పారిశ్రామికీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
19 వ శతాబ్దంలో ఆదాయ స్థాయిలు పెరగడం ద్వారా పారిశ్రామికీకరణ ప్రభావం చూపబడింది. స్థూల దేశీయోత్పత్తి (వద్ద కొనుగోలు శక్తి తుల్యత ) తలసరి 1990 1750, 1900 మధ్య సంయుక్త డాలర్లు కోసం మొదటి ప్రపంచ దేశాలు (యూరోప్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్), మూడవ ప్రపంచ దేశాలు (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ). [1]
2005 నాటి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిని చూపించే మ్యాప్.

పారిశ్రామికీకరణ మానవ సమూహాలను వ్యావసాయిక సమాజం నుండి పారిశ్రామిక సమాజంగా మార్చిన సాంఘిక ఆర్ధిక మార్పుల కాలం. వస్తూత్పత్తి కోసం ఆర్థిక వ్యవస్థ విస్తృతమైన పునర్వ్యవస్థీకరణకు లోనైన కాలం ఇది. [2]

పారిశ్రామిక కార్మికుల ఆదాయాలు పెరిగేకొద్దీ, అన్ని రకాల వినియోగదారుల వస్తు, సేవల మార్కెట్లు విస్తరిస్తాయి. పారిశ్రామిక పెట్టుబడులకు, ఆర్థిక వృద్ధికీ మరింత చోదకశక్తిని అందిస్తాయి.

నేపథ్యం[మార్చు]

ప్రోటో-పారిశ్రామికీకరణ చివరి దశ తరువాత, వ్యవసాయంనుండి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు జరిగిన మొదటి పరివర్తనను పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు. ఇది 18 వ శతాబ్దం మధ్య నుండి 19 వ శతాబ్దం ప్రారంభం వరకు ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో జరిగింది. గ్రేట్ బ్రిటన్లో మొదలై, ఆ తరువాత బెల్జియం, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు లకు పాకింది. [3] సాంకేతిక పురోగతి, గ్రామీణ పనుల నుండి పారిశ్రామిక శ్రమకు మారడం, కొత్త పారిశ్రామిక నిర్మాణంలో ఆర్థిక పెట్టుబడులు, వర్గ స్పృహలో ప్రారంభ పరిణామాలు, తత్సంబంధిత సిద్ధాంతాలు మొదలైనవి ఈ ప్రారంభ పారిశ్రామికీకరణ లక్షణాలు. తరువాతి కాలపు వ్యాఖ్యాతలు దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అన్నారు. [4]

  1. Paul Bairoch (1995). Economics and World History: Myths and Paradoxes. University of Chicago Press. p. 95.
  2. O'Sullivan, Arthur; Sheffrin, Steven M. (2003). Economics: Principles in Action. Upper Saddle River, New Jersey 07458: Pearson Prentice Hall. p. 472. ISBN 0-13-063085-3. OCLC 50237774.
  3. Griffin, Emma, A short History of the British Industrial Revolution. In 1850 over 50 percent of the British lived and worked in cities. London: Palgrave (2010)
  4. Pollard, Sidney: Peaceful Conquest.The Industrialisation of Europe 1760–1970, Oxford 1981.