Jump to content

వాయు కాలుష్యం

వికీపీడియా నుండి
ఇంధన వాయువు నుండి గంధకమును తీసివేయు ప్రక్రియ (flue gas desulfurization) స్థాపించక పూర్వము న్యూ మెక్సికో (New Mexico) లోని ఈ పవర్ ప్లాంట్ నుండి వెలువడు వాయువులలో సల్ఫర్ డై ఆక్సైడ్ (sulfur dioxide) అధికముగా మిళితమై ఉండేది.

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమిపై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

కాలుష్య కారకాలు

[మార్చు]

వాయువులో కలసియున్న మానవులకు, పర్యావరణమునకు హాని కలిగించు ఏదైనా పదార్ధమును వాయు కాలుష్య కారకం అంటారు. కాలుష్య కారకాలు, ఘన, ద్రవ లేదా వాయు రూపములో ఉండవచ్చును.అంతేకాక అవి సహజముగా ఏర్పడవచ్చును లేక మానవ నిర్మితమై ఉండవచ్చును.[1]

కాలుష్య కారకాలు అవి ఉత్పన్నమగు విధానము ప్రకారము రెండు రకములుగా విభజింపవచ్చును - ప్రాథమిక లేదా ద్వితీయ రకాలు. సాధారణంగా ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమైయ్యే పదార్ధాలు. ఉదాహరణకి అగ్ని పర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనముల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ లేక ఫ్యాక్టరీ ల నుండి వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటివి.

ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవ్వడం వల్ల లేక వాయువులో కలిసినందు వల్ల ద్వితీయ కాలుష్య కారకాలు ఏర్పడును. ద్వితీయ రకపు కాలుష్య కారకాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ -భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ - ఫోటోరసాయనిక స్మోగ్ ఏర్పడుటకు కారణమైన ఎన్నో ద్వితీయరకపు కాలుష్య కారకములలో ఒకటి.

కొన్ని కాలుష్య కారకాలు రెండు రకాలుగా ఉండవచ్చును. అనగా అవి సరాసరిగాను (ప్రాథమిక), ఇతర ప్రాథమిక కాలుష్య కారకాల చర్యల వల్లనూ ఉత్పన్నమగును.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి పర్యావరణ శాస్త్ర ఇంజినీరింగ్ ప్రోగ్రాం ప్రకారము యునెటెడ్ స్టేట్స్ లోని మరణాలలో 4 శాతం వరకు వాయు కాలుష్యం వల్లనే జరుగుచున్నవి.

ముఖ్యమెన ప్రాథమిక కాలుష్య కారకాలు మానవ చర్యల కారణముగా ఏర్పడినట్టివి. వాటిలో:

  • సల్ఫర్ ఆక్సైడ్ (Sulfur oxide)లు (SOx) - ముఖ్యముగా సల్ఫర్ డై ఆక్సైడ్, SO2 ఫార్ములా కలిగిన ఒక రసాయనము మిశ్రమము.అగ్నిపర్వతాలు, పెక్కు పారిశ్రామిక ప్రక్రియల వలన SO2 ఏర్పడుతుంది. బొగ్గు, పెట్రోలియం లలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండటంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. SO2 ఇంకా ఆక్సీకరణ చెందినప్పుడు, మామూలుగా NO2 అనే ఉత్ప్రేరకము ఉన్నచో,సల్ఫ్యూరికామ్లం ( H2SO4 ) ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. అందుకే ఈ ఇంధనములను శక్తి వనరులుగా వాడినచో పర్యావరణంపై దీని ప్రభావం ఏ విధముగా ఉండగలదో అని ఆలోచించుట ఎంతైనా అవసరము.
  • నైట్రోజన్ ఆక్సైడ్ (Nitrogen oxide)లు (NOx) - ముఖ్యంగా నైట్రోజన్ డై ఆక్సైడ్ (nitrogen dioxide) అధిక వేడిగల మంటలలో ఉద్భవించును.ఇవి పట్టణాలలో పైన బూదర రంగు కప్పులాగా లేదా కిందకు వీచు ప్ల్యూమ్ (plume) గాలిలాగాను కనిపించును. నైట్రోజెన్ డై ఆక్సైడ్ (NO2) ఫార్ములా కలిగిన రసాయనిక మిశ్రమము.పెక్కు విధములైన నైట్రోజన్ ఆక్సైడ్ లలో ఇదీ ఒకటి. ఈ ఎర్ర-గోధుమ రంగు విష వాయువు స్వాభావికమైన మిక్కిలి చెడు వాసన కలిగి ఉండును. NO2 అతి ముఖ్యమైన వాయు కాలుష్య కారకములలో ఒకటి.
  • కార్బన్ మోనాక్సైడ్ (Carbon monoxide) - ఒక రంగు, వాసన రుచి లేని మిక్కిలి విషపూరితమైన వాయువు. సహజ వాయువు, బొగ్గు, చెక్క / కట్టెలు మొదలగు ఇంధన వనరులు అసంపూర్తిగా మండుటవలన ఇది తయారవుతుంది.వాహనాల వ్యర్థ వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ మిక్కిలి మెండుగా లభించును.
  • కార్బన్ డయాక్సైడ్ (CO2) - మండుట వలన ఏర్పడు ఒక గ్రీన్ హౌస్ వాయువు కాని అది జీవ జాతుల (living organisms) మనుగడకు కూడా ఎంతో ముఖ్యము.ఇది వాతావరణంలో ఉండే సహజ వాయువు.
  • త్వరిత సేంద్రీయ మిశ్రమములు (Volatile organic compounds) - (VOC)లు ముఖ్యమైన బాహ్య వాయు కాలుష్య కారకములు.ఈ విభాగంలో వీటిని తరచుగా మిథేన్ (CH4), నాన్ మిథేన్ (NMVOC) లుగా విభజిస్తారు.అత్యంత వేడిని పంచే బహు సమర్థ గ్రీన్ హౌస్ వాయువు మిథేన్ వయువువాతావరణంలో ఓజోన్ సృష్టించడంలో, దాని జీవనకాలమును పోడిగించుటలో ఇతర హైడ్రోకార్బన్ (VOC)లు ధరించే పాత్ర ద్వారా ఇవి కూడా ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువులు. ఏదిఏమైనను వీటి ప్రభావము ఆ పరిసరములలోని వాయు లక్షణాలపై ఆధారపడుతుంది.

(NMVOC)లకు చెందు ఆరోమ్యాతిక్ మిస్రమములైన బెంజీన్, తోలుఈన్, క్సైలీన్ అనునవి క్యాన్సర్ కారకాలని అనుమాన పడుచున్నారు. వీటి ప్రభావములో ఎక్కువ కాలము ఉన్నచో ల్యూకేమియా కలగవచ్చును. ఇండస్ట్రియల్ వాడకంలో ఉన్న మరొక అపాయకరమైన మిశ్రమము 1, 3- బ్యుతడైయిన్.

  • నలుసు పదార్ధము (Particulate matter) - నలుసులు / రేణువులు, లేక అతి సన్నని బిందువులు అని కూడా పిలువబడు నలుసు పదార్దములు గాలిలో చేరిన అతి చిన్న ఘన లేక జల నలుసులు.ఏరోసోల్ అనగా వాయువు, అందులో మిళితమైన నలుసులు.లేసమాత్రమైన పదార్థము యొక్క మూలము మానవ నిర్మితము లేక సహజ సిద్ధము కావచ్చును.కొన్ని నలుసులు సహజ సిద్ధముగా అగ్నిపర్వతములు, గాలిడుమారములు, అడవి, గడ్డి ప్రదేశముల మంటలు, చెట్లూ చేమల జీవక్రియలు, సముద్రములలోనించి పైకి చెదిరే నీళ్ళ వలన ఏర్పడును.వాహనములలో మండే భూగర్భము నుండి తీసిన ఇంధనములు, పవర్ ప్లాంట్స్, పెక్కు పారిశ్రామిక విధానములు మున్నగు మానవ ప్రక్రియలు కూడా మెండుగా ఏరోసోల్ లను ఉద్భావింపచేయును.నేడు ప్రపంచం మొత్తం మీద, మొత్తము వాతావరణంలోని ఏరోసోల్ లలో 10 శాతం, అన్త్రోపోజేనిక్ ఏరోసోల్ లు - మానవ సంబంధిత ప్రక్రియల వలన ఏర్పడినవి. గాలిలో చిన్న రేణువుల కలయిక పెరుగుట గుండె జబ్బులు, మారిన శ్వాస కోస ప్రక్రియ, ఉపిరితిత్తుల క్యాన్సర్ మున్నగు పెక్కు ఆరోగ్య సమస్యలకు దరి తీయుచున్నది.
  • సీసము (మూలకము) (lead), కాడ్మియం (cadmium), రాగి (copper) మున్నగు విషతుల్య లోహము (metal)లు.
  • క్లోరోఫ్లోరోకర్బనులు (Chlorofluorocarbons) (CFC)లు - ఓజోన్ పొరకు హానికరములు. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి వెలువడును.
  • అమ్మోనియా (Ammonia) (NH3) - వ్యావసాయిక ప్రక్రియలలో జనించును.అమ్మోనియా మిశ్రమము యొక్క ఫార్ములా NH3.ఇది సాధారణ స్థితిలో స్వాభావికమైన తీక్షణమైన వాసనా కలిగిన వాయువుగా లభ్యమగును.అమ్మోనియా ఆహార పదార్థములలోను ఎరువుల్లోనూ అగ్రగామిగా ఉంటూ, భూమి మీద ఉండే జీవులకు అవసరమైన పోషకాలను అందించుటలో గణనీయంగా సాయం చేస్తుంది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ అమ్మోనియా ఎన్నో మందుల తయారీలో వాడబడుతుంది. ఇంతగా వాడబడుచున్న అమ్మోనియా క్షరము, హానికలిగించునది కూడా.
  • చెత్త, మురుగు కాలువలు, పారిశ్రామిక ప్రక్రియలలో వెలువడే వాసన (Odor)లు
  • రేడియోధార్మిక కాలుష్యాలు (Radioactive pollutants) - న్యూక్లియర్ విస్ఫోటాలు (nuclear explosions), యుద్ధ పేలుడు సామగ్రి (explosives), రాడాన్ రేడియోధార్మిక క్షయం (radioactive decay) మున్నగు సహజ ప్రక్రియల వల్ల ఏర్పడతాయి

రెండో రకపు కాలుష్యాలు:

  • నలుసు పదార్థము వాయు రోపంలోని ప్రాథమిక కాలుష్యాలు, మిశ్రమాలచే ఫోటో రసాయనిక స్మోగ్ ల ను౦డి ఏర్పడును.స్మోగ్ అనేది ఒక విధమైన వాయు కాలుష్యము; స్మోగ్ అనే పదము ఆంగ్లంలోని స్మోక్, ఫాగ్ అను పదముల మొదటి ఆఖరి అక్షరముల కలయిక.ఒకే ప్రదేశంలో ఎక్కువ మొత్తాలలో బొగ్గు కాలుట వలన పొగ, సల్ఫర్ దయాక్సైడ్ల మిశ్రమము ఏర్పడి క్లాస్సిక్ స్మోగ్ కు దారి తీయును. నేటి పరిస్థితులలో స్మోగ్ మాములుగా బొగ్గు నుండి కాక వాహన, పారిశ్రామిక వ్యర్ధ వాయువుల పై వాతావరణంలో సూర్యరశ్మి ప్రభావంతో ఏర్పడే రెండో రకపు కాలుష్యాలు మరల మొదటి రకపు కాలుష్యములతో కలసి ఫోటోకెమికల్ స్మోగ్ తయారవుతుంది.
  • భూ మట్టపు ఓజోన్ (Ground level ozone) (O3), NOx, (VOC)ల నుండి తయారగును..ఓజోన్ (O3) భూమిని ఆవరించి ఉన్న పొరలలో ఒకటైన త్రోపోస్ఫియర్ అతి ముఖ్యమైన పాత్రధారి. (అలాగే అది స్త్రాతోస్ఫియర్ లోని కొన్ని ఇతర పొరలలో ముఖ్య పాత్ర వహించును. అ పోరలన్నితిని కలిపి ఓజోన్ పొర అంటారు).పగలు, రాత్రి కూడా వాతావరణంలో జరిగే అనేక ఫోటో రసాయనిక, రసాయనిక చర్యలలో ఓజోన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.మానవ చర్యల వల్ల (ముఖ్యంగా రాతి ఇంధనం మండటం ద్వారా) ఎక్కువ నిష్పత్తిలో ఉన్నచో ఇది ఒక కాలుష్య కారకము కాగలదు, స్మోగ్ తయారీలో భాగము పంచుకొంటుంది.
  • అదే విధంగా NOx, (వోక్)ల నుండి పెరక్సి అసితిల్ నిత్రేట్ (Peroxyacetyl nitrate) (PAN) తయారవుతుంది.

స్వల్పమైన ప్రభావము కలిగిన వాయు కాలుష్యాలు

  • ఎక్కువ సంఖ్యలో స్వల్ప ప్రభావము కలిగిన హానికర వాయు కాలుష్యాలు.వీటిలో కొన్నిటిని యు ఎస్ ఎ లో శుద్ధమైన గాలి శాసనము నియంత్రిస్తుంది (Clean Air Act). అలాగే ఐరోపా లోని ఎయిర్ ఫ్రేంవర్క్ దైరేక్టివ్ నియంత్రిస్తున్నది.
  • నలుసులకు అటుక్కుపోవు కొన్ని రకములైన మొండి ఆర్గానిక్ కాలుష్యములు (persistent organic pollutant).

ఏ ఆర్గానిక్ మిశ్రమాలైతే పర్యావరణంలో జరుగు రసాయనిక, జీవ, కాంతిమిళితమైన చర్యలకు లోబడవో వాటినే మొండి ఆర్గానిక్ కాలుష్యములు (POP)లు అంటారు. ఇందు మూలముగా అవి పర్యావరణములో ఎక్కువకాలము ఎట్టి మార్పులకు లోబడక, బహు దూరములకు చేరుటలోను, మానవ, జంతు శరీరములో చేరుటకు, ఆహారం ద్వారా ఎక్కువవుటకు తగిన గుణములు కలిగి, మానవ ఆరోగ్యముపై, పర్యావరణ సమతుల్యతపై ఎంతో ప్రభావము చూపును.

వనరులు / మూలములు

[మార్చు]
స్ట్రాట్ఫోర్డ్, టెక్సాస్ (Stratford, Texas)కుచేరుతున్న గాలి దుమారపు తుఫాను
వసంత ఋతువులో పంటలు వేయటానికి ముందు నియంత్రణలో కాల్చ్బడుచున్న (Controlled burning), స్టేట్స్ బరో, జార్జియా (Statesboro, Georgia)లోని ఒక పొలము

శ్వివిధ ప్రాంతములు, చర్యలు లేక కారకములు వాయు కాలుష్యమునకు మూలములు. అవి

వాయు కాలుష్యపు మూలములు మనకు కాలుష్యకారకములు వాతావరణములో విడుదల అవ్వటానికి గల కారణాలను, చర్యలను, ప్రాంతాలను ఎత్తి చూపును.ఇట్టి మూలములను రెండు ముఖ్యమైన వర్గాలుగా విభజింపవచ్చును. అవి:

అన్త్రోపోగేనిక్ మూలములు (మానవ చర్యలు) ఎక్కువగా పెక్కు విధాలైన ఇంధనము (fuel)లను మందించుట.

  • "Stationary Sources" include smoke stacks of power plant (power plant)s, manufacturing facilities (factories) and waste incinerators, as well as furnaces and other types of fuel-burning heating devices
  • "కదిలే మూలముల" కోవకు మోటారు వాహనములు (motor vehicles), సముద్రపు ఓడలు, విమానములు, శబ్ద ప్రభావము మొదలైనవి చెందుతాయి.
  • వ్యవసాయంలో, అడవుల నియంత్రణలో రసాయనాలు (శివామణి), దుమ్ము, నియంత్రించబడిన మంట (controlled burn) పద్ధతులు.నియంత్రణలో మందించుట అను పద్ధతిని కొన్నిసార్లు అడవుల నియంత్రణలోను, వ్యవసాయములోను, ప్రేఇరీలను పునరుద్దరించుతలోను లేక గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించుటకు వాడతారు. అడవులు, పచ్చిక భూముల పర్యావరణములో అగ్ని కూడా సహజమైన భాగమే. నియంత్రించబడిన అగ్ని ఫరేస్తర్లకు ఉపయుక్తము. మంటలను నియంత్రించడం ద్వారా కొన్ని అవసరమైన అడవి చెట్లను పెంచటానికి వీలవుతుంది. ఈ విధంగా అడవులను నవీకరించవచ్చును.
  • పెయింట్ (paint), హెయిర్ స్ప్రే (hair spray), వార్నిష్ (varnish), ఏరోసోల్ స్ప్రే (aerosol spray)లు, ఇతర సాల్వెంట్ల నుండి వెలువడు ఆవిర్లు
  • చెత్తను ల్యాండ్ ఫిల్ (landfill) లలో చేరవేయుట వలన మితేన్ వాయువు జనింపచేనుమీథేన్ వాయువు విషతుల్యము కాదు కాని తేలికగా మండును కావున వాయువులతో కలిసి పేలే మిశ్రమాలను తయారు చేస్తుంది.అలాగే మితేన్ వాయువు మూసి ఉన్న ప్రదేశములలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) అందకుండా చేస్తుంది.గాలిలో ఆక్సిజన్ నిష్పత్తి 19.5 శాతంకన్నా తగ్గితే అస్ఫిక్సియ లేక ఊపిరి అందకపోవుట జరుగును.
  • న్యూక్లియర్ ఆయుధములు, విష వాయువు (toxic gas)లు, జేరం వార్ఫేర్ (germ warfare), రాకెట్ (rocket)లు మొదలగునవి మిలిటరీ.

సహజ వనరులు

  • సాధార్ణముగా ఎక్కువ విస్తీర్ణములో చెట్లు చేమ లేని ప్రదేశముల నుండి ధూళి (Dust) సహజముగా పుడుతుంది
  • జంతువుల, (పశువుల) ఆహార జీర్ణ క్రియలో మిథేన్ వాయువు విడుదల అవుతుంది
  • భూమి యొక్క పై పొరలలో రేడియోధార్మిక క్షయం వలన ఏర్పడే రాడాన్ (Radon) వాయువు.రేడియం యొక్క క్షయం వలన ఏర్పడే రంగు, రుచి, వాసన లేని సహజసిద్దముగా లభ్యమౌ రేడియోధార్మిక నోబుల్ వాయువు రాడాన్.దీనిని ఆరోగ్యానికి హాని చేయునదిగా చూస్తారు.రాడాన్ వాయువు సహజసిద్దముగా భవనాలలో, ముఖ్యముగా మూసిఉన్న ప్రదేశములలో (బేస్మెంట్) చేరును. సిగరెట్ల తరువాత ఇదే అతి ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగించును.
  • అడవి మంటలు (wildfires) నుండి వచ్చే పొగ (Smoke), కార్బన్ మోనాక్సైడ్ (carbon monoxide).
  • అగ్నిపర్వత (Volcanic) పేలుళ్లు గంధకము / సల్ఫర్ (sulfur), క్లోరిన్ (chlorine), బూడిద నలుసు (particulate)లని తయారు చేస్తాయి.

ఎమిషన్ ఫ్యాక్టర్లు / బాహ్య ప్రసరణ మూలములు

[మార్చు]

వాయు కాలుష్యపు (pollutant) బాహ్య ప్రసరణ మూలాలు - ఒక పని చేయటం వలన ఎంత ప్రమాణములో కాలుష్యము పరిసర వాతావరణంలో కలుస్తుందో తెలియ చెప్పేందుకు ప్రయత్నించే ప్రాతినిధ్య విలువలు.ఈ మూలాలను తరచుగా, కాలుష్యముని విడుదల చేసే పని యొక్క బరువు, పరిమాణము, దూరము లేక పని జరిగిన కాలము చే భాగింపబడిన ఆ పని వలన విడుదలైన కాలుష్యపు బరువుగా చూపుతారు (ఉదాహరణకు ఒక మెగాగ్రాము బొగ్గును కాల్చినచో వెలువడే నలుసులు కిలోగ్రాములలో).ఇట్టి మూలాలు వివిధ కార్యక్రమములలో విడుదలయ్యే కాలుష్య పరిమాణమును అంచనా వేయుటకు ఎంతో సహాయ పడును.ఎక్కువగా ఈ మూలాలు అందుబాటులో ఉన్న ఒక లక్షణం యొక్క విలువల సగటుగా చూపుతారు. మామూలుగా వీటిని దీర్ఘకాలపు సగటు ప్రాతినిధ్య విలువలుగా తీసుకొంటారు.

యునైటెడ్ స్టేట్స్ పర్యావరణం పరిరక్షించు ఏజన్సీ (United States Environmental Protection Agency) పెక్కు పరిశ్రమలకు సంబంధించిన వాయు కాలుష్యాల బాహ్య ప్రసరణ కారణాల సంపుటిని ప్రచురించింది.[2]యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా, కెనడా ఇతర దేశాలు యురోపియన్ పర్యావరణ ఏజన్సీ (European Environment Agency) ప్రచురించినటువంటి పుస్తకములను ప్రచురించినవి.[3][4][5][6][7]

గదిలోని గాలి నాణ్యత (IAQ)

[మార్చు]

భావన్నంతర్భాగంలో సరి అయిన గాలి ప్రసరణ లేని చోట్ల ఎక్కువ మంది జనం ఎక్కువ సమయమ గడిపినచో వాయు కాలుష్యం గూడు కట్టును.క్యాన్సర్ కారకమైన (carcinogen) రాడాన్ వాయువు కొన్ని ప్రదేశాలలో భూమినుండి వెలువడి భవనాలలో ఇరుక్కుంటుంది.తివాచి (carpet)లు, ప్లయ్ వుడ్ (plywood)మున్నగు నిర్మాణంలో వాడు వస్తువులు ఫార్మాల్డిహైడ్ (formaldehyde) (H2CO) వాయువును విడుదల చేస్తాయి.పెయింట్, సాల్వెంట్లు ఎండిపోవునపుడు త్వరిత సేంద్రీయ మిశ్రమము (volatile organic compounds)లను (VOC)లు విడుదల చేయును.సీసం (Lead) పెయింట్ ధూళి (dust)గా మారి ఊపిరితో లోపలకు చేరును.గాలి శుభ్రపరిచే పరికరం (air freshener)ల, సువాసన కలుగచేయు పదార్దము ఇంసేన్స్ (incense), ఇతర సువాసన కలిగించు వస్తువుల వాడుకతో ఉద్దేశ్య పూర్వక వాయు కాలుష్యాన్ని చేస్తాము.పోయ్యిలలోను, ఫైర్ ప్లేస్ (fireplace)ల లోను మండించే చెక్కల వలన ఎక్కువ మొత్తాలలో పొగ నలుసులు బయటి లోపలి గాలిలో కలుస్తాయి.సరియిన గాలి ప్రసరణ లేని చోట్ల భావనాన్తర్భాగాములలో క్రిమిసంహారకం (pesticide)లను, ఇతర రసాయనిక స్ప్రే లను వాడటం వలన కాలుష్యపు ప్రమాదాలు సంభవించును.

రాక్షస బొగ్గు (charcoal)ను లోపల కాల్చడంతోను, పొగ గొట్టాలు, గాలి బయటకు పోవు మార్గము సరిగా లేకపోవటంవలన కార్బన్ మోనాక్సైడ్ (CO) విషప్రయోగము, ప్రమాదాలు జరుగును.పైలట్ లైట్లు (pilot light) సరిగా లేకపోవుట వలన కూడా దీర్ఘ కాలము కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావానికి లోను కావచ్చు.ఇంట్లోని పైపు (plumbing)లలో సివర్ గ్యాస్ అయిన హైడ్రోజన్ సల్ఫైద్ (hydrogen sulfide)ను ఇంట్లోకి రానివ్వకుండా పట్టి బంధించు సాధనములను ఏర్పాటు చేస్తారు.డ్రై క్లీనింగ్ (dry cleaning) చేయబడిన చాలా రోజుల వరకు కూడా బట్టల నుండి టెట్రాక్లోరోఎతిలేన్ (tetrachloroethylene) లేక ఇతర డ్రై క్లీనింగ్ ద్రావకాలు వెలువడుతాయి.

ప్రస్తుతము చాలా దేశాలలో బ్యాన్ చేయబడినను, పూర్వము పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగములలో బహు విస్తారముగా వాడబడిన రాతి నార ఆస్బెస్టాస్ పెక్కు ప్రదేశములలో హానికరమైనది.అస్బెస్తాసిస్ (Asbestosis) అనేది దీర్ఘకాలము ఊపిరితిత్తు (lung)ల కణజాలంని ప్రభావితం చేస్తే వచ్చే ప్రదాహ (inflammatory) వైద్య స్థితి. ఈ స్థితి ఎక్కువ కాలం చాలా ఎక్కువగా ఆస్బెస్టాస్ ప్రభావానికి లోబడితే వస్తుంది. సామాన్యంగా రాతి నార ఆస్బెస్టాస్ తో నిర్మితమైన భవనాలు ఇతర వస్తువుల వాడకం దీనికి మూలం.రోగులు తీవ్ర స్థాయిలో డిస్ ప్నేయ (dyspnea) (ఊపిరి ఆడకపోవుట) అనుభవించుతారు, వారికి పెక్కు విధముల ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) సోకు ప్రమాదం ఎక్కువవుతుంది.సంబంధిత సాహిత్యములో స్పష్టమైన వివరణలు ఇవ్వనందున, వివిధ రకముల రోగములను గుర్తించుటలో జాగ్రత్తగా వ్యవహరించుట అవసరము.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) Archived 2003-07-02 at the Wayback Machine ప్రకారము అవి : ఆస్బెస్టాస్ఇస్ (asbestosis), ఊపిరి తిత్తుల క్యాన్సర్, మేసోతేలియోమ (mesothelioma) (మాములుగా చాల అరుదుగా కనిపించు క్యాన్సర్ రకము. దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్నచో ఇది దీర్ఘకాలం ఆస్బెస్టాస్ ప్రభావంలో ఉండటం వలన కలుగుతుంది.

గాలిని కలుషితం చేసే వాయువులు, గాలిలో కలసిన నలుసులు వలె జీవ మూలములు భావనాన్తర్భాగాలలోను దొరుకును.పెంపుడు జీవులు (Pet), మానవుల చర్మపు నలుసులు, ముక్కలైన జుట్టు, దుమ్ము, ధూళి, పక్క బట్టలలో, తివాచీలలో, ఫర్నిచర్లలో ఉండే తవుటి పురుగు (mite)లు ఎంజైములను, మైక్రో మీటరు పరిమాణములో విసర్జనాలు, జీవులన్నీ మితెన్ని వదుల్తాయి, గోడలకు శిలీంధ్రాలు (mold) ఏర్పడి మైకో టాక్సిన్ల (mycotoxins)ను, స్పోర్ లను తయారు చేస్తాయి, గాలిని నియంత్రించు (air conditioning) యంత్రములు లెగిఒన్నైరెస్ రోగము (Legionnaires' disease)నకు శిలీంద్ర ల ఉత్పత్తికి తగిన వాతావరణమును కల్పించి పెంచ గలవు. ఇంట్లో పెరిగే మొక్కలు (houseplant), మట్టి చుట్టుపక్కల ఉండే తోట (gardens)ల నుండి పుప్పొడి, దుమ్ము, శిలీంధ్రాలు ఏర్పడును.భావనాన్తర్భాగాములలో, సరి అయిన గాలి ప్రసరణ లేనిచో ఇట్టి కాలుష్యములు సహజముగా ప్రకృతిలో ఉండే కంటే ఎక్కువ మోతాదులో పోగావుతాయి.

ఆరోగ్యముపై ప్రభావములు

[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి ఏటా వాయుకాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. అందులో 1.5 మిల్లియన్లు భవనాల లోపలి కాలుష్యం వలన.[8]"రోగాల పూర్వాపరాలను గురించి చెప్పే శాస్త్ర (Epidemiological) పరిధిలోని అధ్యయనాలు, ఏటా 5,00,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లు కార్డియోపల్మోనరీ (cardiopulmonary) వ్యాధి బారిన మృతి చెందుతున్నారని తెలుపుతున్నాయి. ఈ వ్యాధి రేణువుల వాయు కాలుష్యం (fine particle air pollution) తో . . ."[9]బర్మింగ్ హాం యునివర్సిటీ (University of Birmingham) చేసిన ఒక అధ్యయనం ఊపిరితిత్తు ల వాపుతొ కూడిన వ్యాధి నిమోనియా (pneumonia) మృతులు, మోటారు వాహన కాలుష్యం మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని చూపిస్తుంది.[10]ఏటా ప్రపంచం మొత్తం మీద మోటారు వాహనాల వలన సంభవించే మరణాల కంటే ఎక్కువ వాయు కాలుష్యం వలన జరుగుతున్నాయి. 2005 ప్రచురింపబడి ఏటా 310000 యూరోపియన్లు వాయు కాలుష్యం వలన మరణిస్తున్నారని చెబుతుంది.తీవ్రమైన ఉబ్బసం ఆస్తమా, రొమ్ము పడిశం బ్రోన్కైటిస్, ఏమ్ఫీసేమ, ఊపిరితిత్తుల, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరి సంబంధిత అల్లెర్జీలు మొదలైనవి వాయు కాలుష్యం వలన ప్రత్యక్షంగా ఏర్పడే మ్రుత్యువులకు కారణాలు.యు ఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (US EPA) అంచనాల ప్రకారం డీసెల్ (diesel) ఇంజన్ టెక్నాలజీ లో (టైఏర్ - 2) ప్రకారము మార్పులను చేస్తే ఏటా అకాల మరణాలను 12000 తగ్గించవచ్చు, 15000 తక్కువ గుండె పోటు (heart attack)లు, 6000 వరకు పిల్లలు ఉబ్బసం (asthma) వలన తక్షణ చికిత్సా కక్ష్య (emergency room)కు చేరే కేసులను, 8900 వరకు ఊపిరికి సంబంధించి హాస్పిటల్లో చేరే కేసులను యునైటెడ్ స్టేట్స్ లో తగ్గించవచ్చు.

ఇండియా (India) లో 1984 లో జరిగిన భోపాల్ అనుకోని ఆపద తక్కువ కాలపు ప్రబ్చావం కలిగిన అతి భయంకరమైన పౌర సంబంధమైన కాలుష్య ప్రమాదం.[11] యూనియన్ కార్బైడ్ కం., యు ఎస్ ఎ, వారి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి లీకైన పారిశ్రామిక వాయువులు తక్షణం 2000 మందిని పొట్టన పెట్టుకున్నవి, 150000 నుండి 600000 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 6000 మంది తరువాత మృత్యువ బారిన పడ్డారు. యునైటెడ్ కింగ్డం చరిత్రలో అత్యంత భయంకరమైన కాలుష్య సంఘటనా లండన్ (London) పై డిసెంబరు 4 (December 4) 1952 న ఏర్పడిన మహా స్మోగ్ (Great Smog of 1952) రూపంలో జరిగింది.కేవలం 6 రోజులలో 4000 మంది చనిపోయారు, తరువాతి మాసాలలో 8000 పోయారు.1979 లో యు ఎస్ ఎస్ ఆర్ లోని స్వేర్ద్ లోవ్స్క్ (Sverdlovsk) దగ్గరి ఒక బయలాజికల్ ఆయుధాలను (biological warfare) తయారు చేసే లాబొరేటరీలో జరిగిన ప్రమాదం లో లీక్ అయిన ఆంత్రాక్స్ (anthrax) స్పోర్ల వలన వందలమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా (United States of America) లో నేటి వరకు అతి పెద్ద కాలుష్య ప్రమాదము 1948 సంవత్సరం అక్టోబరు చివర్లో దోనోర, పెన్న సిల్ వానియా (Donora, Pennsylvania) లో జరిగింది. దీనివలన మొత్తం 20 మంది మృతిచెందగా 7000 పైగా క్షతగాత్రులయ్యారు.[12]

గాలి లోని కాలుష్యాలు ఆరోగ్యం పై చూపెట్టు ప్రభావాలు కనిపించని జీవరసాయనిక, శారీరక మార్పుల నుండి మొదలుకొని ఊపిరి ఆడకపోవుట, రోప్పుట, దగ్గుట, ఊపిరి, గుండె సంబంధిత అనారోగ్యాలను తీవ్రతరము చేయుట వరకు ఉంటాయి.వీటివలన మందుల వాడకం, డాక్టర్లను కలవటం లేక తక్షణ చికిత్స చేయించు కొనుట, హాస్పిటల్లలో చేరుట, అకాల మరణాలు పెరుగును.మానవ ఆరోగ్యం పై చెడు లక్షణాలు కల గాలి చూపే ప్రభావము చాలా రకాలు, కాని ఎక్కువగా అది శరీరంలోని ఊపిరితిత్తుల వ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.వాయు కాలుష్యం యొక్క వ్యక్తిగత ప్రభావాలు ఆ వ్యక్తి పై ఎటువంటి కాలుష్యం, ఎంత సమయము పనిచేసింది, ఆ వ్యక్తి యొక్క పూర్వారోగ్యము, వంశ పారంపర్యము మొదలైన అంసములపై ఆధారపడతాయి.

సదరన్ కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెల్స్ బేసిన్ (Los Angeles Basin), సాన్ జోఅక్విన్ లోయ (San Joaquin Valley) లోని వాయు కాలుష్యము, ఆరోగ్యము పై దాని ప్రభావము గురించి చేసిన ఒక ఎకనామిక్ అధ్యయనం ప్రకారం ఫెడరల్ ప్రమాణాలను అతిక్రమించే వాయు కాలుష్యముల వలన ప్రతి ఏడు 3800 మంది అకాల మరణం చెందుతున్నారు (మామూల కంటే సుమారు 14 ఏళ్ళు ముందుగా).ఈ ప్రదేశంలో ఏటా జరిగే అకాల మరణాల సంఖ్యా ఆటోమొబైల్ యక్సిదేంట్ల (ఏటా సరాసరి 2000 వరకు) వలన జరిగే వాటి కన్నా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి.[13]

సిస్టిక్ ఫైబ్రోసిస్ ప్రభావం పై

[మార్చు]

1999 నుండి 2000 వరకు యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ ([[:en:University of Washington చేపట్టిన ఒక అధ్యయనంలో నలుసు పదార్థం వల్ల ఏర్పడే వాయు కాలుష్యానికి దగ్గరగా మసలుకోను రోగులలో పల్మోనరీ వ్యాధులు ప్రకోపించుట, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవుట గమనించిరి.[14] అధ్యయనానికి ముందే రోగులను స్యూదోమోనాస్ ఏరుగినోస (Pseudomonas aeruginosa)లేక బుర్ఖోల్దేరియ సెనోసుపసియ (Burkholderia cenocepacia) వంటి కాలుష్యముల పరిమాణం ఎంత ఉన్నదో అనే కాక వారి సోషియో-ఎకనామిక్ స్థితి గురించి కూడా పరీక్షించితిరి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు యునైటెడ్ స్టేట్స్ లో ఏదేని ఒక పర్యావరణం పరిరక్షించు సంస్థ (Environmental Protection Agency)కు దగ్గరగా నివసించిరి.ఈ అధ్యయన కాలంలో 117 మరణాలు వాయు కాలుష్యం వలన సంభవించినవి అని గుర్తించితిరి.ఎట్టి రోగులయితే సరైన వైద్య సహాయమందగలదని మహా నగరాలకు దగ్గరగా లేక మహా నగరాలలో నివసించిరో అట్టివారి శరీరములో కాలుష్యములు ఎక్కువ మోతాదులో ఉండినవి. పెద్ద నగరాలలోని వ్యర్ధ బాహ్య ప్రసరణలు ఎక్కువగా ఉండుటయే దీనికి కారణము.సిస్తిక్ ఫైబ్రోసిస్ వలన రోగులు పుట్టుకతోనే శ్వాసకోస వ్యవస్థ పనితీరు తగ్గి వుంటుంది. ఆపై రోజువారీ కాలుష్యలైన వాహనాల నుండి వెలువడే పొగ, పొగాకు పొగ, భవనాలలో ఉష్ణోగ్రత పెంచేందుకు వాడే సాధనాలను సరిగా వాడకపోవుట శ్వాసకోస పని తీరును ఇంకా తగ్గిస్తాయి.[15]

COPD పై ప్రభావములు

[మార్చు]

దీర్ఘకాలం ఊపిరితిత్తుల పనికి అడ్డు పడే రోగాల (Chronic obstructive pulmonary disease) (COPD) కోవకి దీర్ఘకాలపు రొమ్ముపడిశం (chronic bronchitis), ఏమ్ఫీసేమ (emphysema), కొన్ని రకముల ఉబ్బసం చెందుతాయి.[16]

1960-1961 లో గ్రేట్ స్మోగ్ అఫ్ 1952 (Great Smog of 1952) పర్యవసానాలపై చేపట్టిన ఒక అధ్యయనం, 293 మంది లండన్ వాసులను 477 మంది ఇతర పట్టణాల (ఏవైతే క్రానిక్ రొమ్ము పడిశం బారిన మృతిచెందిన వారి సంఖ్యా తక్కువగా చూపెట్టేనో)లో (గ్లౌసెస్తర, పీటర్ బరొహ్, నోర్విచ్) నివసించేవారితో పోల్చింది.ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ కుడా మగవారు, తపాలా శాఖలో పనిచేయు 40-59 వయస్కులు.ఇతర పట్టణముల వాసులతో పోలిస్తే లండన్ వాసులు ఎక్కువ తీవ్రమైన శ్వాసకోస సంబంధిత శోధనలు (దగ్గు, కఫం, దిస్ప్నేయ), తగ్గిన శ్వాసకోస వ్యవస్థ పనితీరు (ఎఫ్ ఇ వి1, అత్యధిక ప్రవాహం నిష్పత్తి), కఫం తయారీ, చీము చేరుట ఎక్కువని తేలినది.ఈ తేడాలు 50-59 వయస్కుల మధ్య ఎక్కువగా కనిపించినవి.ఈ అధ్యయనంలో వయసు, పొగ తాగే అలవాట్లు నియంత్రించారు కావున ఆయా ప్రదేశముల లోని కాలుష్యములే గమనించిన తేడాలకు కారణాలని నిర్ధారించారు.[17]

సిస్తిక్ ఫైబ్రోసిస్ (cystic fibrosis) లాగానే ఎక్కువ పెద్దవైన పట్టణాలలో నివసించడం ద్వారా క్లిష్టమైన అనారోగ్యాలు ఎక్కువగా బయటపడతాయని భావిస్తారు.పట్టణ ప్రాంతాలలోని రోగులు మ్యూకస్ (mucus) ఎక్కువగా తయారవ్వటం, స్వాసకోస వ్యవస్థ పనితీరు తగ్గుట, సొంతగానే క్రానిక్ బ్రోన్కైటిస్, ఏమ్ఫీసేమ ఉన్నవని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.[18]

1952 లో మహా స్మోగ్

[మార్చు]

1952 డిసెంబరు మొదట్లో ఒక చల్లని పొగమంచు లండన్ పై పరుచుకొంది.చలి తట్టు కోవటానికి లండన్ వాసులు మామూల కంటే ఎక్కువగా బొగ్గును కాల్చడం మొదలు పట్టారు.దీని వలన తయారైన వాయు కాలుష్యం, ఫాగ్ లోని చల్ల గాలుల సాంద్రత వల్ల బంధింపబడింది.కాలుష్యాలు ఎక్కువగా పోగుపడినవి, ముఖ్యముగా బొగ్గు నుండి వెలువడిన పొగ నాటకీయముగా పెరిగిపోయింది.లండన్ లో గృహావసరాలకు తక్కువ నాణ్యత కలిగిన, సల్ఫర్ శాతం ఎక్కువగా ఉన్న బొగ్గును వాడటం సమస్యను ఇంకా తీవ్రపరిచింది. దేశంలోని యుద్ధానంతర ఆర్థిక మాన్ద్యతను ఎదుర్కొనుటకు, మంచి నాణ్యతగల బొగ్గును ఎగుమతి చేసేందుకు అనుమతులిచ్చారు.ఈ పొగమంచు, లేక స్మోగ్, ఎంత దట్టముగా ఉన్నదంటే డ్రైవింగ్ చాల కష్ట సాధ్యము లేక అసాధ్యమైనది.[19] ద్ర్స్యత్వము బాగా తగ్గిపోవడంతో నేరాలు పెరిగాయి అంతేకాక రవాణా ఆలస్యం కావడం, పట్టణం మొత్తం స్తంభించిపోయింది.చలి వల్ల పొగమంచు ఆవరించుకొన్న 4 రోజులలో 4000 మంది మృత్యు వాత పడ్డారు.[20]

పిల్లలపై ప్రభావం

[మార్చు]

వాయు కాలుష్యములు ఎక్కువగా ఉన్న ప్రపంచ పట్టణాలలోని పిల్లలు ఉబ్బసం, నిమోనియా, ఇతర శ్వాసకోస సంబంధమైన జబ్బుల బారిన పడవచ్చును అలాగే ఆయ పట్టణాలలో జననాలు తక్కువగా ఉండవచ్చును.యువత ఆరోగ్య పరిరక్షణా చర్యలను న్యూ ఢిల్లీ వంటి పట్టణాలలో చేపట్టారు. ఇక్కడ ఇప్పుడు కంప్రెస్ చేయబడిన సహజ వాయువును బస్సులలో వాడుతున్నారు. దీని వలన పీ-సూప్ స్మోగ్ ఏర్పడదు.[21]ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన పరిశోధన ప్రకారం ఏ దేశాలలో బీదరికం, జనాభా పెరుగుదల ఎక్కువగా వున్నాయో ఆ దేశాలలో నలుసు పదార్థము అత్యధికమైన నిష్పత్తిలో ఉంది.ఈ దేశాలకు ఉదాహరణ: ఈజిప్టు, సూడాన్, మంగోలియా, ఇండోనేసియా.1970 లో శుద్ధమైన గాలి శాసనము (Clean Air Act) చేయబడింది. అయినాకాని 2002 లో కనీసం 146 మిలియన్ల అమెరికన్లు, 1997 లో జాతీయ పరిసర గాలి నాణ్యతా ప్రమాణాలు తెలిపిన కాలుష్యాలు ఒక్కటైనా ఉన్న ప్రదేశాలలో నివసించారు.[22] ఆ కాలుష్యాలు ఏవనగా: ఓజోన్, నలుసు పదార్థము, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజెన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సీసం.పిల్లలు ఎక్కువ సమయమ బయట గడుపుట వలన పైగా చిన్నపాటి శ్వా సకోస వ్యవస్థ ఉండుట వలన, వాయు కాలుష్యపు ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు.

మిగతా వాటితో పోల్చితే "శుద్దమైన" ప్రదేశాలు, వాటిలో ఆరోగ్యం పైన ప్రభావములు

[మార్చు]

తక్కువ కాలుష్యమున్న ప్రాంతాలలో కూడా ప్రజారోగ్యముపై ప్రభావములు బహు తీవ్రమైనవి, ఖరీదైనవి కావచ్చును. ఇది ఎందుకంటే కాలుష్యము తక్కువగా ఉన్నను ప్రభావము కలిగించవచ్చు, ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇట్టి గాలిని దానితో పాటు కాలుష్యములను పీల్చుకోనగలరు. బ్రిటిష్ కొలంబియా ఊపిరితిత్తుల అసోసియేషన్ వారి కోసం 2005 లో జరిపిన ఒక శాస్త్ర బద్దమైన అధ్యయనంలో పరిసరాలలోని నలుసు పదార్ధము 1%, ఓజోన్ 2.5 రెట్లు తగ్గినచో ఏటా 29 మిలియన్ అమెరికన్ డాలర్లను ఆ ప్రాంతంలో 2010లో అదా చేయవచ్చు.[23] ఈ విషయము ప్రాణాంతకమైన, వ్యాధిగ్రస్త పరుచు ప్రభావాల ఆరోగ్య విలువను తెలిసికొనుట పై ఆధారపడుతుంది.

తగ్గించేందుకు చర్యలు

[మార్చు]

వాయు కాలుష్యమును తగ్గించుటకు వివిధ రకములైన కాలుష్య నియంత్రణ టెక్నాలజీలు, భూమిని వాడుటకు ప్రణాళిక (land use planning) స్త్రాటేజీలు అందుబాటులో ఉన్నాయి.అతి సామాన్య స్థాయిలో భూమి వాడుకా ప్రణాళికలో జోన్లను ఏర్పరుచుట, రవాణా వ్యవస్థను ప్లాన్ చయుట ఇమిడి ఉంటాయి.ఎక్కువ భాగం అభివృద్ధి చెందినా దేశాలలో, భూమి వాడుకా ప్రణాళిక సోషల్ పాలసీలో ముఖ్యమైన భాగము. దీనివలన భూమిని సమర్ధవంతంగా దేశపు, ప్రజల బాగు కోసమే కాక పర్యావరణాన్ని పరిరక్షించుటకు వీలవుతుంది.

చలనం కలిగిన మూలాలనుండి వెలువడే కాలుష్యాన్ని తగ్గించటానికి చేసే ప్రయత్నాలు కొన్ని: ప్రాథమిక నిబంధన (చాలా అభివృద్ధి చెందినా దేశాలలో అనుమతులిచ్చే నిబంధనలున్నాయి), నిబంధన పరిధి పెంచి కొత్త మూలాలను కలుపుకొను, (విహారనౌక (cruise), రవాణా నౌకలు, వ్యవసాయ పనిముట్లు, గ్యాస్ తో నడిచే లాన్ త్రిమ్మర్లు,చెయిను సాయముతో నడిచే రంపం (chainsaw), స్నో మొబైల్స్ (snowmobiles)) వంటి చిన్న పరికరాలు, ఇంధన వాడుకలో సమర్ధత పెరిగింది (ఉదాహరణకు హైబ్రీడ్ వాహనాలు (hybrid vehicle), ఎక్కువ శుద్ధమైన ఇంధనాలకు (బైయో ఇతనాల్ (bioethanol), బయో డీసెల్ (biodiesel) ఎలెక్ట్రి నిక్ వాహనాలుగా మార్పు మొదలైనవి) మార్పు చేసికొనుట.

నియంత్రించు సాధనాలు

[మార్చు]

ఈ కింద చెప్పబడిన వస్తువులను సామాన్యముగా పరిస్రమలలోను, రవాణా సాధనాలలోను కాలుష్య నివారణ యంత్రాలుగా వాడతారు.అవి కాలుష్యం|కాలుష్యము (contaminant)లను నిర్మూలించగలవు లేక వాటిని వాతావరణంలోకి ప్రవేశించే లోపే వ్యర్థ ప్రవాహము నుండి తీసివేయగాలవు.

  • నలుసు (Particulate control)
    • మెకానికల్ పోగు చేయు సాధనాలు (సైక్లోనిక్ విభజన|దుమ్ము తుఫానులు (dust cyclones), మల్తిసైక్లోన్లు (multicyclones))
    • ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటార్|ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటార్లు (Electrostatic precipitator). ఒక ఎలెక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటార్ (ఇ ఎస్ పి), లేక ఎలెక్ట్రోస్టాటిక్ ఎయిర్ క్లీనర్ అనబడేది ఒక నలుసులను పోగు చేయు సాధనము. ఇది పారుచున్న వాయువు నుండి (గాలి) ఎలెక్ట్రో-స్టాటిక్ చార్జి యొక్క ఫోర్సు సాయముతో నలుసులను పట్టుకోనును.ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటార్లు ఎంతో సమర్ధవంతమైన వడపట్టే సాధనాలు. ఇవి వాయుప్రవాహాన్ని చాలా తక్కువగా మారుస్తాయి లేదా అడ్డుకొంటాయి. అవి దుమ్ము పొగ వంటి నలుసు పదార్ధాలను వాయు ప్రవాహం నుండి బహు తేలికగా వేరుచేయగాలవు.
    • దుమ్ము పోగేసే సాధనము#బ్యాగ్ హౌస్ రకాలు|బ్యాగ్ హౌస్లు (Baghouses) పెద్ద పెద్ద మోతాదులలో దుమ్ము పట్టడానికి వీలుగా తయారుచేసారు. దుమ్ము పోగేసే సాధనంలో ఒక బ్లోయార్ (గాలిని వేగంగా పంపు సాధనము), దుమ్మును వడపోయు సాధనము, వడపోత సాధనాన్ని సుద్దిచేసే వ్యవస్థ, ఒక దుమ్ము తీసికొను పాత్ర లేక దుమ్మును తీసివేయు వ్యవస్థ (గాలి సుద్దిచేయు యంత్రములలో వడపోయు సాధనాలనే దుమ్ము తీసివేయుటకు వాడే వాటికంటే విభిన్నమైనది).
    • వెట్ స్క్రాబ్బార్|నలుసు స్క్రాబ్బర్లు (Particulate scrubbers)వెట్ స్క్రాబ్బార్ ఒక రకమైన కాలుష్యాన్ని నియంత్రించు టెక్నాలజీ.ఫర్నేస్లలో వాడే ఇంధన గ్యాస్ లేక ఇతర విధాలైన గ్యాస్ స్త్రీంస్ ల లో వెలువడే కాలుష్యములను వాడే కొన్ని సాధనాలను గూర్చి ఈ పద బంధం తెలియ చెప్పును.ఏదేని వెట్ స్క్రాబ్బార్లో కాలుష్యం చెందినా వాయువుని సుద్ది చేసే ద్రావకం లోకి ప్రసరింప చేస్తారు. ఇది కలుషితమైన గాలిలోకి సుద్దిసుసే ద్రావకాన్ని స్ప్రే చేయడం ద్వారా కాని, ద్రావకంలోనికి కలుషిత వాయువుని సరఫరా చేయడం ద్వారా కానీ మరి ఎ ఇతర ఒక దానితో మరొకటి కలిసే / తగిలే పద్ధతి ద్వారా కానీ కాలుష్యములను తీసివేయుటకు చేస్తారు.
  • స్క్రాబ్బార్ / తోమే / రుద్దే / సుద్ది చేసే ఉపకరణం|సుద్ది చేసే ఉపకరణం / స్క్రాబ్బార్ (Scrubber)లు
  • నైట్రోజెన్ ఆక్సైడ్|ఎన్ ఒ ఎక్స్ నియంత్రణ (NOx control)
    • ఎల్ ఒ-ఎన్ ఒ ఎక్స్ బర్నర్|తక్కువ ఎన్ ఒ ఎక్స్ బర్నర్లు (Low NOx burners)
    • ఎంచుకొన్న పదార్థములను ఉత్ప్రేరకము సాయముతో తగ్గించుట (Selective catalytic reduction) (ఎస్ సి ఆర్)
    • ఎంచుకొన్న పదార్థములను ఉత్ప్రేరకము లేకుండా తగ్గించుట (Selective non-catalytic reduction) (ఎస్ ఎన్ సి ఆర్)
    • వెట్ స్క్రాబ్బార్|ఎన్ ఒ ఎక్స్ స్క్రాబ్బర్లు (NOx scrubbers)
    • వ్యర్థ వాయువులను తిరిగి ప్రసరింపచేయుట (Exhaust gas recirculation)
    • మోటారు లో ఉత్ప్రేరకం సాయముతో వ్యర్ధ వాయువుల నుండి విష పదార్ధములను తొలగించు సాధనం / కాటలైటిక్ కన్వేర్టార్ (Catalytic converter) (అలాగే VOC నియంత్రణ కొరకు)
  • త్వరిత సేంద్రీయ మిశ్రమము|వి ఒ సి తగ్గించుట (VOC abatement)
    • చైతన్యవంతమైన కర్బనము (activated carbon) వంటి పీల్చుకొనుట / తెట్టె కట్టు|పీల్చుకోను / తెట్టేకట్టు వ్యవస్థలు (Adsorption systems)
    • గ్యాస్ మంట|దివిటీలు (Flares)
    • థెర్మల్ అక్సిడైజర్ (Thermal oxidizer)లు
    • కాటలైటిక్ అక్సిడైజర్ (Catalytic oxidizer)లు
    • బయో ఫిల్టర్ (Biofilter)లు
    • వెట్ స్క్రాబ్బార్|పీల్చుకొను ప్రక్రియ (తోము / రుద్దు / సుద్ది చేయు) (Absorption (scrubbing))
    • క్రయోజెనిక్ కండెన్సర్ (Cryogenic condenser)లు
    • వేపర్ రికవరి / ఆవిరి నుండి వెలికి తీయు|ఆవిరి నుండి వెలికి తీయు వ్యవస్థలు (Vapor recovery systems)
  • ఆమ్ల వాయువు (Acid Gas)/ఎస్ ఒ<ఎస్ యు బి>2</ఎస్ యు బి> (SO2) ని నియంత్రించు
    • వెట్ స్క్రాబ్బార్ (Wet scrubber)లు
    • స్క్రాబ్బార్#డ్రై స్క్రాబ్బింగ్|డ్రై స్క్రాబ్బర్లు (Dry scrubbers)
    • ఇంధన వాయువు నుండి గంధకము / సల్ఫర్ / ను తీసివేయు ప్రక్రియ (Flue gas desulfurization)
  • పాదరసం (మూలకము)|పాదరస (Mercury) నియంత్రణ
    • సర్బెంట్ ఇంజెక్షన్ టెక్నాలజీ (Sorbent Injection Technology)
    • ఎలెక్ట్రో-కాటలైటిక్ అక్సిదేషన్|ఎలెక్ట్రో-కాతల్య్తిక్ అక్సిదేషన్ (Electro-Catalytic Oxidation) (ఇ సి ఒ)
    • కే-ఇంధనం (K-Fuel)
  • డయోక్సిన్ (Dioxin), ఫ్యురాన్ (furan) నియంత్రణ
  • ఇతర సంబంధిత సాధనాలు / యంత్రములు
    • మూలముని పట్టుకొనే వ్యవస్థలు (Source capturing systems)
    • ఆపకుండా పని చేయు, వ్యర్థ వాయువులను నియంత్రించు, వ్యవస్థలు (Continuous emissions monitoring systems) (సి ఇ ఎమ్ ఎస్)

లీగల్ రెగ్యులేషన్స్ / చట్టబద్దమైన నిబంధనలు

[మార్చు]
కైరోలో పొగ మంచు

మామూలుగా రెండు రకములైన గాలి నాణ్యతా ప్రమాణములు ఉన్నాయి.మొదటి రకపు ప్రమాణాలు (యు.ఎస్. జాతీయ పరిసర వాయు నాణ్యతా ప్రమాణాలు (National Ambient Air Quality Standards) వంటివి) కొన్ని ప్రత్యేకమయిన కాలుష్యములకు వాతావరణంలో అత్యధిక గాఢతలు కేటాయించాయి.పర్యావరణ ఏజన్సీలు ఇట్టి గాఢతలను చేరటానికి కావలసిన నిబంధనలను విధిస్తాయి.రెండో రకపు ప్రమాణాలు (నార్త్ అమెరికన్ వాయు నాణ్యతా సూచిక (Air Quality Index) వంటివి) కొలబద్దవలె కొన్ని గడపలను ఏర్పాటు చేసి వీటి ద్వారా జనాభాకు బాహ్య ప్రదేశములలో ఉండుటలోని అపాయమును తెలియచేస్తాయి.ఈ కొలబద్ద కాలుష్యముల మధ్య విభేదాలను పరిగణనలోకి తీసికొనవచ్చు లేక తీసికొనకపోవచ్చు.

కెనడా

[మార్చు]

కెనడాలో గాలి నాణ్యతను కెనడియన్ కౌన్సిల్ అఫ్ మినిస్టర్స్ అఫ్ ది ఎన్విరాన్మెంట్ (Canadian Council of Ministers of the Environment) (సి సి ఎమ్ ఇ), ఆమోదించిన ప్రమాణాల ప్రకారం కొలుస్తారు. సి సి ఎమ్ ఇ వాతావరణపు బాధ్యతలు కల ఫెడరల్, ప్రొవిన్సియల్, తెర్రిటోరియల్ మినిస్టర్ల తో కూడిన ప్రభుత్వ విభాగం.సి సి ఎమ్ ఇ కెనడా మొత్తానికి వర్తించే ప్రమాణాలు (Canada Wide Standards) తయారుచేసింది (సి డబల్యు ఎస్).[24][25] అవి ఏమిటంటే:

  • CWS న.ప.2.5 = 30&ఎన్ బి ఎస్ పి;పిజి/ఎమ్3 (24 గంటలు సగటు కాలం, 2010 వ సంవత్సరానికి, ప్రతి ఏటా పరిసరాల 98 వ పర్సెంతయిల్ కొలత, మూడు సరాసరి సంవత్సరాల సగటు ఆధారంగా).
  • సి డబల్యు ఎస్ ఓజోన్ = 65 ppb (8-గంటల సగటు కాలం, 2010 వ సంవత్సరానికల్లా, 4వ అత్యధిక కొలత యొక్క మూడు సరాసరి సంవత్సరాల విలువల సగటు ఆధారంగా దీనిని నిర్ధారిస్తారు.

గమనించవలసిందేమిటంటే యిట్టి ప్రమాణములను పాటించక పోయినచో ఎట్టి శిక్షలు లేవు.పైగా ఈ ప్రమాణాలు 100000 కంటే ఎక్కువ జనాభా కల ప్రాంతాలకే వర్తిస్తాయి.ఇంకా, ప్రావిన్సులు, ప్రాంతాలు సి సి ఎమ్ ఇ స్థాపించిన ప్రమాణాలకంటే కఠినమైన ప్రమాణాలను పాటించవచ్చును.

యూరోపియన్ యూనియన్

[మార్చు]

యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ తయారు చేసిన ఒక రిపోర్ట్ ప్రకారము రోడ్డు రవాణా (road transport) అనేది యూరోప్ లో అన్నిటికంటే పెద్ద కాలుష్యకారి.[26]

ఆదేశం 2001/81/EC (NECD) కొన్ని వాతావరణ కాలుష్యాల జాతీయ గరిష్ఠ పరిమితులను నియంత్రిస్తుంది.[27] ఎన్ ఇ సి డి రివిజన్ని సన్నద్ధం చేసే పనిలో యూరోపియన్ కమిషన్ (European Commission)కు ఎన్ ఇ సి పి ఐ వర్కింగ్ గ్రూప్ (జాతీయ కాలుష్యాల బాహ్య ప్రసరణ పైని గరిష్ఠ పరిమితులు - పాలిసీ విధానాలు).[28]

యూరోపియన్ పార్లమెంటు, 2008 మే 21 న జరిగిన పరిసర వాయు నాణ్యత, యూరోపులో శుద్ధమైన గాలి పై జరిగిన కౌన్సిల్ జారీ చేసిన ఆదేశం 2008/50/EC (Directive 2008/50/EC)2008-06-11 నుండి అమలులోకి వచ్చాయి. (న్యూ ఎయిర్ క్వాలిటీ దైరేక్టివ్ / క్రొత్త వాయు నాణ్యతా ఆదేశం).[29]

యూరోపియన్ న్యాయస్థానం (European Court of Justice) (ECJ) జూలై 2008 న ఇచ్చిన ముఖ్యమైన తీర్పు తో ప్రతి ఒక్క పౌరుడు తమ ప్రాంత కౌన్సిల్ను వాయు కాలుష్యంపై పోరాటానికి బలవంత పెట్టవచ్చు.మ్యూనిచ్ నివాసి దీటర్ జనేసుక్ (Dieter Janecek) వేసిన కేసు ఈ.యు కోర్టుకు వచ్చింది. దానిలో జనేసుక్ ప్రకారం 1996 గాలి నాణ్యతా ఆదేశం (1996 సెప్టెంబరు 27 నాటి కౌన్సిల్ ఆదేశం 96/62/EC (Council Directive 96/62/EC)పరిసరాల గాలి నాణ్యతను అంచనా వేయటానికి, నియంత్రించటానికి[30]) మ్యూనిచ్ (Munich) అధికారులు నిర్ణీత పరిమితులను మించిన కాలుష్యాలను ఆపుచేయ వలసి యున్నారు.వారు అట్టి కార్యక్రమములు చేపట్టక పోవుటతో జనేసుక్ కేసును యూరోపియన్ న్యాయస్థానంకి తీసుకువచ్చాడు. అక్కడి న్యాయాధికారులు యూరోపియన్ పౌరులు, ఎక్కడైతే గాలి నాణ్యత యూరోపియన్ యూనియన్ పరిమితులను దాటుతాయో అక్కడ తత్సంబంధమైన పనులు చేపట్టమని అధికారులను డిమాండ్ చేయగలరని తీర్పునిచ్చారు.[26]

యునైటెడ్ కింగ్డం

[మార్చు]

యు.కే. పర్యావరణ, ఆహార, గ్రా మ వ్యవహారాల శాఖ (డి ఇ ఎఫ్ అర్ ఎ) (UK's Department for Environment, Food and Rural Affairs (DEFRA)) నిర్ణయించిన వాయు నాణ్యతా లక్ష్యాలు, ఎక్కడైతే అత్యవసరంగా గాలి నాణ్యత నియంత్రించాలో అట్టి పట్టణాలలో నాణ్యతను నియంత్రించే బాధ్యతను అప్పగించాయి.యు.కే ప్రభుత్వము ముఖ్యమైన గాలి కాలుష్యాల[31] నాణ్యతా స్థాయిలు గమనించి ప్రచురించే కేంద్రాలతో కూడిన గాలి నాణ్యతా నెట్వర్క్.[32] ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ (Oxford), బాత్ (Bath), లండన్[33] లలోని గాలి నాణ్యత చాలా తక్కువగా యున్నది.కాలోర్ గాస్ కంపెనీ (Calor Gas company) నిర్వహించి ది గార్డియన్ దినపత్రిక (the Guardian newspaper)లో ప్రచురించిన ఒక వివాదాస్పద అధ్యయనం,[34] ఆక్స్ఫర్డ్ లో ఒక సగటు రోజు నడకను 60 కంటే ఎక్కువ తేలిక (లైట్) సిగరెట్లను కాల్చటంతో పోల్చింది.

యు.కే వాయు నాణ్యతల ఆర్చివ్[35] నుండి మరిన్ని కచ్చితమైన విలువలను సంపాదించవచ్చు. దీనితో ఎవరైనా కూడా ఒక పట్టణపు కాలుష్య నియంత్రణను 2000 సంవత్సరంలో డి ఇ ఎఫ్ ఆర్ ఎ ఆమోదించిన నేషనల్ వాయు నాణ్యతా లక్ష్యాల[36] తో పోల్చి చూడవచ్చును.

తరచూ ప్రాంతీయంగా ఎక్కువైన విలువలను ఉదహరించటం మనము చూస్తాము,కాని సగటు విలువలు కూడా మానవ ఆరోగ్య రిత్యా ముఖ్యమైనవి.ది యుకె జాతీయ వాయు నాణ్యతా సమాచార ఆర్చివ్ దాదాపుగా వాస్తవ కాలంలో పెక్కు యుకె నగరాల, పట్టణాల "ప్రస్తుత అత్యధిక" వాయు కాలుష్య కొలతలను పరీక్షించటానికి వీలు కల్పిస్తుంది.[37] ఈ మూలము నుండి తరచుగా నవీకరించబడు విస్తారమైన సమాచారము తెలిసికోనవచ్చును:

  • గంటగంటకూ ఓజోన్ సగటు (µg/m³)
  • గంటగంటకూ నైట్రోజెన్ డయాక్సైడ్ సగటు (µg/m³)
  • గడిచిన 15 నిమిషాలలో అత్యధిక సల్ఫర్ డయాక్సైడ్ విలువల సగటు (µg/m³)
  • కార్బన్ మోనాక్సైడ్ 8-గంటల సగటు (mg/m³)
  • నలుసు పదార్థం 10 యొక్క 24-గంటల సగటు (µg/m³ గరుత్వ సమాన)

వాయు కాలుష్యము ఆరోగ్యముపై ప్రముఖమైన ప్రభావము కలిగియున్నా దని గుర్తించింది, ఒక సామాన్యమైన పరిధులు సూచించే వ్యవస్థ[38] ను తయారు చేసింది. ఈ వ్యవస్థను వాడుకొని బిబిసీ (BBC) వాతావరణ సర్వీసు రోజూ విడుదల చేసే హెచ్చరిక వ్యవస్థ మనకు వాయు కాలుష్యముల స్థాయిలను సూచిస్తుంది.[39] ఊపిరితిత్తుల సమస్యల, హృద్రోగ బాధితులు పాటించవలసిన నియమ నిబంధనలను డి ఇ ఎఫ్ ఆర్ ఎ ప్రచురించింది.[40]

యునైటెడ్ స్టేట్స్

[మార్చు]
మద్ద్యాన్న సమయములో ఆలస్యముగా హాలీవుడ్ హిల్స్ (Hollywood Hills) నుండి క్రిందకు కొండ మీదున్న గ్రిఫ్ఫిత్ అబ్సేర్వటరీ (Griffith Observatory) వైపు చూస్తున్నపుడు, డౌన్టౌన్ లాస్ ఎంజేల్స్ (Los Angeles) పైన వాయు కాలుష్యం కనపడుతుంది.

1960 వ, 70 వ, 90 వ, దశకాలలో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్స్ (United States Congress) వరుసగా శుద్ధమైన గాలిపై శాసనము (Clean Air Act)లు విడుదల చేసింది. వీటి వలన వాయు కాలుష్యమును నియంత్రించడము బలోపెతమైనది.కొన్ని యు.ఎస్. స్టేట్లు, కొన్ని యూరోపియన్ దేశాలు, చివరకు యూరోపియన్ యూనియన్ దీనిని అనుసరించాయి.శుద్ధమైన గాలి శాసనము ముఖ్యమైన వాయు కాలుష్యముల సమూహము యొక్క గాఢతల పై సంఖ్యాపరమైన పరిమితులను విధించి, వాటిని నివేదించు, అమలుపరచు పద్ధతిని ప్రవేశ పెట్టింది.

1999లో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇ పి ఎ (EPA) కాలుష్య ప్రమాణాల సూచిక (పి ఎస్ ఐ) బదులుగా వాయు లక్షణాల సూచిక (Air Quality Index) ను క్రొత్త నలుసు పదార్థం 2.5, ఓజోన్ ప్రమాణాలను ఏకీకృతం చేయుటకు ప్రవేశ పెట్టింది.

ఈ చట్టాల ప్రభావాలు చాలా విశ్వసిన్చదగినవిగా యున్నవి.యునైటెడ్ స్టేట్స్ లో 1970, 2006 ల మధ్య, పౌరులు, ప్రతి సంవత్సరం కాలుష్యాల బాహ్య ప్రసరణలో ఈ క్రింది తగ్గుదలను అనుభవించారు:[41]

  • కార్బన్ మోనాక్సైడ్ బాహ్య ప్రసరణలు 197 మిలియన్ టన్నుల నుండి 89 మిలియన్ టన్నులకు పడిపోయినవి
  • నిత్రోజేన్ ఆక్సైడ్ బాహ్య ప్రసరణలు 27 మిలియన్ టన్నుల నుండి 19 మిలియన్ టన్నులకు పడిపోయినవి
  • సల్ఫర్ డయాక్సైడ్ బాహ్య ప్రసరణలు 31 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులకు పడిపోయింది
  • నలుసు బాహ్య ప్రసరణలు 80% తగ్గినాయి
  • సీసం బాహ్య ప్రసరణలు 98% కంటే ఎక్కువ తగ్గాయి.

అక్టోబరు 2006లో ఇ పి ఎ (EPA)కు వ్రాసిన లేఖ లో ఏజెన్సీ యొక్క స్వతంత్ర వైజ్ఞానిక సలహాదారులు ఓజోన్ స్మోగ్ ప్రమాణాలను గణనీయంగా తగ్గించాలని, ప్రస్తుతము వ్యాప్తిలోయున్న బలహీనమైన ప్రమాణానికి తగిన వైజ్ఞానిక కారణం లేదని హెచ్చరించారు.ఈ శాస్త్రజ్ఞులు అందుబాటులో సమాచారాన్ని ముక్తకంఠంతో స్మోగ్ పరిమితిని 60 నుండి 70 నలుసులు పర్ బిలియన్[42]

జూన్ 2007 లో, ఇ పి ఎ (EPA), 75 పి పి బి క్రొత్త పరిమితిని ప్రతిపాదించింది.ఇది వైజ్ఞానిక సలహాదారులు చెప్పినదానికంటే తక్కువ కఠినం, కానీ ప్రస్తుత ప్రమాణాని కంటే ఎక్కువ కఠినం.

కొన్ని పరిశ్రమలు ప్రస్తుత ప్రమాణాలనే మార్చకుండా ఉంచేందుకు పైరవీలు చేస్తున్నాయి.పర్యావరణ పరిరక్షకులు, ప్రజారోగ్య పరిరక్షకులు శాస్త్రజ్ఞుల సలహాలను పాటింప చేసేందుకు తగిన విధంగా పావులు కదుపుతున్నారు.

జాతీయ పరిసర గాలి నాణ్యతా ప్రమాణములు (National Ambient Air Quality Standards) అనగా తప్పనిసరిగా కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన రాష్ట్ర, ప్రాంతీయ ప్రభుత్వాల ప్రణాలికలను ఇపిఎ ఆధ్వర్యమ్లో అమలు చేయవలసిందిగా తెలిపే కాలుష్యపు పరిమితులు.

వాతావరణాన్ని మార్చి వేసేంతటి పరిమాణము కలిగిన పొగతో నిండిన గాలులు అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలనుండి పసిఫిక్ మహాసముద్రాన్ని దాటుకొని వస్తున్నాయి. ఈ గాలులు మానవ నిర్మిత సల్ఫేట్ లు, స్మోగ్, పారిశ్రామిక పొగలు, కర్బన నలుసులు, నైత్రేట్లతో కూడిన దుమ్ముతో నిండినవి. లాస్ ఏంజెల్స్, సాన్ ఫ్రాన్సిస్కోల పైన ఉండే గాలిలో దాదాపుగా మూడింట ఒక వంతు సరాసరి ఆసియా (Asia) నుండి వచ్చినదని నిరూపించవచ్చు.దానితోటి మూడువంతుల నల్ల కార్బను నలుసుల కాలుష్యము పడమటి తీరాన్ని (West Coast) చేరుతుంది.[43]

లిబెర్టేరియను (Libertarian)లు సామాన్యముగా కాలుష్యాన్ని నివారించటానికి ప్రోపెర్తెరియన్ (propertarian) విధానాలను ప్రతిపాదిస్తారు.అవి, వేరొకరి పరిసరాలలోని గాలిని కలుషితం చేసే ఎ వ్యక్తీ చేతనైనా గాని సంజాయిషీ ఇప్పించెంతటి కచ్చితమైన బాధ్యతల (strict liability)కు మద్దతు నిస్తాయి.ఈ నేరాన్ని దురాక్రమనగా పరిగణించబడింది. న్యాయస్థానములో సామాన్య చట్ట (common law) ప్రకారము దీనికి వ్యతిరేకముగా దావా (class action) వేసి నష్ట పరిహారము కోరవచ్చును.[44] లిబెర్తెరియన్ సంఘంలో రహదారులన్నీ కూడా స్వతంత్ర వ్యాపార మార్గాల (free market roads) వ్యవస్థలో ప్రైవేటీకరణ చెందుతాయి కావున ఈ రహదారుల యాజమాన్యాలు కూడా తమ ఆస్తులైన రహదారులపై పయనించే వాహనాలనుండి వెలువడే కాలుష్యానికి బాధ్యులవుతారు. అతి హీనమైన కాలుష్యకారులను తమకు చెందినా రోడ్ల పైకి రానివ్వకుండా ఇది వారికి ఆర్థికంగా ప్రోత్సహిస్తుంది.

గణాంక శాస్త్రము

[మార్చు]

అత్యంత కాలుష్యం చెందినా పట్టణాలు

[మార్చు]

వాయు కాలుష్యం సామాన్యముగా జనసాంద్రత అధికంగా కలిగిన మహా నగరాలలో, ముఖ్యముగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఎక్కడైతే పర్యావరణ నియమ నిబంధనలు అమలులో లేవో లేక నామమాత్రంగా వున్నాయో, అక్కడ కూడు కొంటుంది.ఏదేమైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా జన సాంద్రత అధికంగా కలిగిన ప్రదేశాలలో కాలుష్యం అనారోగ్యకరమైన స్థాయిలలో ఉంటుంది.

బొగ్గు పులుసు వాయువు / కార్బన్ డయాక్సైడ్ యొక్క బాహ్య ప్రసరణలు

[మార్చు]
నలుసు పదార్ధంచే అతిగా కాలుష్యం చెందినా పట్టణాలు[45]
నలుసు (Particulate)
పదార్థము,
μg/m³ (2004)
పట్టణం
169 కైరో, ఈజిప్టు (Cairo, Egypt)
150 ఢిల్లీ, ఇండియా (Delhi, India)
128 కోల్కతా, ఇండియా (Kolkata, India) (కలకత్తా)
125 తిఅంజిన్, చైనా (Tianjin, China)
123 ఛొన్గ్కిన్గ్, చైనా (Chongqing, China)
109 కాన్పూర్, ఇండియా (Kanpur, India)
109 లక్నో, ఇండియా (Lucknow, India)
104 జకర్త, ఇండోనేసియా (Jakarta, Indonesia)
101 శేన్యాంగ్, చైనా (Shenyang, China)
మొత్తం CO2 బాహ్య ప్రసరణలు

106 టన్నుల CO2 (CO2) సంవత్సరానికి:[46]

  • యునైటెడ్ స్టేట్స్: 2,795
  • చైనా: 2,680
  • రష్యా : 661
  • ఇండియా: 583
  • జపాన్: 415
  • జర్మనీ : 356
  • ఆస్ట్రేలియా : 300
  • సౌత్ ఆఫ్రికా: 232
  • యునైటెడ్ కింగ్డం: 212
  • సౌత్ కొరియా: 185
తలసరి CO2 బాహ్య ప్రసరణలు

సంవత్సరానికి తలసరి CO2 టన్నులు:[46]

  • ఆస్ట్రేలియా : 10
  • యునైటెడ్ స్టేట్స్: 8.2
  • యునైటెడ్ కింగ్డం: 3.2
  • చైనా: 1.8
  • ఇండియా: 0.5

వాతావరణ వ్యాప్తి

[మార్చు]

వాయు కాలుష్యాన్ని పరిశీలించుటకు వాడే ముఖ్యమైన టెక్నాలజీ సంఖ్యా శాస్త్రపు నమూనా (mathematical model)ల ద్వారా వాయు కాలుష్యాలు క్రింది స్థాయి వాతావరణంలో ఏ విధంగా పయనిస్తాయో చెపుతుంది.ముఖ్యమైన విధానాలు ఈ కింద ఇవ్వబడినాయి:

  • ఒక నిర్దేశిత ప్రదేశంలో మూలం (Point source) ఎలా వ్యాప్తి చెందుతుందో అనేది పారిశ్రామిక మూలాలకు ఉపయోగపడుతుంది.
  • రేఖా మూలము (Line source) యొక్క వ్యాప్తి, విమానాశ్రయాల, రహదారుల పైని వాయు వ్యాప్తి నమూనా (roadway air dispersion modeling) చేయుటకు ఉపయోగపడును.
  • అడవి మంట (forest fire)లతో లేక గాలి దుమారము (duststorm)లతో పోరాడుటలో ఆయా ప్రాంతములోని కాలుష్య వనరుల వ్యాప్తి (Area source) ఉపయోగపడును.
  • స్మోగ్ తయారవుటలో పాల్గొనే కాలుష్యముల గురించి తెలుసుకొనుటకు ఫోటో కెమికల్ (Photochemical) నమూనాలను వాడతారు.
పెక్కు వాతావరణ వ్యాప్తి నమూనాలలో వాడబడినట్టి తేలియాడే గుస్సియన్ వాయు కాలుష్యపు వ్యాప్తిని చిత్రించుట

ఒక ప్రాంతపు వనరు అనే సమస్యను, చాలా కాలంగా, దాదాపు 1900 సంవత్సరం నుండి అధ్యయనం చేయటం వలన, అది తేలికైన సంఖ్యా శాస్త్రాన్ని కలిగి యుండుట మూలంగా, బాగుగా అర్ధం చేసికొన్నారు.అది తేలికైన కాలుష్య గాలుల వాయుకాలుష్య ఇసోప్లేత్లను (isopleths) ముందుగ చెప్పుటకు ఒక గుస్సియన్ (Gaussian) వ్యాప్తి నమూనాని వాడుతుంది. గాలి యొక్క చలన వేగమును, కుప్ప / పోగాగోత్తపు ఎత్తును, బాహ్య ప్రసరణ నిష్పత్తి, స్థిరత్వపు తరగతి (వాతావరణపు తర్బ్యులేన్స్ (turbulence) ని కొలిచే ప్రమాణము).[47][48] ఈ నమూనా చాల ఎక్కువగా వివిధ రకములైన వాతావరణపు సంబంధించిన ప్రయోగాత్మక సమాచారముతో వాలిడేట్, కాలిబ్రేట్ చేయబడింది.

జాతీయ పర్యావరణ విధానపు శాసనం (National Environmental Policy Act), యు. ఎస్. రవాణా శాఖ (U.S. Department of Transportation) (అప్పట్లో ఫెడరల్ రహదారుల పరిపాలనా వ్యవస్థ అనబడేది)ల అవసరాల మేరకు రహదారిపై గాలి వ్యాప్తి నమూనా (roadway air dispersion model)ని 1950వ దశకం ఆఖరుకి, 1960వ దశకం మొదట్లో అభివృద్ధి పరిచారు. ఇది ప్రతిపాదించబడిన నూతన రహదారుల పైని వాయు నాణ్యత ప్రభావాలను, ముఖ్యముగా అర్బన్ ప్రాంతాలలో అర్థం చేసుకోవడానికి దోహద పడుతుంది.పెక్కు పరిశోధకుల సమూహాలు ఈ నమూనాని తయారు చేయటంలో పాలుపంచుకొన్నారు. వాటిలో కొన్ని: లెక్సింగ్టన్, మసాచుసేట్ట్స్ (Lexington, Massachusetts) లోని పర్యావరణ పరిశోధన, టెక్నాలజీ (ERT) గ్రూపు, సన్నీవేల్, కాలిఫోర్నియా (Sunnyvale, California)లోని ESL Inc. గ్రూపు, సక్రామెంతో, కాలిఫోర్నియా (Sacramento, California)లోని కాలిఫోర్నియా వాయు వనరుల బోర్డు (California Air Resources Board)గ్రూపు.యునైటెడ్ స్టేట్స్ పర్యావరణం పరిరక్సించు ఏజెన్సీ (United States Environmental Protection Agency) నుండి సల్ఫర్ హేక్సఫ్లోరైడ్ (sulfur hexafluoride)ను ట్రేసర్ వాయువుగా వాడుతూ ఒక రేఖా మూలము యొక్క నమూనాని పనిచేస్తుందని నిరూపించడానికి లభించిన కాంట్రాక్టు ESL గ్రూపుని ఉత్తేజపరిచింది.ఈ ప్రోగ్రాము, ESL inc. అభివ్రుద్దిపరిచిన రేఖా మూలా నమూనాను పనిచేయునని నిరూపించుటలో సఫలం చెందింది.ఈ నమూనా తయారైన కొత్తలో రహదారి వాయు కాలుశ్యాలకు సంబంధించిన కోర్టు దావాలో వాడబడింది. అలాగే అర్లింగ్టన్, విర్జినియా (Arlington, Virginia) లో విస్తరించిన ఇంటర్స్టేట్ 66 (Interstate 66), న్యూ జెర్సీ loni టర్న్ పైక్ (New Jersey Turnpike)ను ఈస్ట్ బృంస్విక్, న్యూ జెర్సీ (East Brunswick, New Jersey) వరకు వెడల్పు చేయటానికి చేపట్టిన ప్రాజెక్టులో కూడా.

ప్రాంతీయ మూలాల నమూనాలను 1971 నుండి 1974 వరకు ERT, ESL గ్రూపులు అభివృద్ధి చేసినాయి, కాని అవి మొత్తం వాయు కాలుష్యాల బాహ్య ప్రసరనలలో చాల చిన్న భాగాన్ని మాత్రమే ఉపస్పరించగలిగినవి. దీనితో వీటి వాడుకగాని అవసరం గాని రేఖా మూల నమూనా అంతగా వ్యాప్తి చెందలేదు. రేఖా మూల నమూనా1970వ దశకం లోనే వందల కొద్దీ ప్రయోజనాలకు ఉపయోగపడింది. అదేవిధంగా ఫోటో కెమికల్ నమూనాలు ప్రాథమికంగా 1960 లలో, 1970 లలో అభివృద్ధి పరచబదినవి, కాని వాటి ఉపయోగం చాలా ప్రత్యేకత కలిగినది, ప్రాంతీయ అవసరాలకు కావలసినది. ఉదాహరణకు లోస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలలో స్మోగ్ ఏర్పడటాన్ని అర్ధం చేసుకోవటానికి.

పర్యావరణం పై గ్రీన్ హౌస్ వాయువు లోని కాలుష్యాల ప్రభావాలు

[మార్చు]

గ్రీన్హౌస్ ప్రభావం అనేది గ్రీన్హౌస్ వాయువులు వాతావరణపు పై పొరలలో పోగయ్యి భూమి లోని వేడిని పట్టి ఉంచటం వలన లోపలి పొరలు - భూ ఉపరితలము వద్ద వేడి ఎక్కువావుటా, ట్రోపోస్ఫియర్ పొరల వేడి తగ్గుట వలన ఉత్పన్నమయ్యే ఒకానొక స్థితి.రాతి ఇంధనములను మండించుటతో విడుదలైన బొగ్గు పులుసు వాయువు పెద్ద సమస్య అయినది.ఇతర గ్రీన్హౌస్ వాయువులు: మితెన్, హైడ్రోఫ్లోరోకార్బన్ (hydrofluorocarbon)లు, పెర్ ఫ్లోరోకార్బన్ (perfluorocarbon)లు, క్లోరోఫ్లోరోకార్బన్ (chlorofluorocarbon) లు, నైట్రోజెన్ అక్సైడ్లు (nitrogen oxides), ఓజోన్.

శాస్త్రజ్ఞులు సుమారు ఒక శ్తాబ్ధం క్రిందటే ఈ ప్రభావం గురించి అర్ధం చేసుకొన్నారు. ఈ కాలంలో జరిగిన అభివృద్ధి యీ స్థితిని గురించి ఇంకా విస్తృతముగా లోతుగా వివరములు సేకరించుటలో సహాయపడినవి.ప్రస్తుతము శాస్త్రజ్ఞులు, సహజ, మానవ నిర్మిత మూలముల నుండి వెలువడు గ్రీన్హౌస్ వాయువుల మార్పులు, ఆయా ప్రదేశముల శీతోష్ణ స్థితిలో మార్పు వాటి పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు.

ఎన్నో అధ్యయనములు వాతావరణంలో దీర్ఘకాలముగా పెరుగుచున్న బొగ్గుపులుసు వాయువు నిష్పత్తి, దీని కారణంగా సముద్ర జలాలలో ఆమ్లాల శాతం పెరుగుట (increases in the acidity of ocean waters), సముద్రపు జీవావరణాలు వాటి పై రాగల ప్రభావములు గురించి సోధించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]



సూచికలు

[మార్చు]
  1. వాయు కాలుష్య కారకాలు
  2. AP 42, సంపుటి 1
  3. యునైటెడ్ కింగ్డం యొక్క ఎమిషన్ ఫ్యాక్టర్ సమాచార ఖని Archived 2010-07-07 at the Wayback Machine.
  4. "యురోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజన్సీ యొక్క 2005 సంవత్సరపు ఎమిషన్ ఇంవెంతరి గైడ్ బుక్". Archived from the original on 2006-02-09. Retrieved 2009-10-21.
  5. "జాతీయ గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలను తయారు చేయుటకు 1996 ఐపీసిసి మార్పూ చేసి ఇచ్చిన మార్గదర్సకములు. (మార్గదర్సకాల క్రోడీకరణ)". Archived from the original on 2008-03-21. Retrieved 2009-10-21.
  6. "ఆస్ట్రేలియా జాతీయ కాలుష్య జాబితాలోని వ్యర్ధాల బాహ్యప్రసరణ అంచనాలు వేసే పద్దతులను తెలుపు పుస్తకము". Archived from the original on 2008-12-16. Retrieved 2009-10-21.
  7. కెనెడియన్ గ్రీన్ హౌస్ వాయువుల జాబితాను తయారుచేయు పద్దతులు
  8. కొన్ని ఎన్నుకొన్న పర్యావరణ ప్రమాదకారులు వాటివలన సంభవించే మరణాలు, డి ఎ ఎల్ వై స్ - డబల్యూ హెచ్ ఒ సభ్య దేశం చే 2002 లో వేయబడిన అంచనా
  9. http://www.sacbee.com/378/story/1393268.html, http://www.latimes.com/features/health/la-me-pollute13-2008nov13,0,5432723.story, http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2008/11/13/MNQP143CPV.DTL
  10. హోల్లాండ్ డబల్యు డబల్యు, రీడ్ డీడీ. అర్బన్ జీవనం - క్రానిక్ రొమ్ముపడిశం పై ప్రభావం.ల్యాన్సుట్1965; ఐ:445-448.
  11. "ఆరోగ్యంపై కింది ఫ్రేసర్ లోయ గాలి షెడ్డులో గాలి లక్షణాల ప్రభావాన్ని విలువ కట్టడం గురించి 2005 బిసి లో ఊపిరితిత్తుల అసోసియేషన్ వారి రిపోర్టు" (PDF). Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2009-10-21.
  12. కెనడా అంతటా వాడే ప్రమాణాలు
  13. "కెనడా అంతటా వాడే ఓజోన్, నలుసు పదార్ధముల (పి ఎమ్) ప్రమాణాలు" (PDF). Archived from the original (PDF) on 2011-05-27. Retrieved 2009-10-21.
  14. 26.0 26.1 http://correu.cs.san.gva.es/exchweb/bin/redir.asp?URL=http://www.transportenvironment.org/Publications/prep_hand_out/lid:516[permanent dead link]
  15. "యురోపియన్ పార్లమెంటు, కొన్ని వాతావరణ కాలుష్యాల జాతీయ బాహ్యప్రసరణలపై గరిష్ట పరిమితులపై 23 అక్టోబర్ 2001 నాటి కౌన్సిల్ యొక్క ఆదేశం 2001/81/EC" (PDF). Archived from the original (PDF) on 2008-10-29. Retrieved 2009-10-21.
  16. }} -->
  17. http://eur-lex.europa.eu/JOHtml.do?uri=OJ:L:2008:152:SOM:EN:HTML
  18. ఒ జె (OJ)ఎల్ 296, 21.11.1996, పుట.55.యురోపియన్ పార్లమెంటు అ, కౌన్సిల్ చే ఆమోదించబడిన నిభందన (EC) నెం 1882/2003 (Regulation (EC) No 1882/2003) మార్పు చేయబడిన ఆదేశం (ఒజె ఎల్ 284, 31.10.2003, 284, 31.10.2003, పుట.1); 11 జూన్ 2010 నుండి ఆదేశాలు 96/62/EC, 1999/30/EC, 2000/69/EC, 2002/3/EC ఉపసంహరించ (repeal)బడును
  19. "పర్యావరణం, ఆహారం, రూరల్ సంబంధాల శాఖ (డి ఇ ఎఫ్ ఆర్ ఎ ): వాయు కాలుష్యం". Archived from the original on 2009-04-06. Retrieved 2009-10-21.
  20. "ఎల్ ఎ క్యు ఎమ్ వాయు నాణ్యత నియంత్రించు ప్రదేశాలు". Archived from the original on 2009-04-02. Retrieved 2009-10-21.
  21. లండన్
  22. ది గార్డియన్ (The Guardian) దినపత్రికలో యిలా వ్రాసారు "ఆక్స్ఫర్డ్ గాలిని పీల్చడం అనేది రోజుకు 60 సార్లు అనే అలవాటును చేస్తుంది".
  23. "యు.కే వాయు నాణ్యతల ఆర్చివ్". Archived from the original on 2008-11-07. Retrieved 2009-10-21.
  24. "యుకె జాతీయ వాయు నాణ్యతా లక్ష్యాలు". Archived from the original on 2009-04-17. Retrieved 2009-10-21.
  25. "ప్రస్తుత వాయు కాలుష్య అధికారిక సమాచార ప్రకటన". Archived from the original on 2006-01-13. Retrieved 2009-10-21.
  26. "వాయు కాలుష్య పరిధులు, సూచికలు". Archived from the original on 2008-10-22. Retrieved 2009-10-21.
  27. "బిబిసి వాతావరణ సేవ". Archived from the original on 2009-02-18. Retrieved 2009-10-21.
  28. "వాయు కాలుష్యము - నీ ఆరోగ్యానికి అది ఏమి చేస్తుంది". Archived from the original on 2009-04-12. Retrieved 2009-10-21.
  29. వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసము, మే 23,2006
  30. "అమెరికన్ లంగ్ అసోసియేషన్, జూన్ 2,2007". Archived from the original on 2009-04-26. Retrieved 2009-10-21.
  31. "వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసము, జూలై 20,2007". Archived from the original on 2008-04-15. Retrieved 2009-10-21.
  32. ప్రపంచ బ్యాంకు గణాంకాలు
  33. 46.0 46.1 ఈ సమాచారాన్ని, కార్బను చర్యలను నమోదు (CARMA) చేయు సమాచార పట్టిక నుండి పొందవచ్చును. ఈ పట్టికను ప్రపంచ అభివృద్ధి కేంద్రం (Center for Global Development) తయారుచేసింది.CARMA, భౌగోళిక ప్రాంతములు Archived 2008-11-21 at the Wayback Machine
  34. www.crcpress.com Archived 2007-11-05 at the Wayback Machine
  35. www.air-dispersion.com

బాహ్య లింకులు

[మార్చు]
గాలి నాణ్యత శాస్త్రము, సమాచారము
గాలి నాణ్యత నమూనా చేయుట
మానవ ఆరోగ్యం మీద ప్రభావములు