మార్స్ ఆర్బిటర్ మిషన్

వికీపీడియా నుండి
(మంగళయాన్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మంగళయాన్
Mars Orbiter Mission - India
Mars Orbiter Mission - India - ArtistsConcept.jpg
Artist's Conception
మిషన్ రకం మార్స్ ఆర్బిటర్
నిర్వహించే సంస్థ ఇస్రో
వెబ్ సైటు MOM
మిషన్ కాలము 300 days
అంతరిక్షనౌక లక్షణాలు
తయారీదారుడు ఇస్రో
ప్రారంభ ద్రవ్యరాశి 1,350 కి.g (2,980 lb)[1]
పొడిగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి 500 కి.g (1,100 lb)
పే లోడ్ ద్రవ్యరాశి 15 కి.g (33 lb)
శక్తి సౌర ఘటకాలు
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ 5 November 2013 09:08 (2013-11-05UTC09:08Z) UTC[2]
రాకెట్ PSLV-XL C25[1]
ప్రారంభించిన స్థలం Satish Dhawan FLP
Contractor ఇస్రో
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థ Areocentric
Periareon 377 కిమీ (234 మైళ్ళు)
Apoareon 80,000 కిమీ (50,000 మైళ్ళు)
Inclination 17.864 degrees [3]
Epoch Planned
అంగారకుడు orbiter
Orbital insertion 24 సెప్టెంబరు 2014

అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్. 2013 నవంబర్ 5, మంగళవారం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘మంగళ్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంది. అరుణ గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించిఒన మొట్టమొదటి దేశం భారతే.

నేపథ్యం[మార్చు]

4.5 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ 2013 నవంబర్ 5, మధ్యాహ్నం 2.38 గంటలకు నింగిలోకి దూసుకెళ్ళింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా) ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబర్ 3 ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబర్ 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేశారు.

మామ్[మార్చు]

మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ను సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు ఇది అంగారక గ్రహం అన్వేషణకు ఉపగ్రహం పంపే పక్రియ, 2013 నవంబర్ అయిదో తేదీన శ్రీహరికోటలో ఆరంభమైన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) ప్రస్థానం మూడంచెల్లో సాగింది. అది భూగురుత్వాకర్షణ పరిధి దాటి ఆవలకు వెళ్ళాక డిసెంబరు మొదటివారంలో 300 రోజుల అంగారక యానం మొదలైంది. భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబర్ 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్' బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు. 2014 సెప్టెంబర్ 24 ఉదయం 7.17.32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పట్టింది.

పరికరాలు[మార్చు]

ఈ ఉపగ్రహంలో ఐదు పరికరాలు కలవు

  1. మార్స్‌ కలర్‌ కెమెరా (ఎంసీసీ) : దీని బరువు 1.27 కిలోలు. ఇది అంగారక ఉపరితలాన్ని ఫొటోలు తీసి పంపుతుంది. దాని స్వభావ, స్వరూపాలను చూపుతుంది.
  2. థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెకో్ట్రమీటర్‌ (టీఐఎస్‌) : దీని బరువు 3.2 కిలోలు. అంగారక గ్రహంపై ఖనిజాలను, మట్టిరకాలను పరిశీలించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే, ఇది ఉపగ్రహంపై ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది.
  3. మీథేన్‌ సెన్సర్‌ ఫర్‌ మార్స్‌ (ఎంఎస్‌ఎం) : దీని బరువు 2.94 కిలోలు. ఇది అరుణగ్రహంపై మీథేన్‌ వాయువు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. మీథేన్‌ ఉన్న ప్రదేశాన్ని మ్యాప్‌ చేస్తుంది. గ్రహ వాతావరణ స్థితిగతులను, కుజుడిపై సూర్యకిరణాల వ్యాప్తిని అంచనా వేస్తుంది.
  4. మార్స్‌ ఎనోస్ఫియరిక్‌ న్యూట్రల్‌ కంపోజిషన్‌ అనలైౖజర్‌ (ఎంఈఎన్‌సీఏ) : దీని బరువు 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది.
  5. లైమెన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ (ఎల్‌ఏపీ) : దీని బరువు 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితలంవాతావరణంలోని హైడ్రోజన్‌, డ్యుటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.

ప్రత్యేకతలు[మార్చు]

బరువు - 1,337 కిలోలు. ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు తయారీ ఖర్చు - రూ.150 కోట్లు నియంత్రణ ఖర్చు- రూ.90 కోట్లు పీఎస్‌ఎల్‌వీ తయారీకి ఖర్చు - రూ.110 కోట్లు మొత్తం మిషన్‌ ఖర్చు - 450 కోట్లు సాగించిన ప్రయాణం - 82 కోట్ల కిలోమీటర్లు అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగవ దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.

మంగళయాన్‌ ప్రయోగం లక్ష్యాలు[మార్చు]

అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం. అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "12 must-know facts about India's mission to Mars". Economic Times. 11 October 2013. Retrieved 11 October 2013. 
  2. "India to launch Mars Orbiter Mission on November 5". NDTV. 22 అక్టోబరు 2013. Retrieved 19 October 2013.  Check date values in: |date= (help)
  3. Mars Orbiter Mission (MOM) - Manglayaan (15 October 2013)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.