లేట్ టెక్టోనిక్స్ పనిచేసి, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏర్పడి వీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. అంగారక గ్రహంపై, అటువంటి టెక్టోనిక్ కార్యకలాపాలు లేకపోవడం వలన, అవక్షేపాలలో బంధించబడిన వాయువుల రీసైక్లింగ్‌ జరగలేదు. [8]

రెండవది, అంగారకుడి చుట్టూ అయస్కాంతావరణం (మాగ్నెటోస్ఫియర్) లేకపోవడంతో, సౌర పవనాలు వాతావరణం లోకి ప్రవేశించి, వాతావరణాన్ని క్రమంగా తొలగించి ఉండవచ్చు. [8] ఇనుముతో కూడుకున్న అంగారక గ్రహ గర్భంలో ఉష్ణప్రసరణం ఉండేది, [9] అయస్కాంత క్షేత్రమూ ఉండేది. అయితే ఈ డైనమో చాలా కాలం క్రితమే పనిచేయడం మానేసి, [10] అంగారకుడి అయస్కాంత క్షేత్రం చాలావరకు కనుమరుగైంది. బహుశా "... గర్భంలో ఉష్ణం కోల్పోవడం, గర్భం ఘనీభవించడం, మాంటిల్ ఉష్ణప్రసరణ పద్ధతిలో మార్పులూ" దీనికి కారణమై ఉండవచ్చు [11] సూర్యుడిలో జరిగే కరోనల్ మాస్ ఇజెక్షన్ సంఘటనల్లో వెలువడే వేగవంతమైన ప్రోటాన్ల కారణంగా వాతావరణం కొట్టుకుపోయిందని నాసా వారి మావెన్ మిషన్ ద్వారా తెలిసింది. అంగారకుడిలో ఇప్పటికీ పరిమిత అయస్కాంత ఆవరణం ఉంది. అయితే, ఇది దాని ఉపరితలంలో సుమారు 40% వరకే ఉంటుంది. సౌర గాలుల నుండి వాతావరణం అంతటినీ సమానంగా కప్పి ఉంచే బదులు, అయస్కాంత క్షేత్రం చిన్నచిన్న గొడుగుల్లాంటి క్షేత్రాల రూపాన్ని తీసుకుంటుంది. ఈ గొడుగులు ప్రధానంగా గ్రహపు దక్షిణార్ధగోళంలో గుమిగూడి ఉంటాయి. [12]

చివరగా, సుమారు 410 - 380 కోట్ల సంవత్సరాల క్రితం, లేట్ హెవీ బొంబార్డ్‌మెంట్ [నోట్స్ 1] సమయంలో గ్రహశకలాలు గుద్దడంతో సౌర వ్యవస్థలోని వస్తువుల ఉపరితల వాతావరణంలో గణనీయమైన మార్పులు జరిగాయి. అంగారకుడికి గురుత్వాకర్షణ శక్తి తక్కువ కావడంతో, ఈ గుద్దుళ్ళ కారణంగా దానిపైని వాతావరణం సుదూర అంతరిక్షం లోకి కొట్టుకుపోయి ఉండవచ్చు. [13]

టెర్రాఫార్మింగ్ వలన అంగారకుడిపై ఒకదానికొకటి పెనవేసుకున్న రెండు మార్పులు కలుగుతాయి: వాతావరణాన్ని ఏర్పరచడం, దాన్ని వేడి చేయడం. [14] కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులతో కూడుకున్న దట్టమైన వాతావరణం, దాని లోనికి వచ్చే సౌర వికిరణాన్ని పట్టుకుని ఉంచుతుంది. దీంతో ఉష్ణోగ్రత పెరుగుతుంది. పెరిగిన ఉష్ణోగ్రత మరిన్ని గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని వాయువుల వలన ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఇలా రెండు ప్రక్రియలు ఒకదాని నొకటి వృద్ధి చేసుకుంటాయి. [15] అయితే, నీరు గడ్డకట్టే స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత సాధించడానికి కార్బన్ డయాక్సైడ్ ఒక్కటే సరిపోదు, ప్రత్యేకమైన గ్రీన్‌హౌస్ అణువుల మిశ్రమాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. [16]

శుక్రుడు

[మార్చు]
టెర్రాఫార్మింగ్ తరువాత వీనస్ - చిత్రకారుడి ఊహ

శుక్రుడిని టెర్రాఫార్మింగ్ చేసేందుకు రెండు ప్రధాన మార్పులు అవసరం; ప్రస్తుతం దానిపై కార్బన్ డయాక్సైడ్‌తో కూడుకుని ఉండే వాతావరణంలో పీడనం 90 బార్‌లు ఉంటుంది. దాన్ని చాలావరకు తీసెయ్యాలి. గ్రహంపై ఉన్న 450oC ఉష్ణోగ్రతను తగ్గించాలి. [17] [18] ఈ రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరి సంబంధం కలిగినవి. ఎందుకంటే శుక్రుడిపై నున్న విపరీతమైన ఉష్ణోగ్రతకు కారణం, దాని దట్టమైన వాతావరణం వల్ల కలిగే గ్రీన్‌హౌస్ ప్రభావం కావచ్చు. వాతావరణం నుండి కార్బన్‌ను వేరు చేయడం వల్ల ఉష్ణోగ్రత సమస్య కూడా పరిష్కారమవుతుంది.

చంద్రుడు

[మార్చు]
చంద్రుడు - చిత్రకారుడి ఊహ

భౌగోళిక కాలమానం లోని సుదీర్ఘ కాలాల తరబడి వాతావరణాన్ని నిలిపి ఉంచేంతటి గురుత్వాకర్షణ శక్తి చంద్రుడికి లేనప్పటికీ, మానవ జీవిత కాలంతో పోలిస్తే దాని కంటే చాలా ఎక్కువ కాలం పాటు నిలిపి ఉంచగలదు. ఈ కారణాన లాండిస్ [19] తదితరులు [20] [21] చంద్రుడిపై టెర్రాఫార్మింగ్ చేయడం సాధ్యమని ప్రతిపాదించారు. అయితే అందరూ ఆ ప్రతిపాదనతో ఏకీభవించలేదు. [22] లాండిస్ అంచనా ప్రకారం చంద్రునిపై 1 పిఎస్ఐ వత్తిడితో ఆక్సిజన్ ఉండాలంటే, రెండు కోట్ల కోట్ల టన్నుల (రెండు వందల ట్రిలియన్ టన్నులు) ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇంత పరిమాణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి 50 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు, 50 కిలోమీటర్ల మందమూ ఉన్న ఘనానికి సమానమైన పరిమాణంలో చంద్రశిలలు అవసరమౌతాయి. లేదా, హాలీ తోకచుక్క పరిమాణంలో ఉన్న "యాభై నుండి వంద తోకచుక్కల" లోని నీటి పరిమాణం సరిపోతుందని అతడు ఊహించాడు. "ఈ తోకచుక్కలు చంద్రుడిని డీకొట్టినప్పుడు నీరు చిందదు అని భావించి" అతడు ఈ అంచనా కట్టాడు. అదేవిధంగా, చంద్రుడిని టెర్రాఫార్మింగ్ చేయడానికి "హాలీ పరిమాణమున్న సుమారు 100 తోకచుక్కలు" అవసరమౌతాయని బెన్ఫోర్డ్ లెక్కించాడు.

భూమి

[మార్చు]

శీతోష్ణస్థితిలో మార్పు ప్రభావాలను తిరగ్గొడుతూ భూమిని దాని సాధారణ, నిరపాయకరమైన వాతావరణ స్థితులకు తిరిగి తీసుకుపోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని ఇటీవల ప్రతిపాదనలు వచ్చాయి. దీనిని సాధించడానికి, బహుళ పరిష్కార ప్రతిపాదనలు వచ్చాయి. సౌర వికిరణాన్నితగ్గించడం, జియో ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించడం, శీతోష్ణస్థితులను మార్చే జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన జీవులను రూపొందించి విడుదల చెయ్యడం వంటివి వీటిలో కొన్ని. [23] [24]

సౌర వ్యవస్థలోని ఇతర వస్తువులు

[మార్చు]

టెర్రాఫార్మింగ్ చెయ్యడానికి వీలయ్యే (పాక్షిక) ఇతర ఖగోళ వస్తువులు: టైటన్, కాలిస్టో, గానిమీడ్, యూరోపా, బుధుడు, శని ఉపగ్రహమైన ఎన్సెలాడస్, మరుగుజ్జు గ్రహం సెరిస్ .

ఇతర అవకాశాలు

[మార్చు]

బయోలాజికల్ టెర్రాఫార్మింగ్

[మార్చు]

గ్రహాల రూపాంతరీకరణ కోసం చేసిన అనేక ప్రతిపాదనలలో జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన బ్యాక్టీరియా వాడకం ఒక భాగంగా ఉంటూ ఉంటుంది. [25] [26]

సమస్యలు

[మార్చు]

నైతిక సమస్యలు

[మార్చు]

ఇతర ప్రపంచాలను టెర్రాఫార్మింగ్ చెయ్యడం నైతికంగా సరైనదా కాదా అనే దానిపై జీవశాస్త్రం, జీవావరణ శాస్త్రాల్లో ఒక తాత్విక చర్చ జరుగుతోంది. [27]

టెర్రాఫార్మింగ్‌కు అనుకూలంగా వాదించే వారిలో రాబర్ట్ జుబ్రిన్, మార్టిన్ జె. ఫాగ్, రిచర్డ్ ఎల్ ఎస్ టేలర్, దివంగత కార్ల్ సాగన్ వంటి వారు ఉన్నారు. ఇతర ప్రపంచాలను జీవానికి అనువైనదిగా మార్చడం మానవుడి నైతిక బాధ్యత అని వీరు భావిస్తారు. [28] ప్రకృతి తన ప్రస్తుత మార్గం లోనే వెళ్తే, భూమి చివరికి నాశనం అవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. అంటే ఇతర ప్రపంచాలను టెర్రాఫార్మింగ్ చెయ్యడమో లేక భూగోళ జీవులన్నీ అంతరించిపోవడమో మానవాళి ఎంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా బంజరు గ్రహాలను టెర్రాఫార్మింగ్ చేయడం ఏ ఇతర జీవులనూ ప్రభావితం చేయనందున అది నైతికంగా తప్పు కాదు.

టెర్రాఫార్మింగ్ అంటే ప్రకృతిలో అనైతిక జోక్యం చేసుకోవడమే అని వ్యతిరేకులు వాదిస్తారు. మానవాళి భూమితో వ్యవహరించిన పద్ధతిని చూస్తే, ఇతర గ్రహాలు మానవ జోక్యం లేకుంటేనే బాగా ఉంటాయనుకోవచ్చు. క్రిస్టోఫర్ మెక్కే వంటి మరికొందరు ఈ రెంటికీ మధ్యస్థంగా వాదిస్తారు. టెర్రాఫార్మింగ్ చేసే గ్రహంలో అప్పటికే ఎటువంటి జీవమూ లేదని నిశ్చయపరచుకున్న తర్వాత మాత్రమే అక్కడ టెర్రాఫార్మింగ్ చెయ్యడం నైతిక మౌతుందని అతడు వాదించాడు. కానీ అక్కడ జీవం ఉంటే, ఆ గ్రహాన్ని మన స్వంత ఉపయోగం కోసం పునఃరూపకల్పన చేయడానికి ప్రయత్నించకూడదు. అక్కడి జీవులతో కలిసి సహజీవనం చేసేందుకు వీలుగా అక్కడి పర్యావరణాన్ని మార్చుకోవాలి. కరుడుగట్టిన పర్యావరణవాదులు ఈ మూడో భావనను కూడా టెర్రాఫార్మింగ్ గానే భావిస్తారు. జీవులన్నిటికీ వాటి స్వంత జీవావరణంలో, బయటి జోక్యమేమీ లేకుండా పరిణామం చెందే హక్కు ఉందని వాళ్ళు వాదిస్తారు.

ఆర్థిక సమస్యలు

[మార్చు]

గ్రహాల టెర్రాఫార్మింగ్ వంటి ప్రాజెక్టుల ప్రారంభ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సంస్థ యొక్క మౌలిక సదుపాయాలు మొదటి నుండి నిర్మించాల్సి ఉంటుంది. ఆర్థికంగా సాధ్యమా కాదా అనే సంగతి తరువాత.. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానమే ఇంకా తయారు కాలేదు. టెర్రాఫార్మింగ్ కోసం ప్రతిపాదించిన ప్రస్తుత పథకాలు వేటిలోనూ ఆర్థిక వ్యూహాలు లేవని జాన్ హిక్మాన్ ఎత్తిచూపాడు. వారి నమూనాలు, అంచనాలూ చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. [29]

రాజకీయ సమస్యలు

[మార్చు]

జాతీయాభిమానం, దేశాల మధ్య స్పర్థ, ప్రజా సంబంధాల రాజకీయాలు గతంలో అంతరిక్ష ప్రాజెక్టులను రూపొందించడానికి ప్రాథమిక ప్రేరణగా ఉన్నాయి. [30] [31] గ్రహాల టెర్రాఫార్మింగ్ ప్రయత్నాలలో కూడా ఈ కారకాలు ఉండే అవకాశం ఉందనుకోవడం సమంజసమే.

నోట్స్

[మార్చు]
  1. 410-380 కోట్ల సంవత్సరాల క్రితం అనేక పెద్ద పెద్ద గ్రహశకలాలు సౌరవ్యవస్థ లోని రాతిగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకులను ఢీకొట్టాయి అనే పరికల్పన. 2018 తరువాత ఈ పరికల్పనపై సందేహాలు, ప్రశ్నలూ వచ్చాయి.

మూలాలు

[మార్చు]
  1. "Science Fiction Citations: terraforming". Retrieved 2006-06-16.
  2. Fogg, Martyn J. (1995). Terraforming: Engineering Planetary Environments. SAE International, Warrendale, PA.
  3. Fogg, 1996
  4. 1960–, Fogg, Martyn J. (1995). Terraforming : engineering planetary environments. Society of Automotive Engineers. ISBN 1560916095. OCLC 32348444. {{cite book}}: |last= has numeric name (help)CS1 maint: multiple names: authors list (link)
  5. Read and Lewis 2004, p.16
  6. Kargel 2004, pp. 185–6.
  7. Kargel 2004, 99ff
  8. 8.0 8.1 Forget, Costard & Lognonné 2007, pp. 80–2.
  9. Dave Jacqué (2003-09-26). "APS X-rays reveal secrets of Mars' core". Argonne National Laboratory. Retrieved 2009-06-10.
  10. Schubert, Turcotte & Olson 2001, p. 692
  11. Carr, Michael H.; Bell, James F. (2014). "Mars". Encyclopedia of the Solar System. pp. 359–377. doi:10.1016/B978-0-12-415845-0.00017-7. ISBN 978-0-12-415845-0.
  12. Solar Wind, 2008
  13. Forget, Costard & Lognonné 2007, pp. 80.
  14. Faure & Mensing 2007, p. 252.
  15. Zubrin, Robert; McKay, Christopher (1993). "Technological requirements for terraforming Mars". 29th Joint Propulsion Conference and Exhibit. doi:10.2514/6.1993-2005.
  16. Gerstell, M. F.; Francisco, J. S.; Yung, Y. L.; Boxe, C.; Aaltonee, E. T. (27 February 2001). "Keeping Mars warm with new super greenhouse gases". Proceedings of the National Academy of Sciences. 98 (5): 2154–2157. doi:10.1073/pnas.051511598. PMC 30108. PMID 11226208.
  17. Fogg, M. J. (1987). "The terraforming of Venus". Journal of the British Interplanetary Society. 40: 551. Bibcode:1987JBIS...40..551F.
  18. Landis, Geoffrey (2011). "Terraforming Venus: A Challenging Project for Future Colonization". AIAA SPACE 2011 Conference & Exposition. doi:10.2514/6.2011-7215. ISBN 978-1-60086-953-2.
  19. Landis, Geoffrey (1990) "Air Pollution on the Moon," Analog, June.
  20. Benford, Greg (2014) "How to Terraform the Moon", Slate, July 14. Retrieved 30 January 2017
  21. Williams, Matt (2016) "How Do We Terraform the Moon", Universe Today, 31 March. Retrieved 30 January 2017
  22. Dorminey, Bruce (2016) "Why The Moon Should Never Be Terraformed", Forbes, July 27. Retrieved 30 January 2017
  23. Solé, Ricard V.; Montañez, Raúl; Duran-Nebreda, Salva (18 July 2015). "Synthetic circuit designs for earth terraformation". Biology Direct. 10 (1): 37. arXiv:1503.05043. Bibcode:2015arXiv150305043S. doi:10.1186/s13062-015-0064-7. PMC 4506446. PMID 26187273.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  24. Solé, Ricard V.; Montañez, Raúl; Duran-Nebreda, Salva; Rodriguez-Amor, Daniel; Vidiella, Blai; Sardanyés, Josep (4 July 2018). "Population dynamics of synthetic terraformation motifs". Royal Society Open Science. 5 (7): 180121. Bibcode:2018RSOS....580121S. doi:10.1098/rsos.180121. PMC 6083676. PMID 30109068.
  25. Hiscox, Juliana A.; Thomas, David J. (October 1995). "Genetic modification and selection of microorganisms for growth on Mars". Journal of the British Interplanetary Society. 48 (10): 419–26. PMID 11541203.
  26. "Mercury". The Society (in ఇంగ్లీష్). 29. Retrieved 10 January 2017.
  27. MacNiven 1995
  28. Fogg 2000
  29. "The Political Economy of Very Large Space Projects". Retrieved 2006-04-28.
  30. "China's Moon Quest Has U.S. Lawmakers Seeking New Space Race". Bloomberg. 2006-04-19. Retrieved 2006-04-28.
  31. Thompson 2001 p. 108

వనరులు

[మార్చు]
  • Averner, M. M.; MacElroy, R. D., eds. (1976). On the Habitability of Mars: An Approach to Planetary Ecosynthesis.
  • "సోలార్ విండ్ రిప్పింగ్ చంక్స్ ఆఫ్ మార్స్" . కాస్మోస్, నవంబర్ 25, 2008. 6/18/2009 న వినియోగించబడింది.
  • డాల్రింపిల్, జి. బ్రెంట్ (2004). పురాతన భూమి, పురాతన ఆకాశం: భూమి యొక్క వయస్సు, దాని విశ్వ పరిసరాలు . స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్ . ISBN   0-8047-4933-7
  • ఫౌర్, గుంటర్ & మెన్సింగ్, తెరెసా M. (2007). గ్రహ శాస్త్రానికి పరిచయం: భౌగోళిక దృక్పథం . స్ప్రింగర్. ISBN   1-4020-5233-2 .
  • Fogg, Martyn J. (1995). Terraforming: Engineering Planetary Environments. SAE International, Warrendale, PA. ISBN 1-56091-609-5.
  • Fogg, Martyn J. (1996). "A Planet Dweller's Dream". In Schmidt, Stanley; Zubrin, Robert (eds.). Islands in the Sky. New York: Wiley. pp. 143–67.
  • Fogg, Martyn J. (1998). "Terraforming Mars: A Review of Current Research" (PDF). Advances in Space Research. 2 (3). Committee on Space Research: 415–420. Bibcode:1998AdSpR..22..415F. doi:10.1016/S0273-1177(98)00166-5.
  • ఫాగ్, మార్టిన్ జె. (2000). స్పేస్ సెటిల్మెంట్ యొక్క నైతిక కొలతలు (PDF ఫార్మాట్). స్పేస్ పాలసీ, 16, 205-211. 50 వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్, ఆమ్స్టర్డామ్ (IAA-99-IAA.7.1.07) లో కూడా సమర్పించారు.
  • ఫోర్జె, ఫ్రాంకోయిస్; కోస్టార్డ్, ఫ్రాంకోయిస్ & లోగ్నోన్న, ఫిలిప్ (2007). ప్లానెట్ మార్స్: స్టోరీ ఆఫ్ అనదర్ వరల్డ్ . స్ప్రింగర్. ISBN   0-387-48925-8 .
  • కార్గెల్, జెఫ్రీ స్టువర్ట్ (2004). మార్స్: వెచ్చని, తడి గ్రహం . స్ప్రింగర్. ISBN   1-85233-568-8 .
  • Knoll, Andrew H. (2008). "Cyanobacteria and earth history". In Herrero, Antonia; Flores, Enrique (eds.). The cyanobacteria: molecular biology, genomics, and evolution. Horizon Scientific Press. pp. 1–20. ISBN 978-1-904455-15-8.
  • MacNiven, D. (1995). "Environmental Ethics and Planetary Engineering". Journal of the British Interplanetary Society. 48: 441–44.
  • మెక్కే క్రిస్టోఫర్ పి. & హేన్స్, రాబర్ట్ హెచ్. (1997). "ఇంప్లాంటింగ్ లైఫ్ ఆన్ మార్స్ యాస్ లాంగ్ టర్మ్ గోల్ ఫర్ మార్స్ ఎక్స్ప్లోరేషన్", ది కేస్ ఫర్ మార్స్ IV: కాన్సెడరేషన్స్ ఫర్ సెండింగ్ హ్యూమన్స్, సం. థామస్ ఆర్. మేయర్ (శాన్ డియాగో, కాలిఫోర్నియా: అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ / యూనివెల్ట్), పేజీలు.   209-15.
  • రీడ్, పీటర్ ఎల్ .; లూయిస్, స్టీఫెన్ ఆర్. (2004). మార్టిన్ వాతావరణం పున is పరిశీలించబడింది: ఎడారి గ్రహపు వాతావరణం, పర్యావరణం . స్ప్రింగర్. ISBN   3-540-40743-ఎక్స్ .
  • సాగన్, కార్ల్ & డ్రూయన్, ఆన్ (1997). లేత బ్లూ డాట్: ఎ విజన్ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యూచర్ ఇన్ స్పేస్ . బల్లాంటైన్ బుక్స్. ISBN   0-345-37659-5 .
  • షుబెర్ట్, జెరాల్డ్; టర్కోట్, డోనాల్డ్ ఎల్ .; ఓల్సన్, పీటర్. (2001). భూమి, ఇతర గ్రహాలలో మాంటిల్ ఉష్ణప్రసరణ . కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్. ISBN   0-521-79836-1 .
  • టేలర్, రిచర్డ్ ఎల్‌ఎస్ (1992). "పారాటెర్రాఫార్మింగ్ - ది వరల్డ్‌హౌస్ కాన్సెప్ట్". జర్నల్ ఆఫ్ ది బ్రిటిష్ ఇంటర్ప్లానెటరీ సొసైటీ, వాల్యూమ్. 45, నం. 8, పేజీలు.   341-352. ISSN   0007-084 ఎక్స్ . Bibcode .
  • థాంప్సన్, JMT (2001). భవిష్యత్ దర్శనాలు: ఖగోళ శాస్త్రం, భూశాస్త్రం . కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ . ISBN   0-521-80537-6 .

బయటి లింకులు

[మార్చు]