Jump to content

నందిని హరినాథ్

వికీపీడియా నుండి


నందిని హరినాథ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో మహిళా పరిశోధకురాలు, రాకెట్ శాస్త్రవేత్త. ఇస్రోలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. నందిని హరినాథ్ మంగళయాన్‌తో సహా ఇస్రో నిర్వహించిన అన్ని ముఖ్యమైన మిషన్‌లలో భాగస్వామిగా ఉంది. ఆమె డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ గా మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్), భారతదేశం 2013 నవంబరు 5న ప్రారంభించిన మార్స్ మిషన్ పనిచేసింది.[1]

జీవితం

[మార్చు]

టెలివిజన్‌లో స్టార్ ట్రెక్ అనే ప్రసిద్ధ ధారావాహిక ద్వారా నందిని సైన్స్‌పై అవగాహన, అభిరుచిని పెంచుకున్నది. ఆమె తల్లి గణిత ఉపాధ్యాయురాలు, తండ్రి ఇంజనీర్, ఈ కుటుంబముకు సైన్స్ ఫిక్షన్, స్టార్ ట్రెక్ పట్ల ఆసక్తి, అభిరుచి ఉండేది. నందినికి ఆ సమయంలో, అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనే ఆలోచన ఆమె మనసులో ఎప్పుడూ రాలేదు.[2]

వృత్తి

[మార్చు]

నందిని మొదటి ఉద్యోగం ఇస్రో. ఆమె ఇస్రోలో 20 సంవత్సరాలలో 14 మిషన్లలో పనిచేసింది. ఆమె ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్, మంగళ్ యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేసింది.[3]

ప్రచురణలు

[మార్చు]

నందిని హరినాథ్ ప్రచురణలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో అందుబాటులో ఉన్నాయి.[4][5]

  1. ఎ మెకానిజం ఫర్ అబ్సర్వ్డ్ ఇంట్రాన్నుల్ వారిబిలిటీస్ ఓవర్ ది ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ( A Mechanism for Observed Interannual Variabilities over the Equatorial Indian Ocean)
  2. రిసోర్స్సాట్ -1 మిషన్ ప్లానింగ్, అనయలిసిస్, అండ్ ఆపరేషన్స్ (Resourcesat-1 mission planning, analysis and operations—Outline of key components)
  3. ఏ నవల్ టెక్నిక్ ఫర్ రిఫరెన్స్ యాటిట్యూడ్ జనరేషన్ ఇన్ ఇంక్లైన్డ్ ఆర్బిట్ కాన్స్టెలేషన్‌ ( A Novel Technique for Reference Attitude Generation in Inclined Orbit Constellation)

మూలాలు

[మార్చు]
  1. Garry (2016-04-09). "India's Rocket Women: Meet The Women Of ISRO". Rocket Women (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  2. Srikanth, Manoj Joshi and B. R. (2017-02-26). "India's rocket women". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  3. Kumar, Harish (2018-04-12). "Nandini Harinath Wiki, Biography, Age, Research, Images". News Bugz (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-17. Retrieved 2022-04-16.
  4. "Nandini HARINATH | scientis | Indian Space Research Organization, Bengaluru | ISRO | Department of Space and ISRO HQ". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  5. "Nandini Harinath". ieeexplore.ieee.org. Retrieved 2022-04-16.