టైటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టైటన్ - ఇది శని యొక్క సహజ ఉపగ్రహాలలోకెల్లా అతి పెద్దది. మొత్తం సౌరకుటుంబంలో దట్టమైన వాయుమండలం గల సహజ ఉపగ్రహం ఇదొక్కటే.

ఇది శని గ్రహం నుండి ఆరో స్థానంలో వున్న దీర్ఘగోళాకార చందమామ. పేరుకి ఉపగ్రహమే అయినా దీనికి గ్రహం వంటి లక్షణాలు ఉన్నాయి. చంద్రుడి కన్నా దీని వ్యాసం సుమారు 50% హెచ్చు, ద్రవ్యరాశి 80% హెచ్చు. మొత్తం సౌరమండలంలో కెల్లా టైటన్ రెండవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. అతి పెద్దది బృహస్పతికి చెందిన గానిమీడ్. అతి చిన్న గ్రహమైన మెర్క్యురీ కన్నా టైటన్ ఘనపరిమాణంలో పెద్దదే అయినా, మెర్క్యురీతో పోల్చితే ద్రవ్యరాశిలో 41% మాత్రమే వుంటుంది. శని యొక్క చందమామల్లో కెల్లా మొట్టమొదట కనుక్కోబడినది టైటనే. దీన్ని 1655 లో డచ్ ఖగోళశాస్త్రవేత్త క్రిస్టియన్ హైగెన్స్ కనుక్కున్నాడు. మన చంద్రుణ్ణి మినహాయిస్తే ఇది సౌరకుంటుంబంలో కనుక్కోబడ్డ ఐదవ సహజ ఉపగ్రహం.

"https://te.wikipedia.org/w/index.php?title=టైటన్&oldid=1987324" నుండి వెలికితీశారు