Jump to content

చమురు ఒలకడం

వికీపీడియా నుండి
చమురు ఒలకడంతో ఏర్పడే చమురు తెట్టు
2009 సెప్టెంబరు. తైమూర్ సముద్రంలో ఒలికిన చమురు వల్ల ఏర్పడిన తెట్టు

మానవ కార్యకలాపాల కారణంగా, పెట్రోలియం హైడ్రోకార్బన్‌ ద్రవాలు పర్యావరణంలోకి, ముఖ్యంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ లోకి, విడుదలవడమే చమురు ఒలకడం. ఇది ఒక రకమైన కాలుష్యం. ఈ పదం సాధారణంగా సముద్ర జలాల్లోకి, తీర ప్రాంత జలాల్లోకీ చమురు ఒలకడాన్ని వివరించడానికి వాడతారు. అయితే భూమిపై కూడా చమురు ఒలకడం జరగవచ్చు. ట్యాంకర్లు, ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారాలు, డ్రిల్లింగ్ రిగ్గులు, చమురు బావుల నుండి ముడి చమురు ఒలికిపోవచ్చు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ( గ్యాసోలిన్, డీజిల్ వంటి), వాటి ఉప-ఉత్పత్తులు, పెద్ద నౌకలు ఉపయోగించే భారీ ఇంధనాలూ ఒలికిపోవచ్చు. వ్యర్థ నూనె ఏదైనా ఒలికిపోవచ్చు.

ఒలికిన చమురు పక్షుల ఈకల్లోకి, క్షీరదాల బొచ్చు లోకీ చొచ్చుకుపోయి, దాని ఇన్సులేటింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దాంతో ఉష్ణోగ్రత లోని హెచ్చుతగ్గులకు అవి తట్టుకోలేక పోతాయి. నీటిలో తేలడం వాటికి కష్టమౌతుంది. చమురును తొలగించి, శుభ్రపరచడం కష్టమైన పని. అది ఒలికిన చమురు రకం, నీటి ఉష్ణోగ్రత (బాష్పీభవనం, జీవఅధోకరణాన్ని ప్రభావితం చేస్తుంది), తీరప్రాంతాలూ బీచ్‌ల రకాలు.. వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. [1] చమురును తొలగించి శుభ్రం చేయడానికి వారాలు, నెలలు, సంవత్సరాలైనా పట్టవచ్చు. [2]

ఒలికిన చమురు సమాజానికి ఆర్థికంగా, పర్యావరణపరంగా, సాంఘికంగా వినాశకరమైన పరిణామాలను తెస్తుంది. తత్ఫలితంగా, చమురు ప్రమాదాలు మీడియా దృష్టిని ఆకర్షించి, రాజకీయ గడబిడను రేపాయి. చమురు ఒలకడంపై ప్రభుత్వ ప్రతిస్పందనకు సంబంధించిన రాజకీయ పోరాటంలో చాలా మంది ఏకతాటిపైకి వచ్చారు. ఏయే చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు జరగకుండా నిరోధించగలమనే విషయంపై ఆలోచించారు. [3]

అతిపెద్ద చమురు ఒలికిన ప్రమాదాలు

[మార్చు]

ట్యాంకర్ షిప్ ప్రమాదాల్లో ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనం ఒలికిన ప్రమాదాల్లో అలాస్కా, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గలాపాగోస్ దీవులు, ఫ్రాన్స్, సుందర్‌బన్స్, ఒగోనిలాండ్ లతో పాటు, అనేక ఇతర ప్రదేశాలలో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రమాదాల సమయంలో ఒలికిన చమురు పరిమాణం కొన్ని వందల టన్నుల నుండి అనేక లక్షల టన్నుల వరకు ఉంది (ఉదా., డీప్వాటర్ హొరైజన్ ఆయిల్ స్పిల్, అట్లాంటిక్ ఎంప్రెస్, అమోకో కాడిజ్ ), [4] కానీ ఒలికిన చమురు పరిమాణం ఎంత అనేది జరిగిన నష్టాన్ని కొలిచేందుకు సరిపోదు. ఎక్సాన్ వాల్డెజ్ ఆయిల్ స్పిల్ వంటి సంఘటనల్లో ఒలికిన చమురు కొద్దిమొత్తమే అయినప్పటికీ, పర్యావరణ వ్యవస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి. సంఘటన జరిగిన ప్రదేశం బాగా దూరంగా ఉండడం, తక్షణ ప్రతిస్పందనకు వీలు కాకపోవడం వంటివి దీనికి కారణాలు.

2004 లో ఇవాన్ హరికేన్ వచ్చినపుడు లూసియానా తీరం నుండి 12 మైళ్ళ దూరంలో ఉన్న చమురు-ఉత్పత్తి వేదిక మునిగిపోయింది. అప్పటి నుండి అక్కడ రోజుకు 300 నుండి 700 బారెల్స్ వరకూ చమురు లీకవుతూ ఉంది. ఇది 21 వ శతాబ్దం అంతా కొనసాగవచ్చని అధికారులు అంచనా వేసారు. ఇప్పటివరకు అతిపెద్ద చమురు ఒలికిన ప్రమాదమైన 2010 బిపి డీప్‌వాటర్ హొరైజన్ విపత్తును ఇది అధిగమిస్తుందని భావిస్తున్నారు. కానీ, లీకవుతున్న బావులను మూసేసే ప్రయత్నాలేమీ ప్రస్తుతం జరగడం లేదు [5]

సముద్రంలో చమురు ఒలకడం, భూమిపై జరిగిన దానికంటే చాలా నష్టదాయకం. ఎందుకంటే నీటిపై పల్చటి చమురు తెట్టు వందలాది నాటికల్ మైళ్ళ వరకు వ్యాప్తి చెందుతుంది. ఇవి బీచిలపై కూడా సన్నటి చమురు పొర పరుస్తుంది. ఈ చమురు తెట్టు సముద్ర పక్షులు, క్షీరదాలు, నత్తలను, ఇతర జీవులనూ చంపగలదు. నేలపై ఒలికిన చమురు వలన కలిగే నష్టాన్ని అదుపులో పెట్టవచ్చు, తగ్గించవచ్చు. చమురు ఒలికిన ప్రదేశం చుట్టూ బుల్‌డోజర్లు వంటి యంత్రాలను వాడి మట్టితో కట్ట కట్టెయ్యవచ్చు. తద్వారా చమురు ప్రవహించకుండా ఆపవచ్చు. జంతువులు ఆ ప్రాంతానికి పోకుండా నివారించవచ్చు.

అతిపెద్ద చమురు ఒలికిన సంఘటనలు
ఒలికిన స్థలం ప్రదేశం తేదీ చమురు పరిమాణం (వేల టన్నుల్లో) బ్యారెళ్ళు
(వేలు)
మూలాలు
కువైటీ చమురు మంటలు[a] కువైట్ 1991 జనవరి 16 - నవంబరు 6 &&&&&&&&&0136000.&&&&&01,36,000 &&&&&&&&01000000.&&&&&010,00,000
కువైట్ చమురు క్షేత్రాలు [b] కువైట్ 1991 జనవరి - నవంబరు &&&&&&&&&&&03409.&&&&&03,409–6,818 &&&&&&&&&&025000.&&&&&025,000–50,000
లేక్‌వ్యూ గషర్ కెర్న్ కౌంటీ కాలిఫోర్నియా, అమెరికా 1910 మార్చి 14 - 1911 సెప్టెంబరు &&&&&&&&&&&01200.&&&&&01,200 &&&&&&&&&&&09000.&&&&&09,000 [7]
గల్ఫ్ యుద్ధం [c] కువైట్, ఇరాక్ 1991 జనవరి 19 - జనవరి 28 &&&&&&&&&&&&0818.&&&&&0818–1,091 &&&&&&&&&&&06000.&&&&&06,000–8,000
డీప్‌వాటర్ హొరైజన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా 2010 ఏప్రిల్ 20 - 2010 జూన్ 15 &&&&&&&&&&&&0560.&&&&&0560–585 &&&&&&&&&&&04100.&&&&&04,100–4,900 [9][10][11]
Ixtoc I గల్ఫ్ ఆఫ్ మెక్సికో, మెక్సికో 1979 జూన్ 3 - 1980 మార్చి 23 &&&&&&&&&&&&0454.&&&&&0454–480 &&&&&&&&&&&03329.&&&&&03,329–3,520 [12][13]
అట్లాంటిక్ ఎక్స్‌ప్రెస్ / ఈజియన్ కాప్టెన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో 1979 జూలై 19 &&&&&&&&&&&&0287.&&&&&0287 &&&&&&&&&&&02105.&&&&&02,105
ఫెర్గానా లోయ ఉజ్బెకిస్తాన్ 1992 మార్చి 2 &&&&&&&&&&&&0285.&&&&&0285 &&&&&&&&&&&02090.&&&&&02,090
నౌరూజ్ ఫీల్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇరాన్ 1983 ఫిబ్రవరి 4 &&&&&&&&&&&&0260.&&&&&0260 &&&&&&&&&&&01900.&&&&&01,900
ABT సమ్మర్ అంగోలా తీరం నుండి 1,300 కి.మీ. సముద్రంలో 1991 మే 28 &&&&&&&&&&&&0260.&&&&&0260 &&&&&&&&&&&01907.&&&&&01,907
కాస్టిల్లో డి బెల్వర్ సల్దానా బే, దక్షిణాఫ్రికా 1983 ఆగస్టు 6 &&&&&&&&&&&&0252.&&&&&0252 &&&&&&&&&&&01848.&&&&&01,848
అమోకో కాడిజ్ బ్రొటానీ, ఫ్రాన్స్ 1978 మార్చి 16 &&&&&&&&&&&&0223.&&&&&0223 &&&&&&&&&&&01635.&&&&&01,635
టేలర్ ఎనర్జీ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా 0లోపం: సమయం సరిగ్గా లేదు2004 సెప్టెంబరు 23 – ఇప్పటి దాకా &&&&&&&&&&&&0210.&&&&&0210–490 &&&&&&&&&&&01500.&&&&&01,500–3,500 [14]
టోరీ కాన్యన్ కార్న్‌వాల్, ఇంగ్లాండు 1967 మార్చి 18 &&&&&&&&&&&&0119.&&&&&0119 &&&&&&&&&&&&0872.&&&&&0872 [15]

మానవులపై ప్రభావం

[మార్చు]

ఒలికిన చమురు వల్ల తక్షణ అగ్ని ప్రమాద అవకాశాలున్నాయి. కువైట్ చమురు మంటలు వాయు కాలుష్యాన్ని ఉత్పత్తి చేశాయి, ఇది శ్వాసకోశ సమస్యలకు కారణమైంది. ది డీప్వాటర్ హారిజోన్ పేలుడులో పదకొండు మంది ఆయిల్ రిగ్ కార్మికులు మరణించారు. [16] కెనడాలో లాక్-మెగాంటిక్ వద్ద చమురు తీసుకువెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. పట్టణ కేంద్రంలో సగం ధ్వంసమైంది.

ఒలికిన చమురు తాగునీటి సరఫరాను కూడా కలుషితం చేస్తుంది. ఉదాహరణకు, 2013 లో మలేషియాలోని మిరిలో జరిగిన రెండు సంఘటనల్లో ఒలికిన చమురు 3,00,000 మందికి సరఫరా జరిగే నీటిని కలుషితం చేసింది. [17] ఈక్వెడార్‌లోని కోకాలో 80,000 మంది ప్రభావితమయ్యారు. [18] 2000 లో , కెంటుకీలోని క్లార్క్ కౌంటీలో నీటి బుగ్గలు కలుషితమయ్యాయి. [19]

కాలుష్యం పర్యాటక, సముద్ర వనరుల వెలికితీత పరిశ్రమలపై ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, డీప్వాటర్ హొరైజన్ సంఘటనలో గల్ఫ్ తీరం వెంబడి చేపలు పట్టడం పైన, బీచ్ టూరిజం మీదా ప్రభావం చూపింది. ఈ సంఘటనకు బాధ్యులైన వారు, బాధితులకు పరిహారం ఇవ్వాల్సి వచ్చింది.

పర్యావరణంపై ప్రభావాలు

[మార్చు]
2007 శాన్ఫ్రాన్సిస్కో బే లో చమురుతో కప్పబడిన సర్ఫ్ స్కాటర్
నల్ల సముద్రంలో ఒలికిన చమురు కప్పేసిన పక్షి

సాధారణంగా, చమురు ఒలికిన సంఘటనలో జంతువులు, వృక్షాలూ రెండు విధాలుగా ప్రభావితం మౌతాయి: ఒలికిన చమురు వలన, దాన్ని శుభ్రపరిచే ప్రక్రియ వలనా. [20] [21] జలావరణంలో ఒలికిన చమురు పరిమాణానికీ, జీవవైవిధ్యంపై అది చూపే ప్రభావానికీ మధ్య సంబంధం స్పష్టంగా లేదు. సున్నితమైన వాతావరణంలో, అనువుగాని సమయంలో ఒలికే చమురు తక్కువ పరిమాణంలో ఉన్నా, పెద్ద యెత్తున హాని కలిగించవచ్చు. మరొక సమయంలో మరొక చోట లేదా అదే చోట పెద్దయెత్తున ఒలికే చమురు అంత హాని కలిగించక పోవచ్చు. [22]ఒలికిన చమురు పక్షుల ఈకల్లోకి, క్షీరదాల బొచ్చు లోకీ చొచ్చుకుపోయి, దాని ఇన్సులేటింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దాంతో ఉష్ణోగ్రత లోని హెచ్చుతగ్గులకు అవి తట్టుకోలేక పోతాయి. నీటిలో తేలడం వాటికి కష్టమౌతుంది.

తమ పిల్లలను లేదా తల్లులను కనుగొనడానికి వాసనపై ఆధారపడే జంతువులు, ఒలికిన చమురు యొక్క బలమైన వాసన కారణంగా కనుక్కోలేవు. దీనివలన తల్లి, శిశువును తిరస్కరించడం, వదిలివేయడం జరిగి, పిల్లలు ఆకలితో అలమటించి, చివరికి చనిపోతాయి. చమురు, పక్షుల ఎగిరే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆహారాన్ని సంపాదించుకోవడం వాటికి కష్టమౌతుంది. వేటాడే జంతువుల నుండి తప్పించుకోలేక పోతాయి. పక్షులు తమ ఈకలను శుభ్రం చేసుకునే క్రమంలో ఈకలకు అంటుకున్న చమురు వాటి పొట్టలోకి చేరుతుంది. అది జీర్ణవ్యవస్థను చికాకు పెట్టడం, కాలేయ పనితీరును మార్చడం, మూత్రపిండాలకు హాని కలిగించదం చేస్తుంది. ఈ సమస్యలకు ఆహార సంపాదన తగ్గడం కూడా తోడై, దేహంలోనిర్జలీకరణకు, జీవక్రియ అసమతుల్యతకూ దారితీస్తుంది. చమురుకు గురైన కొన్ని పక్షుల హార్మోన్ల సమతుల్యతలో మార్పులు ఏర్పడతాయి. వాటి లూటినైజింగ్ ప్రోటీన్‌లో కూడా మార్పులు ఏర్పడతాయి. [23] మానవ జోక్యం లేకపోతే, చమురు ఒలకడంతో ప్రభావితమైన పక్షులలో ఎక్కువ భాగం చనిపోతాయి. [24] [25] చమురులో నానిన పక్షులను శుభ్రపరచాక కూడా మనుగడ సాగించ గలిగేవి ఒక శాతం కన్నా తక్కువేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. [26] అయితే, మరికొన్ని సందర్భాల్లో మనుగడ రేటు తొంభై శాతానికి మించి ఉంది. ఉదా: ట్రెజర్ ఆయిల్ స్పిల్. [27]

బాగా బొచ్చు కలిగిన సముద్ర క్షీరదాలు కూడా చమురు గురైనపుడు పై విధంగానే ప్రభావితమవుతాయి. సముద్రపు ఓట్టర్‌లు, సీల్‌లపై ఏర్పడే చమురు పొర బొచ్చు యొక్క ఇన్సులేటింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాంతో, శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులకు, హైపోథెర్మియకూ దారితీస్తుంది. చమురు జంతువును గుడ్డిగా చేసి, దానికి స్వీయ రక్షణ లేకుండా చేస్తుంది కూడా. నూనె దేహం లోపలికి తీసుకోవడం నిర్జలీకరణానికి కారణమవుతుంది, జీర్ణ ప్రక్రియను బలహీనపరుస్తుంది. జంతువులు విషపూరితం కావచ్చు. చమురు ఊపిరితిత్తులలోకి, కాలేయంలోకి ప్రవేశించి చనిపోవచ్చు.

చమురును తినే బ్యాక్టీరియా మూడు రకాలు. సల్ఫేట్ తగ్గించే బ్యాక్టీరియా (SRB), ఆమ్లం ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వంటి ఎనరోబిక్ (గాలి లేని చోట జీవించేవి), సాధారణ ఏరోబిక్ బ్యాక్టీరియా (GAB). ఈ బ్యాక్టీరియాలు ప్రకృతి సహజంగా ఉంటాయి. పర్యావరణ వ్యవస్థ నుండి చమురును తొలగించడానికి ఇవి పనికొస్తాయి.

వీటికి తోడు ఒలికిన చమురు గాలి నాణ్యతకు కూడా హాని కలిగిస్తుంది. [28] ముడి చమురులో ఉండే రసాయనాలు ఎక్కువగా హైడ్రోకార్బన్లు. వీటిలో బెంజీన్స్, టోలూన్, పాలీ-అరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఆక్సిజనేటెడ్ పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ల వంటి విష రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మానవ శరీరంలోకి పీల్చినప్పుడు ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ప్రవేశిస్తాయి. పైగా, ఈ రసాయనాలు వాతావరణంలోని ఆక్సిడెంట్ల వలన ఆక్సీకరణం చెంది, వాతావరణంలోకి ఆవిరైన తరువాత సన్నటి రేణువులుగా ఏర్పడతాయి. [29] ఈ కణాలు ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోతాయి. విష రసాయనాలను మానవ శరీరంలోకి తీసుకువెళతాయి. నూనెను కాల్చడం వలన మసి కణాల వంటి కాలుష్యం ఏర్పడుతుంది. ఒలికిన చమురును శుభ్రపరిచే, పునరుద్ధరించే క్రమంలో, నైట్రిక్ ఆక్సైడ్లు, ఓజోన్ వంటి వాయు కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తుంది. డీప్‌వాటర్ హొరైజన్ సంఘటన సమయంలో, గల్ఫ్ తీరంలోని గాలి నాణ్యతలో గణనీయమైన సమస్యలు కనిపించాయి. తీరప్రాంతాలలో ఆరోగ్య ప్రమాణాలను కాలుష్య కారకాలు అధిగమించాయని గాలి నాణ్యత పర్యవేక్షణ డేటా చూపించింది. [30]

మూలాలు, సంభవించే రేటు

[మార్చు]

ఒక VLCC ట్యాంకరు 20 లక్షల బ్యారెళ్ళ ముడి చమురును మోసుకు పోగలదు. ఎక్సాన్ వాల్డెజ్ ఆయిల్ స్పిల్‌లో ఒలికిన చమురుకు ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ. 1989 మార్చిలో జరిగిన ఆ సంఘటనలో ఓడ ఒడ్డుకు కొట్టుకొచ్చి, 2,60,000 బ్యారెళ్ళ చమురు సముద్రం లోకి కారిపోయింది. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులూ ఎంత శ్రమించినా, 4,00,000 సముద్ర పక్షులు, 1,000 సముద్రపు ఓట్టర్లు, అపారమైన సంఖ్యలో చేపలూ మరణించాయి. [31] అయితే, ట్యాంకర్ల ద్వారా రవాణా అయ్యే మొత్తం చమురు పరిమాణాన్ని పరిశీలిస్తే, ఒలికిపోయే చమురు చాలా స్వల్ప శాతమనీ, పరిశ్రమ భద్రతా రికార్డు అద్భుతమైనదనీ ట్యాంకర్ యజమానుల సంస్థలు వాదిస్తూంటాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ట్యాంకర్ ఓనర్స్, "ఈ దశాబ్దంలో ప్రమాదవశాత్తు చమురు ఒలకడం రికార్డు స్థాయిలో తక్కువగా ఉంది-మునుపటి దశాబ్దంలో జరిగిన దానిలో మూడింట ఒక వంతు, 1970 లలో పదవ వంతు మాత్రమే ఉంది. 1980 ల తో పోలిస్తే, ఇప్పుడు చమురు రవాణా రెట్టింపు కంటే ఎక్కువైందని గుర్తుంచుకోవాలి."

చమురు ఒలకడానికి ఉన్న అనేక కారకాల్లో, ఆయిల్ ట్యాంకర్లు ఒకటి. యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ ప్రకారం, 1991 నుండి 2004 వరకు అమెరికాలో ఒలికిన మొత్తం చమురు పరిమాణంలో 35.7% ట్యాంకర్లు, 27.6% సౌకర్యాల వద్ద, 19.9% ట్యాంకరేతర ఓడల నుండి, పైపులైన్ల నుండి 9.3%; మార్మికమైన కారణాలవలన 7.4% జరిగాయి. [32] మరోవైపు, అసలు సంఘాటనల్లో 5% మాత్రమే ఆయిల్ ట్యాంకర్లలోజరిగాయి, 51.8% ఇతర రకాల ఓడలలో జరిగాయి.

అంతర్జాతీయ ట్యాంకర్ యజమానుల కాలుష్య సమాఖ్య 1974 నుండి జరిగిన 9,351 చమురు ఒలికిన సంఘటనలను పరిశీలించింది. [33] ఈ అధ్యయనం ప్రకారం, సరుకును లోడ్ చేయడం, సరుకును విడుదల చేయడం, ఇంధన చమురును తీసుకోవడం వంటి సాధారణ కార్యకలాపాల వల్ల ఒలకడం ఎక్కువగా జరుగుతుంది. [34] మొత్తం చమురు ఒలికిన సంఘటనల్లో 91% చిన్నవి, ఒక్కో సంఘటనలో ఒలికిన చమురు 7 మెట్రిక్ టన్నుల కన్నా తక్కువ. మరోవైపు, గుద్దుకోవటం, ఒడ్డుకు కొట్టుకు రావడం, హల్ వైఫల్యాలు, పేలుళ్లు వంటి ప్రమాదాల వల్ల జరిగే ఒలకడం చాలా పెద్దవి, వీటిలో 84%సంఘటనల్లో 700 మెట్రిక్ టన్నులకు పైగా ఒలుకుతుంది.

శుద్ధి, పునరుద్ధరణ

[మార్చు]
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డీప్ వాటర్ హొరిజన్‌పై యుఎస్ ఎయిర్ ఫోర్స్ రిజర్వ్ విమానం కోరెక్సిట్ చల్లుతోంది.
యుఎస్ నేవీ ఆయిల్ స్పిల్ స్పందన బృందం "హార్బర్ బస్టర్ హై-స్పీడ్ ఆయిల్ కంటైనేషన్ సిస్టమ్" తో కసరత్తులు చేస్తోంది.

చమురు ఒలికిన తరువాత శుభ్రపరచడం, పునరిద్ధరించడం చాలా కష్టం. ఒలికిన చమురు రకం, నీటి ఉష్ణోగ్రత, తీరప్రాంతాలూ బీచ్‌ల రకాలు వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. [1] శుభ్రపరచే ఖర్చు కూడా చాలా ఎక్కువ. అయితే, ఫ్యూసోబాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిపై ఏర్పడే చమురు తెట్టుపై స్థావరం ఏర్పరచుకుని, చమురును అధోకరణం (డిగ్రేడ్) చెయ్యగలవు. [35]

శుభ్రపరిచే పద్ధతులు:

  • బయోరిమిడియేషన్ : చమురును విచ్ఛిన్నం చేయడానికి, తొలగించడానికీ ఆల్కానివోరాక్స్ బ్యాక్టీరియా [36] లేదా మిథైలోసెల్లా సిల్వెస్ట్రిస్ వంటి సూక్ష్మజీవులు, జీవసంబంధ ఏజెంట్ల వాడకం
  • బయోరిమీడియేషన్ యాక్సిలరేటర్: హైడ్రోకార్బన్‌లను నీటి నుండి తరలించి, జెల్స్‌లోకి మార్చేవి.
  • నియంత్రిత దహనం సరిగ్గా చేస్తే నీటిలో నూనె మొత్తాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. కానీ ఇది గాలి నెమ్మదిగా వీచేటపుడు మాత్రమే చెయ్యాలి, [37] ఇది వాయు కాలుష్యానికి కారణమవుతుంది కూడా.
ప్రెస్టీజ్ చమురును వాలంటీర్లు శుభ్రం చేస్తున్నారు
  • చమురు తెట్టును వెదజల్లడానికి డిస్పర్సెంట్లను ఉపయోగించవచ్చు. అయితే, ఇవి చేపలలో విష హైడ్రోకార్బన్ స్థాయిలను పెంచాయని, చేపల గుడ్లను ఇవి చంపవచ్చనీ ప్రయోగశాల ప్రయోగాల్లో తేలింది. కోరెక్సిట్ డిస్పర్సెంటు వలన చమురు లోని విషం 52 రెట్లు పెరిగినట్లు 2012 లో చేసిన అధ్యయనంలో తేలింది.
  • వేచి చూడడం: కొన్ని సందర్భాల్లో, చమురు దానంతట అదే తగ్గిపోయి, తొలగిపోనివ్వడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే శుభ్రపరచే పద్ధతులు పర్యావరణంపై పెద్ద్ని దుష్ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి [38]
  • పూడిక తీయడం : డిటర్జెంట్లు\తో కలిసిన చమురు గాని, నీటి కంటే గాఢత కలిగిన నూనెల విస్ఝయంలో ఈ పాధతి వాడవచ్చు.
  • స్కిమ్మింగ్: నీటిపై తేలే తెట్టును గీరెయ్యడం. ఈ ప్రక్రియలో సముద్ర జలాలు ప్రశాంతంగా ఉండాలి.
  • ఘనీభవనం: ఘనీభవింపజేసే పదార్థాలు చిన్నగా, నీటిలో తేలుతూ ఉండే డ్రై ఐస్ గుళికలు. [39] [40] [41] నీటిపై తేలే చమురును ద్రవస్థితి నుండి ఘన, సెమీ-ఘన లేదా నీటి మీద తేలియాడే రబ్బరు లాంటి పదార్థంగా మారుస్తాయి. [21] సాలిడిఫైయర్లు నీటిలో కరగవు కాబట్టి ఘనరూపంలో ఉన్న నూనెను తొలగించడం సులభం. సాలిడిఫైయర్లు జీవులకు విషపూరితం కాదని నిరూపించబడింది. సాధారణంగా బెంజీన్, జిలీన్, నాఫ్తా వంటి హైడ్రోకార్బన్‌లు వెలువరించే హానికరమైన ఆవిరిని అణిచివేస్తాయి.
  • వాక్యూమ్, సెంట్రిఫ్యూజ్ : ఈ పద్ధతిలో నీటితో పాటు నూనెను కూడా ఒక ఓడలోకి పీల్చుకుని, ఆపై సెంట్రిఫ్యూజు ద్వారా నీటి నుండి నూనెను వేరు చేయవచ్చు. నీటిని వెనక్కి సముద్రం లోకి వదలివేసి, చమురును ట్యాంకరులోకి నింపవచ్చు. ఈ ప్రక్రియను సమర్థవంతంగానే పనిచేస్తుంది గానీ కొద్ది మొత్తంలో చమురు కూడా నీటితో పాటు తిరిగి వెళ్తుంది. అందుచేత దీన్ని అమెరికా ఆమోదించలేదు [42]
  • బీచ్ ర్యాకింగ్: బీచ్‌లో మిగిలిపోయిన గడ్డకట్టిన నూనెను యంత్రాల ద్వారా తీసుకోవచ్చు.

ఒలికిన చమురు పరిమాణం

[మార్చు]

చమురు తెట్టు మందాన్ని, నీటి ఉపరితలంపై దాని రూపాన్నీ గమనించడం ద్వారా, ఒలికిన చమురు పరిమాణాన్ని అంచనా వేయవచ్చు. తెట్టు ఉపరితల వైశాల్యం కూడా తెలిస్తే, చమురు మొత్తం పరిమాణాన్ని లెక్కించవచ్చు. [43]

తెట్టు మందం పరిమాణం వ్యాపించింది
స్వరూపం అంగుళాలు మి.మీ. నానో మీ. గ్యాలన్లు / చ.మై. లీ. / హె
కనీ కనిపించకుండా ఉంటుంది 0.0000015 0.0000380 38 25 0.370
వెండిలాంటి మెరుపు 0.0000030 0.0000760 76 50 0.730
రంగు కనబడ్డం మొదలౌతుంది 0.0000060 0.0001500 150 100 1.500
రంగు ప్రకాశవంతంగా కనిపిస్తుంది 0.0000120 0.0003000 300 200 2.900
రంగుల కళ తగ్గడం మారడం మొదలౌతుంది 0.0000400 0.0010000 1000 666 9.700
రంగులు చాలా ముదురు రంగులో ఉంటాయి 0.0000800 0.0020000 2000 1332 19.500

నోట్స్

[మార్చు]
  1. కువైట్ చమురు మంటల్లో ఎంత చమురు తగలబడి పోయిందనే దానిపై, 50 కోట్ల బ్యారెళ్ళ నుండి 200 కోట్ల బ్యారెళ్ళ వరకూ ఉండొచ్చని వివిధ అంచనా లున్నాయి. 605 - 732 చమురు బావులకు మంట బెట్టారు. అనేక ఇతర బావులను ధ్వంసం చేసారు. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు 10 నెలలకు పైనే పట్టింది. ఈ మంటల్లో తగలబడిపోయిన చమురే (మంటలు అత్యంత తీవ్రంగా ఉన్న కాలంలో) రోజుకు 60 లక్షల బ్యారెళ్ళ దాకా ఉండేదని అంచనా.
  2. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో కువైట్లో ధ్వంసం చేసిన చమురు క్షేత్రాల నుండి ఒలికిన చమురు 300 చెరువులుగా పేరుకుంది. చెరువులో ఉన్న మొత్తం చమురు 2.5 నుండి 5 కోట్ల బ్యారెళ్ళు ఉంటుందని కువైట్ చమురు మత్రి చెప్పాడు. భూమి లోకి ఇంకిన చమురు ఈ లెక్కలోకి రాదని అమెరికా జియొలాజికల్ సర్వే చెప్పింది. [6]
  3. గుల్ఫ్ యుద్ధంలో ఒలికిపోయిన చమురు పరిమాణంపై అంచనాలు 40 లక్షల నుండి 110 లక్షల బ్యారెళ్ళ వరకూ ఉన్నాయి. 60 నుండి 80 లక్షల బ్యారెళ్ళ వరకూ ఉండొచ్చని అమెరికా పర్యావరణ సంస్థ, ఐరాస భావిస్తున్నాయి.[8] ఈ లెక్కలో, 1991 జనవరి 19-28 మధ్య ఇరాకీ దళాలు వెనక్కి వెళ్ళేటపుడు సముద్రంలోకి నేరుగా వదిలేసిన చమురు మాత్రమే ఉంది. అయితే, 1991 జూన్ దాకా, ఈ లెక్కలో పరిగణించని విధాల్లో చమురు సముద్రంలో కలుస్తూనే ఉందని ఐరాస చెప్పింది. ఈమొత్తం కొన్ని లక్షల బ్యారెళ్ళు ఉండొచ్చు. 80 లక్షల బ్యారెళ్ళకు పైబడిన అంచనాల్లో దీన్ని కూడా కలిపి ఉండవచ్చు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Lingering Lessons of the Exxon Valdez Oil Spill". Commondreams.org. 2004-03-22. Archived from the original on 2012-10-10. Retrieved 2012-08-27. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "common dreams 1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Hindsight and Foresight, 20 Years After the Exxon Valdez Spill". NOAA. 2010-03-16. Retrieved 2010-04-30.
  3. Wout Broekema (April 2015). "Crisis-induced learning and issue politicization in the EU". Public Administration. 94 (2): 381–398. doi:10.1111/padm.12170.
  4. www.scientificamerican.com 20150-04-20 How BP's Blowout Ranks among Top 5 Oil Spills in 1 Graphic
  5. Washington Post, October 21, 2018
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; earthshots.usgs.gov అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. Harvey, Steve (2010-06-13). "California's legendary oil spill". Los Angeles Times. Retrieved 2010-07-14.
  8. Gulf Oil Spill Is Bad, but How Bad?, last updated 20 May 2010.
  9. Campbell Robertson /Clifford Krauss (2 August 2010). "Gulf Spill Is the Largest of Its Kind, Scientists Say". The New York Times. New York Times. Retrieved 2 August 2010.
  10. "Oil disaster by the numbers". CNN. 1 July 2010. Retrieved 1 July 2010.
  11. Consumer Energy Report (20 June 2010). "Internal Documents: BP Estimates Oil Spill Rate up to 100,000 Barrels Per Day". Consumer Energy Report. Archived from the original on 14 అక్టోబరు 2012. Retrieved 20 June 2010.
  12. Fiest, David L.; Boehm, Paul D.; Rigler, Mark W.; Patton, John S. (March 1981). "Ixtoc 1 oil spill: flaking of surface mousse in the Gulf of Mexico". Nature. 290 (5803): 235–238. Bibcode:1981Natur.290..235P. doi:10.1038/290235a0.
  13. Patton, John S.; Rigler, Mark W.; Boehm, Paul D.; Fiest, David L. (1981). "Ixtoc 1 oil spill: flaking of surface mousse in the Gulf of Mexico". Nature. 290 (5803): 235–238. Bibcode:1981Natur.290..235P. doi:10.1038/290235a0.
  14. "A 14-year-long oil spill in the Gulf of Mexico verges on becoming one of the worst in U.S. history". Washington Post. Retrieved 2018-10-22.
  15. Bell, Bethan; Cacciottolo, Mario (2017-03-17). "Black tide: When the British bombed an oil spill" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-01-09.
  16. Welch, William M.; Joyner, Chris (May 25, 2010). "Memorial service honors 11 dead oil rig workers". USA Today.
  17. "Oil spill disrupts water supply – Nation – The Star Online". Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 20 April 2015.
  18. "Ecuador oil spill threatens Brazilian water supply". Retrieved 20 April 2015.
  19. "Kentucky Crude Oil Spill may reach river, contaminate drinking water". Retrieved 20 April 2015.
  20. Bautista H. and Rahman K. M. M. (2016). Review On the Sundarbans Delta Oil Spill: Effects On Wildlife and Habitats. International Research Journal, 1(43), Part 2, pp: 93–96. doi:10.18454/IRJ.2016.43.143
  21. 21.0 21.1 Sarbatly R.; Kamin, Z.; Krishnaiah D. (2016). "A review of polymer nanofibres by electrospinning and their application in oil-water separation for cleaning up marine oil spills". Marine Pollution Bulletin. 106 (1–2): 8–16. doi:10.1016/j.marpolbul.2016.03.037. PMID 27016959.
  22. Bautista, H.; Rahman, K. M. M. (2016). "Effects of Crude Oil Pollution in the Tropical Rainforest Biodiversity of Ecuadorian Amazon Region". Journal of Biodiversity and Environmental Sciences. 8 (2): 249–254.
  23. C. Michael Hogan (2008)., Magellanic Penguin Archived 2012-06-07 at the Wayback Machine, It can take over 1 year to solve the problem of an oil spill. GlobalTwitcher.com, ed. N. Stromberg.
  24. Dunnet, G.; Crisp, D.; Conan, G.; Bourne, W. (1982). "Oil Pollution and Seabird Populations [and Discussion]". Philosophical Transactions of the Royal Society of London B. 297 (1087): 413–427. doi:10.1098/rstb.1982.0051.
  25. Untold Seabird Mortality due to Marine Oil Pollution Archived 2001-02-16 at the Wayback Machine, Elements Online Environmental Magazine.
  26. "Expert Recommends Killing Oil-Soaked Birds". Spiegel Online. May 6, 2010. Retrieved August 1, 2011.
  27. Wolfaardt, AC; Williams, AJ; Underhill, LG; Crawford, RJM; Whittington, PA (2009). "Review of the rescue, rehabilitation and restoration of oiled seabirds in South Africa, especially African penguins Spheniscus demersus and Cape gannets Morus capegnsis, 1983–2005". African Journal of Marine Science. 31 (1): 31–54. doi:10.2989/ajms.2009.31.1.3.774.
  28. Middlebrook, A. M.; Murphy, D. M.; Ahmadov, R.; Atlas, E. L.; Bahreini, R.; Blake, D. R.; Brioude, J.; de Gouw, J. A.; Fehsenfeld, F. C. (28 December 2011). "Air quality implications of the Deepwater Horizon oil spill". Proceedings of the National Academy of Sciences. 109 (50): 20280–20285. doi:10.1073/pnas.1110052108. PMC 3528553. PMID 22205764.
  29. Li, R.; Palm, B. B.; Borbon, A.; Graus, M.; Warneke, C.; Ortega, A. M.; Day, D. A.; Brune, W. H.; Jimenez, J. L. (5 November 2013). "Laboratory Studies on Secondary Organic Aerosol Formation from Crude Oil Vapors". Environmental Science & Technology. 47 (21): 12566–12574. Bibcode:2013EnST...4712566L. doi:10.1021/es402265y. PMID 24088179.
  30. Nance, Earthea; King, Denae; Wright, Beverly; Bullard, Robert D. (13 November 2015). "Ambient air concentrations exceeded health-based standards for fine particulate matter and benzene during the Deepwater Horizon oil spill". Journal of the Air & Waste Management Association. 66 (2): 224–236. doi:10.1080/10962247.2015.1114044. PMID 26565439.
  31. Panetta, L. E. (Chair) (2003). America's living oceans: charting a course for sea change [Electronic Version, CD] Pew Oceans Commission.
  32. United States Coast Guard (2007). "Cumulative Spill Data and Graphics". United States Coast Guard. Retrieved 2008-04-10.
  33. International Tanker Owners Pollution Federation (2008). "Oil Tanker Spill Information Pack". International Tanker Owners Pollution Federation. Archived from the original on 2020-12-16. Retrieved 2008-10-08.
  34. "Major Oil Spills". International Tanker Owners Pollution Federation. Retrieved 2008-11-02.
  35. Gutierrez T, Berry D, Teske A, Aitken MD (2016). "Enrichment of Fusobacteria in Sea Surface Oil Slicks from the Deepwater Horizon Oil Spill". Microorganisms. 4 (3): 24. doi:10.3390/microorganisms4030024. PMC 5039584. PMID 27681918.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  36. Kasai, Y; et al. (2002). "Predominant Growth of Alcanivorax Strains in Oil-contaminated and Nutrient-supplemented Sea Water". Environmental Microbiology. 4 (3): 141–47. doi:10.1046/j.1462-2920.2002.00275.x.
  37. Mullin, Joseph V; Champ, Michael A (2003-08-01). "Introduction/Overview to in Situ Burning of Oil Spills". Spill Science & Technology Bulletin. In-Situ Burning of Spilled Oil. 8 (4): 323–330. doi:10.1016/S1353-2561(03)00076-8.
  38. Pezeshki, S. R.; Hester, M. W.; Lin, Q.; Nyman, J. A. (2000). "The effects of oil spill clean-up on dominant US Gulf coast marsh macrophytes: a review". Environmental Pollution. 108 (2): 129–139. doi:10.1016/s0269-7491(99)00244-4.
  39. "A slick idea" by Cara Murphy Beach Reporter Manhattan Beach section ll/14/1992
  40. "Zapping Oil Spills with Dry Ice and Ingenuity" by Gordon Dillow Los Angeles Times South Bay section page 1 2/24/1994
  41. If only they'd tried the chilled-soup solution in Alaska" by John Bogert Daily Breeze (Torrance CA) local section page B1 2/17/1994
  42. Fountain, Henry (2010-06-24). "Advances in Oil Spill Cleanup Lag Since Valdez". New York Times. Retrieved 2010-07-05.
  43. Metcalf & Eddy. Wastewater Engineering, Treatment and Reuse. 4th ed. New York: McGraw-Hill, 2003. 98.