మావెన్
![]() మావెన్ అంగారక గ్రహ కక్ష్యలో (కళాకారుని భావన; సెప్టెంబర్ 21, 2014) | |
మిషన్ రకం | అంగారక వాతావరణ పరిశోధన |
---|---|
నిర్వహించే సంస్థ | నాసా |
వెబ్ సైటు | NASA MAVEN |
మిషన్ కాలము | 1 సంవత్సరం ప్రణాళిక[1] |
అంతరిక్షనౌక లక్షణాలు | |
తయారీదారుడు | లాక్హీడ్ మార్టిన్ స్పేస్ సిస్టమ్స్ కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ |
ప్రారంభ ద్రవ్యరాశి | 2,454 కి.గ్రా. (5,410 పౌ.) |
పొడిగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి | 809 కి.గ్రా. (1,784 పౌ.) |
పే లోడ్ ద్రవ్యరాశి | 65 కి.గ్రా. (143 పౌ.) |
శక్తి | 1,135 wattsఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ |
మిషన్ ప్రారంభం | |
ప్రారంభ తేదీ | నవంబర్ 18, 2013, 18:28 UTC |
రాకెట్ | అట్లాస్ V 401 AV-038 |
ప్రారంభించిన స్థలం | కేప్ కనవిరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషను కేప్ కనవిరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషను స్పేస్ లాంఛ్ కాంప్లెక్స్ 41 |
Contractor | యునైటెడ్ లాంఛ్ అలయన్స్ |
ఆర్బిటాల్ పరామితులు | |
నిర్దేశ వ్యవస్థ | వాయుకేంద్రక క్షక్ష్య (మార్స్) |
Periareion | 150 కి.మీ. (93 మై.) |
Apoareion | 6,200 కి.మీ. (3,900 మై.) |
Inclination | 75 degrees |
Period | 4.5 hours |
Epoch | ప్రణాళికాబద్ధముగా |
మార్స్ orbiter | |
Orbital insertion | సెప్టెంబర్ 22, 2014, 02:24 UTC[2] మార్స్ పై కాలనిర్ణయ(MSD) 50025 08:07 ఐరీ మీన్ టైమ్(AMT) |
![]() |
మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ (MAVEN) అనగా అంగారక కక్ష్యలో అంగారక వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఒక అంతరిక్ష ప్రోబ్. దీనిని సంక్షిప్తంగా మావెన్ అంటారు. దీనిని అమెరికా చెందిన నాసా ప్రయోగించింది. ఒకప్పుడు నీరు, ఉష్ణ వాతావరణాన్ని కలిగి ఉన్న అరుణ గ్రహం, కాలక్రమేణా శీతలంగా, పొడిగా ఎందుకు మారిందో తేల్చడం దీని ప్రధాన లక్ష్యం. అంతరిక్షంలో దాదాపు 10 నెలల పాటు 71.1 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 21-09-2014న అంగారకుడికి చేరువైంది. అంగారక గ్రహం యొక్క ఎగువ వాతావరణంపై పరిశోధన కోసం పంపిన మొట్టమొదటి ఉపగ్రహం ఇది. వందల కోట్ల సంవత్సరాల కిందట అంగారక గ్రహంపై నీరు, కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉండేవి, అయితే అవి ఇప్పుడేమయ్యాన్నది మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని ఛేదిస్తే అంగారక గ్రహం ఒకప్పుడు జీవులకు ఆవాసయోగ్యంగా ఉండేదా అన్నది తేలనుంది. అంతేకాక 2030 నాటికి అరుణ గ్రహం పైకి మానవులను పంపాలని యోచిస్తున్న నేపథ్యంలో అక్కడి కఠిన వాతావరణ పరిస్థితులను వ్యోమగాములు తట్టుకోగలరా అన్నదానిపై మరింత సమాచారాన్ని అందిస్తుంది. అంగారకుడిపై పరిస్థితి అత్యంత శీతలంగా ఉంటుంది. అక్కడ వాతావరణం పెద్దగా ఆవరించి ఉండదు. అంగారకుని ఎగువ వాతావరణంపై ఏడాది పాటు పరిశోధనలు జరుపనున్న ఇది సౌరగాలులు అరుణ గ్రహ వాతావరణంలో ఎలా చర్యలు జరుపుతున్నయన్నది కూడా పరిశీలించనుంది. ఈ ఉపగ్రహం తన జీవితకాలంలో ఎక్కువగా 3730 మైళ్ల ఎత్తునున్న అంగారక గ్రహ కక్ష్యలో తిరుగుతూ మధ్యలో కొన్ని వివరాల సేకరణ కోసం ఐదు సార్లు 78 మైళ్ల ఎత్తుకు దిగివస్తుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
- మంగళయాన్ - అంగారకుని పరిశీలించేందుకు భారతదేశం పంపిన ఉపగ్రహవాహకనౌక
మూలాలు[మార్చు]
- ఈనాడు దినపత్రిక - 23-09-2014 - (అంగారక కక్ష్యలోకి 'మావెన్' - దిగ్విజయంగా ప్రవేశపెట్టిన నాసా - అరుణగ్రహ గత చరిత్రను తవ్వనున్న ఉపగ్రహం)
- ↑ NASA Selects 'MAVEN' Mission to Study Mars Atmosphere
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;NASA-20140921
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు